బ్రెండన్ కురుప్పు

శ్రీలంక మాజీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia

డాన్ సార్ధ బ్రెండన్ ప్రియంత కురుప్పు, శ్రీలంక మాజీ క్రికెటర్. వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన ప్రపంచంలోని అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్‌లలో ఇతను ఒకడు. బ్రెండన్ 1983 నుండి 1990 వరకు జాతీయ జట్టు కోసం 54 వన్డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ కెరీర్ పెద్దగా చెప్పుకోదగ్గది కొలంబోలో ఒక ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసి, శ్రీలంక తరఫున అరంగేట్రం టెస్ట్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.[1][2]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
బ్రెండన్ కురుప్పు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డాన్ సార్ధ బ్రెండన్ ప్రియంత కురుప్పు
పుట్టిన తేదీ5 January 1962 (1962-01-05) (age 63)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 132)1987 ఏప్రిల్ 16 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1991 ఆగస్టు 22 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 35)1983 ఏప్రిల్ 30 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1990 మే 2 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 4 54
చేసిన పరుగులు 320 1022
బ్యాటింగు సగటు 53.33 20.03
100లు/50లు 1/0 0/4
అత్యధిక స్కోరు 201* 72
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 30/8
మూలం: Cricinfo, 2005 ఆగస్టు 14
మూసివేయి

కురుప్పు మాల్దీవుల జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా పనిచేశాడు. 2018 నవంబరులో శ్రీలంక క్రికెట్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్‌లో ఎంపికయ్యాడు. [3]

తొలి జీవితం

కురుప్పు 1962, జనవరి5న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. ఆనంద కళాశాల కోసం స్కూల్ క్రికెట్, బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్, బర్గర్ రిక్రియేషన్ క్లబ్‌ల కోసం క్లబ్ క్రికెట్ ఆడాడు.[4]

అంతర్జాతీయ కెరీర్

1983 ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ఇతని అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది. అక్కడ అతను పాకిస్తాన్‌పై కెరీర్‌లో అత్యుత్తమ 72 పరుగులు చేయడంలో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్లు కొట్టాడు. శ్రీలంక 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన డెర్బీలో 62 పరుగులతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు.

రికార్డులు

కురుప్పు తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1] బంతులు (548), నిమిషాల (777) పరంగా నెమ్మదిగా టెస్ట్ మ్యాచ్ డబుల్ సెంచరీ చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.[5] అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన మొదటి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, ఆర్ఈ ఫోస్టర్, లారెన్స్ రోవ్ తర్వాత అలా చేసిన మూడవ ఆటగాడిగా రికార్డు సాధించాడు. టెస్ట్ అరంగేట్రం (777 నిమిషాలు)గా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు,[6] టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్.[7][8]

మూలాలు

ప్రస్తావనలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.