Map Graph

బోర్నియో

బోర్నియో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపము. ఇది ఆసియాలో అతిపెద్ద ద్వీపం. ఇది ఆగ్నేయాసియా సముద్రప్రదేశానికి కేంద్రంగా ఉంది. ఈ ద్వీపము జావా ద్వీపానికి ఉత్తరంగా, సులవెసికి పశ్చిమంగా, సుమాత్రాకు తూర్పుగా ఉంది. ఈ ద్వీపం రాజకీయ పరంగా మూడు దేశాల మధ్య పంచబడి ఉంది. అవి ఉత్తరంగా మలేషియా, బ్రూనై, దక్షిణాన ఇండోనేషియా. దాదాపు మూడొంతుల భూభాగం ఇండోనేషియా అధీనంలో ఉంది. మరో 26% తూర్పు మలేషియా రాష్ట్రాలైన సబహ్, సరావక్ గా ఉన్నాయి. 1% భూభాగం మలేషియా దేశపు స్వతంత్ర ప్రతిపత్తి కల రాష్ట్రం లాబువాన్ గా ఒక చిన్న ద్వీపంగా బోర్నియో తీరంలో ఉంది. ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై దేశం బోర్నియో భూభాగంలో 1% గా ఉంది. భూగోళంలో అమెజాన్ అడవులకు సరిగ్గా ఇటువైపు కొనలో ఉండే బోర్నియో ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత పురాతన వాన అడవులు ఉన్నాయి.

Read article
దస్త్రం:Borneo_19_May_2002.jpg