బెనర్జీ (నటుడు)

సినీ నటుడు From Wikipedia, the free encyclopedia

బెనర్జీ గా పేరుగాంచిన మాగంటి వేణు బెనర్జీ ఒక తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారాడు.[1]

త్వరిత వాస్తవాలు బెనర్జీ, జననం ...
బెనర్జీ
జననం
మాగంటి వేణుబెనర్జీ

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1980 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎం.శైలజ
పిల్లలుఎం.రినిత USA
తల్లిదండ్రులు
మూసివేయి

వ్యక్తిగత వివరాలు

బెనర్జీ విజయవాడ లోని గవర్నరుపేటలో జన్మించాడు. [2] తండ్రి రాఘవయ్య కూడా నటుడు. వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల తదితర చిత్రాల్లో నటించాడు. ఆయన ఆఖరి సినిమా భరత్ అనే నేను.[3]

బెనర్జీ బెజవాడలో కొండపల్లి కోటేశ్వరమ్మ స్థాపించిన మాంటిస్సోరి చిల్డ్రన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన తండ్రి సమాచార శాఖలో ఉద్యోగి కావడంతో ఆయనకు ఢిల్లీకి బదిలీ అయింది. బెనర్జీ కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. గుంటూరులోని ఏ.సి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. తరువాత మద్రాసులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, బి.ఏ చదివాడు. కానీ ఈ చదువు పూర్తి కాలేదు. అప్పటికే తండ్రి సినిమా పరిశ్రమలో ఉండటంతో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది.

విజయనగరంలో ఓ కంపెనీకి బ్రాంచి మేనేజరుగా పనిచేశాడు. ఆయనకు ఓ అక్క ఉంది. ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తుంది. ప్రస్తుతం ఆయన తన భార్య, కూతురుతో కలిసి జీవిస్తున్నాడు.

కెరీర్

మొదటగా యు. విశ్వేశ్వరరావు దగ్గర హరిశ్చంద్రుడు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇందులో ప్రభాకర్ రెడ్డి, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోనే ఈయన ఒక చిన్నపాత్రలో కూడా నటించాడు. ఈ సినిమాకు జాతీయ పురస్కారం వచ్చింది. తర్వాత తాతినేని రామారావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సహాయ దర్శకుడిగా పని చేస్తూనే నటుడిగా మారాడు.[4]

తెలుగు సినీ కార్మికుల సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో కూడా ఈయన కొన్ని పదవులు చేపట్టాడు.

నటించిన సినిమాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.