భలే అమ్మాయిలు (1957 సినిమా)

From Wikipedia, the free encyclopedia

భలే అమ్మాయిలు (1957 సినిమా)

'భలే అమ్మాయిలు' తెలుగు చలన చిత్రం,1957 సెప్టెంబర్ 6 న విడుదల.నరసు స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి, చిలకలపూడి సీతారామాంజనేయులు, కొంగర జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం, సాలూరు రాజేశ్వరరావు, సాలూరు హనుమంతరావు అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
భలే అమ్మాయిలు
(1957 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
నిర్మాణం వి.ఎల్.నరసు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
చిలకలపూడి సీతారామాంజనేయులు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు & ఎస్. హనుమంతరావు
నిర్మాణ సంస్థ నరసూ స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

నటీనటులు

సాంకేతిక వర్గం

దర్శకుడు: వేదాంతం రాఘవయ్య

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు,హనుమంతరావు

గీత రచయితలు: వెంపటి సదాశివ బ్రహ్మం,కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, జిక్కి, పి.లీల, ఎం.ఎల్.వసంత కుమారి, బి.గోపాలం

నిర్మాత: వి.ఎల్.నరసు

నిర్మాణ సంస్థ:నరసూ స్టూడియోస్

విడుదల:06:09:1957.

పాటలు

  1. అందాల రూపము ఆనంద దీపము కనుదోయి విందుచేయు - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
  2. ఓహో బంగరు చిలుకా అహా ఎందుకే అలకా ఇలా చూడవు మాటడవు - జిక్కి
  3. ఓహోహో లొకమున యవ్వనులైన ప్రేమికుల కన్ను కన్ను కలసి - పి.సుశీల బృందం
  4. గోపాల జాగేలరా ననులాలించి పాలింప రావేలరా - ఎం.ఎల్.వసంతకుమారి, పి.లీల
  5. చకచక జణత తకథిమి కిటత పకపక నవ్వుతా పంతమాడుతా- జిక్కి బృందం - రచన: కొసరాజు రాఘవయ్య
  6. చీటికి మాటికి చీటికట్టి వేధించేవానాడు లాటరిలోన లక్షలు - పి.బి.శ్రీనివాస్, జిక్కి
  7. దాగుడుమూతలు చాలునురా నీ ఆగడమంతా తేలెనురా దొరికేవురా - జిక్కి బృందం
  8. నాణెమైన సరుకుంది లాహిరి మీరు బోణిచేసారంటే - పి.బి.శ్రీనివాస్, బి.గోపాలం
  9. మది వుయ్యాలలూగే నవభావాలేవోరేగె మానస - పి.లీల, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
  10. ముద్దులొలికేవోయి నవ్వుచిలికేవోయి అందచందాల పాపాయి - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
  11. దిల్లానా_ఎం.ఎల్.వసంత కుమారి.

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.