బోర్నియో
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
బోర్నియో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపము. ఇది ఆసియాలో అతిపెద్ద ద్వీపం. ఇది ఆగ్నేయాసియా సముద్రప్రదేశానికి కేంద్రంగా ఉంది. ఈ ద్వీపము జావా ద్వీపానికి ఉత్తరంగా, సులవెసికి పశ్చిమంగా, సుమాత్రాకు తూర్పుగా ఉంది. ఈ ద్వీపం రాజకీయ పరంగా మూడు దేశాల మధ్య పంచబడి ఉంది. అవి ఉత్తరంగా మలేషియా, బ్రూనై, దక్షిణాన ఇండోనేషియా. దాదాపు మూడొంతుల భూభాగం ఇండోనేషియా అధీనంలో ఉంది. మరో 26% తూర్పు మలేషియా రాష్ట్రాలైన సబహ్, సరావక్ గా ఉన్నాయి. 1% భూభాగం మలేషియా దేశపు స్వతంత్ర ప్రతిపత్తి కల రాష్ట్రం లాబువాన్ గా ఒక చిన్న ద్వీపంగా బోర్నియో తీరంలో ఉంది. ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై దేశం బోర్నియో భూభాగంలో 1% గా ఉంది. భూగోళంలో అమెజాన్ అడవులకు సరిగ్గా ఇటువైపు కొనలో ఉండే బోర్నియో ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత పురాతన వాన అడవులు ఉన్నాయి.
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | ఆగ్నేయ ఆసియా |
అక్షాంశ,రేఖాంశాలు | 01°N 114°E |
ద్వీపసమూహం | మహా సుండా ద్వీపాలు |
విస్తీర్ణం | 743,330 కి.మీ2 (287,000 చ. మై.) |
విస్తీర్ణ ర్యాంకు | 3rd |
అత్యధిక ఎత్తు | 4,095 m (13,435 ft) |
నిర్వహణ | |
బ్రూనై | |
జనాభా వివరాలు | |
జనాభా | 21,258,000 |
జన సాంద్రత | 21.52 /km2 (55.74 /sq mi) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.