సువీరన్ దర్శకత్వంలో 2011లో విడుదలైన భారతీయ సినిమా From Wikipedia, the free encyclopedia
బ్యారీ, 2011 జూన్ 9న విడుదలైన భారతీయ సినిమా. సువీరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బేరీ భాషలో ఉంది. ఈ భాషలో నిర్మించిన మొదటి సినిమా ఇది.[3][4] అనేక చిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన ఈ సినిమాలో మల్లిక, అల్తాఫ్ హుస్సేన్, మాముక్కోయ, అంబికా మోహన్ తదితరులు నటించారు. దక్షిణాది కన్నడ ప్రాంతంలోని థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి.[5][6][7]
బ్యారీ | |
---|---|
దర్శకత్వం | సువీరన్ |
స్క్రీన్ ప్లే | సువీరన్ |
నిర్మాత | అల్తాఫ్ హుస్సేన్ |
తారాగణం | మల్లిక అల్తాఫ్ హుస్సేన్ మాముక్కోయ అంబికా మోహన్ |
ఛాయాగ్రహణం | మురళీకృష్ణన్ |
కూర్పు | ఎస్. మనోహర్ |
సంగీతం | విస్వజిత్ |
నిర్మాణ సంస్థ | థన్నీర్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2011, జూన్ 9 (మంగళూరు)[1] |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బేరీ భాష |
బడ్జెట్ | ₹7 మిలియను (US$88,000)[2] |
2011లో జరిగిన 59వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకోగా, మలయాళ నటి మల్లికకు జ్యూరీ పురస్కారం వచ్చింది.
థన్నీర్ ఫిల్మ్స్ బ్యానరులో టిహెచ్ అల్తాఫ్ హుస్సేన్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ దక్షిణ కన్నడ జిల్లాలైన సూరత్కల్, జోకట్టే, బాజ్పే, తోకోట్టు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో జరిగింది.[8][9][10][11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.