బెండగింజల నూనె
From Wikipedia, the free encyclopedia
బెండకాయ మొక్క మాల్వేలిస్ వర్గము, మాల్వేసి కుటుంబానికి చెందినది. బెండ వృక్షశాస్త్రనామము 'Abelmoschus esculentus'.ఇది ఏకవార్షిక మొక్క.0.9-2.0మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. బెండకాయలను వంటకూరలలో వినియోగిస్తారు.బెండయొక్క జన్మస్థానం గురించి వివాదముంది. కొందరు దక్షిణ ఆసియా అనిభావించగా, కొందరు యుథోఫియా, ఉత్తర ఆఫ్రికా అని ఆధారాలు చూపిస్తున్నారు.[1] అక్కడినుండి మధ్యధరాప్రాంతంద్వారా అరబ్బిదేశాలు అక్కడినుండి భారతదేశంకు వ్యాప్తి చెందినది.[2]


ఇతరభాషలలో బెండపేరు[3]
- హింది, పంజాబు:భిండి (bhindi)
- గుజరాతి:భింద (bhinda)
- బెంగాలి:ధెంరొషి (Dhenrosh)
- కన్నడం:బెండెకాయి (Bende kayi)
- తమిళం:బెండియ కాయై (Bendia kai)
- ఒరియా:వెండి (vendi)
- మలయాళం:వెండ (Venda)
- అస్సాం, మరాఠీ:భేండి (Bhendi)
బెండగింజలు
బెండగింజలలో నూనెశాతం 16-17% వరకు ఉంటుంది. మాంసకృత్తులశాతం 18-19% వరకు ముడిపీచు (Crude Fibre)21% ఉండును. గింజలలో నూనెశాతం తక్కువగా ఉండటం వలన నూనెను ఎక్సుపెల్లరు యంత్రాలద్వారా దిగుబడి అనుకున్నంతగా రాదు. అందుచేత సాల్వెంట్ ప్లాంట్ ద్వారానే సంగ్రహించాలి. సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ పద్ధతిలో తీసిన నూనె పసుపురంగులో ఉండి ఆకుపచ్చ ఛాయను కలిగి ఉండును. నూనెలోని ఫెనోపైటిన్ (phenophytin) వలన నూనెకు ఆకుపచ్చని ఛాయకలిగినది.[4] నూనె అల్ఫా, గామా టొకొఫెరొలులను కలిగివున్నది.బెండగింజలలో నూనెవున్న విషయాన్ని 1920లోనే జమైసన్ (jameison), బాగ్‌మాన్ (Baugman) అనేవారు గుర్తించారు.[5].ఈనూనె హెల్పన్ పరీక్షకు అనుకాలంగా (positive) గా స్పందిస్తుందని గుర్తించినది కూడా వీరె.
బెండగింజల నూనె భౌతిక లక్షణాల పట్టిక[4]
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవనసూచిక 400Cవద్ద | 1.4620 -1.4700 |
నూనెలో ఐయోడిన్ విలువ | 75-100 |
నూనెలో సపొనిఫికేసను విలువ | 192-200 |
సపొనిఫియబుల్ మాటరు | 1.5 గరిష్ఠం |
ఆమ్లవిలువ | 15.0గరిష్ఠం |
నూనె విశిష్ణ గురుత్వం 30/300Cవద్ద | 0.9160-.9190 |
రంగు 1/4" | 35.0 |
హెల్పెన్ టెస్ట్ | పాసిటివ్ |
బెండగింజ నూనెలోని కొవ్వు, ఆమ్లాల శాతం[6]
కొవ్వుఆమ్లాలు | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) | 0.2 |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 32.0 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 4-5 |
పామిటొలిక్ ఆమ్లం (C16:1) | 0.4 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 23-29 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 34-39 |
సైక్లొప్రొపేన్ | 2.0 |
నూనె ఉపయోగాలు
ప్రస్తుతం నూనె ఉత్పత్తి ప్రాథమిక స్ధాయి (pilot plant) లో ఉంది. మునుముందు పారిశ్రామిక స్ధాయిలో ఉత్పత్తి చేయవచ్చు.
- వంటనూనెగా వినియోగించవచ్చును. పత్తిగింజల నూనెకు బదులుగా వినియోగించవచ్చు.
- బెండగింజల నూనెనుండి జీవఇంధనం (Biodiesel) ఉత్పన్నం చెయ్యవచ్చును.[7]
ఇవికూడా చూడండి
వనరులు
మూలాలు/ఉల్లేఖనం
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.