భారతదేశంలో మతం
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో మతం లేదా భారతదేశంలో మతాలు: భారతదేశపు జనాభాలో హిందూ మతం అవలంబించువారు 80% ఉన్నారు. భారత్ లో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం (13.43%) జనాభాతో ఉంది.ఇతర భారతీయ మతాలు బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతంను అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ ఉన్నారు.భారత్ లోని 2% జనాభా క్రైస్తవ మతం అవలంబిస్తున్నారు.


జనగణన
భారతదేశంలో మత ప్రాతిపదికపైన జనాభా విభజన:
వనరు: భారత జనాభా గణాంకాలు, 2001[1]
విషయము | హిందువులు[2] | ముస్లింలు[3] | క్రైస్తవులు[4] | సిక్కులు[5] | బౌద్ధులు[6] | జైనులు[7] | ఇతరులు[8] |
---|---|---|---|---|---|---|---|
2001 మొత్తం జనాభాలో% | 80.46 | 13.43 | 2.34 | 1.87 | 0.77 | 0.41 | 0.65 |
10-సం.లలో పెరుగుదల% (est '91–'01) [9][β] | 20.3 | 36.0 | 22.6 | 18.2 | 24.5 | 26 | 103.1 |
లింగ నిష్పత్తి* (సగటు 933) | 931 | 936 | 1009 | 893 | 953 | 940 | 992 |
అక్షరాస్యతా శాతం (సగటు 64.8) | 65.1 | 59.1 | 80.3 | 69.4 | 72.7 | 94.1 | 47.0 |
పని నిమగ్నతా శాతం | 40.4 | 31.3 | 39.7 | 37.7 | 40.6 | 32.9 | 48.4 |
గ్రామీణ లింగ నిష్పత్తి[9] | 944 | 953 | 1001 | 895 | 958 | 937 | 995 |
పట్టణ లింగ నిష్పత్తి[9] | 894 | 907 | 1026 | 886 | 944 | 941 | 966 |
శిశు లింగ నిష్పత్తి (0–6 సం.లు) | 925 | 950 | 964 | 786 | 942 | 870 | 976 |
వనరులు: మతములపై మొదటి రిపోర్టు: 2001 భారత జనాభా గణాంకాలు[10]
α. ^ మావో-మరామ్, పావోమాటా, మణిపూర్కు చెందిన 'సేనాపతి జిల్లా' కు చెందిన పురుల్ ఉప-విభజనలను లెక్కలోకి తీరుకోలేదు. β. ^ 1991 లో అస్సాం, జమ్ము కాశ్మీర్లో జనగణన జరుగలేదు. ఈ సమాచారంలో కూర్చబడలేదు.
భారత ఉపఖండం

భారత ఉపఖండంలో మతాల సమాచారాలు:
- భారతదేశం: 80% హిందువులు, 13% ముస్లిం, 2% క్రైస్తవులు, 2% సిక్కులు (1,100 M)
- పాకిస్తాన్: 97% ముస్లిములు, 2% హిందువులు, 1% క్రైస్తవులు (165 M)
- బంగ్లాదేశ్: 83% ముస్లిములు, 16% హిందువులు (150 M)
- మయన్మార్: 89% బౌద్ధులు, 4% ముస్లిం, 4% క్రైస్తవులు (43 M)
- శ్రీలంక: 70% బౌద్ధులు, 15% హిందువులు, 7% ముస్లిం, 7% క్రైస్తవులు (20 M)
వీటి మొత్తంలో: 63% హిందువులు, 29% ముస్లిం, 5% బౌద్ధులు, 2% క్రైస్తవులు, 1% సిక్కులు.
మతాలు, విభాగాలు
హిందూ మతం
హిందూమతం ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న శక్తివంతమైన మతం. భారతదేశ జనాభాలో 80% కన్నా ఎక్కువ జనాభా గల మతము. బహుదేవతారాధన, విగ్రహారాధన ఈ మతంలోని ప్రధానలక్షణాలు. అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులతో కూడి మానవజీవన మనుగడకు సహకరిస్తూ, జీవిత పరమార్ధాన్నీ తెలియచేస్తూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే మతం, అనేక నాగరికతలకు పుట్టినిల్లు హిందూమతం. ప్రపంచంలో గల హిందూ మతస్థులలో 90% కన్నా ఎక్కువగా భారత్ లోనే నివసిస్తున్నారు.
- ఈ మతము గురించి చూడండి: హిందూ మతము
అయ్యావళి
దక్షిణ భారత దేశంలో ఈ సమూహం ఉంది. వీరు హిందూ మతానికి అంతర్భాగంగానే ఉన్నారు. వీరెక్కువగా తమిళనాడు, కేరళలో గలరు.
ఇస్లాం
భారతదేశంలో మరొక మతం ఇస్లాం. మధ్యప్రాచ్యంలో సా.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ఈ మతం ముస్లింరాజుల దండయాత్రలు, ఆక్రమణల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టింది. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు. దీనిలో సున్నీ ఇస్లాం, షియా ఇస్లాం అను రెండు పెద్ద వర్గాలున్నాయి.
అహ్మదీయ
అహ్మదీయ అనునది ఒక చిన్న ఉద్యమం. దీనిని మిర్జా గులాం అహ్మద్ ప్రారంభించాడు. ఇతనిని అనుసరించేవారి సంఖ్య భారత్ లో కొద్దిగా గలదు. వీరు ముస్లింల సమూహములోనే ఒక అంతర్భాగమని భావిస్తారు గాని, ఇస్లాంకు ఈ ఉద్యమానికి ఏలాంటి సంబంధం లేదని, ఇదొక ఫిత్నా అని ముస్లింలు భావిస్తారు.
జైన మతం
భారతదేశంలో జైన మతస్థులు దాదాపు భారత జనాభాలో 0.4% గలరు.
- ఈ మతము గురించి చూడండి: జైన మతం
బౌద్ధ మతం
సాశ.పూర్వం భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన మతం బౌద్ధమతం. గౌతమ బుద్ధుడనే రాజవంశీకుడు అహింస, సమానత్వం ప్రాతిపదికన ఈ మతాన్ని ప్రవచించాడు. త్రిపిఠకాలు ఈ మతానికి పవిత్రగ్రంథాలు. భారతదేశంలో బౌద్ధ మతస్థులు దాదాపు 90 లక్షలు గలరు. వీరెక్కువగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లఢఖ్ లలో ఉన్నారు.
- ఈ మతము గురించి చూడండి: బౌద్ధ మతం
సిక్కు మతం
పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా, ఇతర ప్రాంతాలలో తక్కువగా సిక్కు మతస్తులు నివసిస్తున్నారు. సిక్కుమతం భారతదేశంలోనే జన్మించిన మతం. అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుమతస్తులకు ప్రధాన పుణ్యక్షేత్రం. 17 శతాబ్దిలో ఆత్మగౌరవ ప్రకటనగా ఈ మతం ఏర్పడింది. కత్తి, తలపాగా, గడ్డం వంటి మతచిహ్నాలతో సిక్కుమతస్తులు విలక్షణంగా కనిపిస్తారు. వారి పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సిక్కులు మతగురువుగా భావించి గౌరవిస్తారు. భారతదేశంలో సిక్కు మతస్థులు 1.93 కోట్లు గలరు. వీరెక్కువగా పంజాబు రాష్ట్రం, ఢిల్లీ, హర్యానాలో గలరు. భారతదేశంలోని పలు నగరాలలోనూ వీరి జనాభా కానవస్తుంది.
- ఈ మతం గురించి చూడండి: సిక్కు మతం
క్రైస్తవ మతం
మధ్యప్రాచ్యంలో జన్మించి ఐరోపా ప్రాంతానికి అటుపై ఇతర ప్రపంచానికి విస్తరించిన క్రిస్టియానిటీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం కాగా భారతదేశంలోని మతాలలో ఒకటి. క్రిస్టియానిటీ సా.శ..ఒకటో శతాబ్దంలోనే దేశంలో అడుగుపెట్టినట్టుగా, తొలి చర్చిని కట్టినట్టుగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అటుపై మధ్యయుగాల్లో భారతదేశంలో అడుగుపెట్టిన పలువురు క్రైస్తవ మతబోధకుల ద్వారా ఈ మతం విస్తరించింది. దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో చర్చిలు నిర్మించి ఆరాధనలు చేస్తున్నారు. భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 2.9% గలరు. భారతదేశమంతటా వ్యాపించియున్నారు.
- ఈ మతము గురించి చూడండి: క్రైస్తవ మతం.
యూద మతం
ఈ మతస్తులు భారత్ లో 1991 జనగణన ప్రకారం 5271 మంది గలరు. వీరెక్కువగా మహారాష్ట్ర, కేరళలో గలరు.
- ఈ మతము గురించి చూడండి: యూద మతం
జొరాస్ట్రియన్ మతం
జొరాస్ట్రియన్లు లేదా పారసీ మతస్తులు భారతదేశ జనాభాలో 0.06% గలరు. వీరెక్కువగా ముంబాయిలో గలరు.
- ఈ మతం గురించి చూడండి: జొరాస్ట్రియన్ మతం
బహాయి విశ్వాసం
ఈ మతస్తులు భారత్ లో దాదా పు 22 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని బహాయి విశ్వాసులలోని ఎక్కువమంది భారతదేశంలో ఉన్నారు.
- ఈ మతం గురించి చూడండి: బహాయి విశ్వాసం
పాదపీఠికలు, మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.