Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
బస్తీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది బస్తీ జిల్లా ముఖ్య పట్టణం. ఒక భాగం బస్తీ రెవెన్యూ డివిజన్. ఇది రాష్ట్ర రాజధాని లక్నో నుండి తూర్పున 202 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బస్తీని మొదట వైశిష్ఠి అని పిలిచేవారు.[3] ఈ ప్రాంతంలోవశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేదనీ, అందుచేత దీనికి వైశిష్ఠి అనే పేరు వచ్చిందనీ భావిస్తారు. పురాతన కాలంలో రామ లక్ష్మణులు ఇక్కడి వశిష్ఠాశ్రమంలో గడిపారని ఇక్కడి ప్రజల నమ్మకం.
ప్రస్తుతం జిల్లా విస్తరించిన ప్రాంతంలో ఒకప్పుడు ఎక్కువ భాగం అటవీప్రాంతం. క్రమంగా ఈ ప్రాంతం నివాసయోగ్యంగా మారింది. జిల్లాకు పట్టణానికీ ఈ పేరు ఎల వచ్చిందో చెప్పే ఆధారాలు లేవు. బహుశా 16 వ శతాబ్దంలో కల్హణ రాజు తన రాజధానిగా చేసుకుని పాలించి ఉండవచ్చు. 1801 లో బస్తీ, తహసీలు ప్రధాన కార్యాలయంగా మారింది. 1865 లో కొత్తగా స్థాపించబడిన జిల్లాకు ముఖ్య పట్టణమైంది.
1857 స్వాతంత్ర్య సంగ్రామంలో, అమోర్హా రాజ్యానికి చెందిన 250 మంది అమరవీరులను బ్రిటిషు ప్రభుత్వం, ఛావనీ వద్ద ఉన్న రావి చెట్లకు ఉరితీసింది.[4][5][6][7]
జిల్లా 26° 23', 27 ° 30' ఉత్తర అక్షాంశాలు, 82° 17', 83° 20' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఉత్తర దక్షిణాల్లో దీని గరిష్ఠ పొడవు 75 కి.మీ., తూర్పు, పడమరల్లో వెడల్పు 70 కి.మీ. ఈ జిల్లా తూర్పున కొత్తగా సృష్టించిన జిల్లా సంత్ కబీర్ నగర్ పశ్చిమాన గోండా జిల్లాలు ఉన్నాయి. దక్షిణాన, అమోర్హా ఖాస్ సమీపంలో ఉన్న ఘఘ్రా నది ప్రవహిస్తోంది. ఇది జిల్లాను, ఫైజాబాద్, కొత్తగా సృష్టించిన అంబేద్కర్ నగర్ జిల్లాల నుండి వేరు చేస్తుంది. ఉత్తర సరిహద్దున సిద్దార్థనగర్ జిల్లా ఉంది.[8]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బస్తీ మొత్తం జనాభా 1,14,657, వీరిలో 60,095 మంది పురుషులు, 54,562 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న జనాభా 13,349. బస్తీలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 84,389. ఇది జనాభాలో 73.6%, పురుషుల్లో అక్షరాస్యత 78.3% ఉండగా, స్త్రీలలో 68.5% ఉన్నారు. బస్తీలో షెడ్యూల్డ్ కులాల జనాభా 17,036, షెడ్యూల్డ్ తెగల జనాభా 275. 2011 లో బస్తీలో 17894 గృహాలు ఉన్నాయి.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.