From Wikipedia, the free encyclopedia
బుర్రకథ, 2019 జూలై 5న విడుదలైన తెలుగు సైన్స్ ఫిక్షన్ కామెడీ చలనచిత్రం. దీపాల ఆర్ట్స్ & టఫ్ ఎనెడ్ స్టూడియోస్ పతాకంపై శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవి కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఆది,[2] మిస్తీ చక్రవర్తి, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా,[3] సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[4]
బుర్రకథ (2019 సినిమా) | |
---|---|
దర్శకత్వం | డైమండ్ రత్నబాబు |
స్క్రీన్ ప్లే | తాజుద్దీన్ సయ్యద్ ప్రసాద్ కామినేని సిద్ధాబత్తుల కిరణ్ సురేష్ ఆరపాటి దివ్య భావన దిడ్ల |
కథ | డైమండ్ రత్నబాబు |
నిర్మాత | శ్రీకాంత్ దీపాల కిషోర్ ఎంవి కిరణ్ రెడ్డి |
తారాగణం | ఆది మిస్తీ చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ |
ఛాయాగ్రహణం | సి. రాం ప్రసాద్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | దీపాల ఆర్ట్స్ & టఫ్ ఎనెడ్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 5 జూలై 2019[1] |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అభిరామ్ (ఆది) రెండు మెదడులతో పుడతాడు. అతను పెరిగే క్రమంలో అతని శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. దాంతో అభిరామ్ ఇద్దరు వ్యక్తులు (అభి, రామ్) గా ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు. అభి ఊర మాస్ అయితే, రామ్ క్లాస్. అభిరామ్ దగ్గర విపరీతమైన శబ్ధం చేస్తే అభి-రామ్ ఒకరి నుంచి ఇంకొకరికి మారతారు. అంటే, ఒక మెడడు ఆగిపోయి ఇంకో మెదడు పనిచేయడం మొదలవుతుంది. అభి ఆలోచనలకి, రామ్ ఆలోచనలకు ఏమాత్రం సింక్ లేకపోవడంతో.. ఒకరి వల్ల మరొకరి లైఫ్ రిస్క్ లో పడుతూ ఉంటుంది. అలా సాగుతున్న వారి జీవితంలో రామ్ అనూహ్యమైన నిర్ణయానికి వస్తాడు. కరెక్ట్ గా అదే టైమ్ లో అభి.. హ్యాపీ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అభి లవ్ స్టోరీకి రామ్ విలన్ గా మారతాడు. రామ్ వల్ల అభి ప్రేమకు వచ్చిన సమస్యలేంటి, ఆ సమస్యలనుంచి బయటపడి అభి తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నాడు అన్నది మిగతా కథ.
Untitled | |
---|---|
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అందానికే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | హేమచంద్ర | 3:10 |
2. | "ఒకటే ఒకటే (రచన: కృష్ణకాంత్)" | కృష్ణకాంత్ | అనురాగ్ కులకర్ణి | 3:48 |
3. | "అనగనగా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | ధనుంజయ్ | 3:22 |
4. | "నీవల్లే నీవల్లే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | కాల భైరవ | 3:49 |
మొత్తం నిడివి: | 14:06 |
2018, ఆగస్టు 17న ఈ చిత్ర షూటింగు ప్రారంభమైంది.[6]
ది హిందూ పత్రికకు చెందిన వై. సునీతా చౌదరి "ఈ చిత్ర కథలో ఐదు నిమిషాలు చూస్తే అంతులేని వేదన కలిగించే అనుభవానికి వెళుతున్నట్లు స్పష్టమవుతుంది" అని పేర్కొంది.[7] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 1/5 రేటింగ్ ఇచ్చింది, "ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని, నటనలో ఆది మరోసారి విఫలమైనట్లు అనిపిస్తోంది" అని పేర్కొంది.[8] 123తెలుగు.కాం ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది, "ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిందని, కథనం బాలేదు" అని పేర్కొంది.[9] "దర్శకుడు డైమండ్ రత్నాబాబు చమత్కారమైన కథాంశాన్ని ఆకర్షణీయమైన రీతిలో చెప్పడంలో విఫలమయ్యాడు" అని ఎన్ టివి తెలిపింది.[10] "ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ప్రేక్షకులను నిమగ్నం చేయడంలో విఫలమయింది" అని ది హన్స్ ఇండియా పత్రిక పేర్కొంది.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.