ది హన్స్ ఇండియా
From Wikipedia, the free encyclopedia
ది హన్స్ ఇండియా ఒక ఇంగ్లీష్ దినపత్రిక. 2011 జూలై 15న హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటూ, విశాఖపట్టణం, విజయవాడ, వరంగల్, తిరుపతిలలో దీనికి ఎడిషన్‌లు ఉన్నాయి. హెచ్ ఎం టివి వ్యవస్థాపక ప్రధాన సంపాదకులు కె రామచంద్రమూర్తి దీనికి కూడా వ్యవస్థాపక ప్రధాన సంపాదకులు. ప్రస్తుతం వి రాము శర్మ ఈ పత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.[1] ది హన్స్ ఇండియా, హెచ్ ఎమ్ టివి లను హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోంది. కపిల్ గ్రూప్ యజమాని కె వామన రావు దీనికి అధ్యక్షులు. దేశ వ్యాప్తంగా పాత్రికేయులు, విశ్లేషకులు ఇందులు వ్యాసాలు రాస్తున్నారు. కపిల్ గ్రూప్ మీడియా బాధ్యతలు చూస్తున్నపుడు తెలుగు ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మస్తిష్కంలో మొగ్గతొడిగిన ఆలోచనే 'ది హన్స్ ఇండియా.

సిబ్బంది కాలమిస్టులు
దినపత్రిక సంపాదకుడు వి రాము శర్మ ప్రచురణకర్త శ్రీ. హనుమంతరావు కె . కాలమిస్టులలో పాత్రికేయులు మాడభూషి శ్రీధర్, ఐ.వై.ఆర్.కృష్ణారావు, డాక్టర్ భరత్ ఝున్ ఝున్ వాలా, కృష్ణసాగర్ రావు, మోహన్ కందా, నిలోత్పాల్ బసు, డాక్టర్ సుమన్ కుమార్ కస్తూరి, ప్రొఫెసర్ వియ్యన్నరావు, డాక్టర్ పద్మజ షా, పల్లవి ఘోష్ ఉన్నారు. రాము శర్మ కు ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధకుడిగా, ఎమ్ ఎల్ సి గా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎడిటర్ గా 12 అక్టోబర్ 2017 వరకు పనిచేశారు[2].
హైదరాబాద్ మీడియా హౌస్
హైదరాబాద్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ 2006 ఆగస్టు 02న ఒక ప్రైవేట్ సంస్థగా ఉంది. ఇది ప్రభుత్వేతర సంస్థగా వర్గీకరించబడింది ఇది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, హైద్రాబాద్ లో రిజిస్టర్ చేయబడింది.హైదరాబాద్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు వామన్ రావు కసుగంటి, హరితారావు, కురడ హనుమంతరావు, లక్ష్మణ్ కుమార్ కసుగంటి, ఉడ్తల కృష్ణ మోహన్.
సంచికలు
ఢిల్లీ , హైదరాబాద్ , వరంగల్ , ఖమ్మం లో తెలంగాణా విశాఖపట్నం , అమరావతి , కర్నూలు తిరుపతి లో ఆంధ్ర ప్రదేశ్ నుండి సంచికలను ప్రచురిస్తుంది. , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆంగ్ల దినపత్రికగా పేరు గావిస్తూ ఈ పత్రిక ముందుకు వస్తోంది.
బయటి లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.