Remove ads

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బలియా జిల్లా (హిందీ:बलिया ज़िला) (ఉర్దు:بالیا ضلع) ఒకటి. బలియా ఈ జిల్లాకు కేంద్రం. బలియా జిల్లా అజంగఢ్ డివిజన్‌లో భాగం.

త్వరిత వాస్తవాలు బలియా జిల్లా बलिया ज़िला بالیا ضلع, దేశం ...
బలియా జిల్లా
बलिया ज़िला
بالیا ضلع
Thumb
ఉత్తర ప్రదేశ్ పటంలో బలియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఆజంగఢ్
ముఖ్య పట్టణంబలియా
విస్తీర్ణం
  మొత్తం1,981 కి.మీ2 (765 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం32,23,642
  జనసాంద్రత1,600/కి.మీ2 (4,200/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత73.82 per cent
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి
Thumb
జిల్లాలోని మనియార్ పట్టణం

జిల్లాప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. బలియా పట్టణం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన వ్యాపార కూడలిగా ఉంది. జిల్లాలో బలియా, బన్స్దిహ్, రస్ర, బైరియా, సికందర్పూర్, బెల్థారా అనే 6 తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో ఒక చక్కెర మిల్లు. ఒక పత్తి మిల్లు, పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. మనియర్‌లో పెద్ద ఎత్తున బిందీ తయారు చేస్తారు.

Remove ads

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,223,642,[1]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 108 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1081:1000 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.73%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 933:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.82%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
మూసివేయి

భాషలు

జిల్లాలో సాధారణ ప్రజలలో భోజ్పురి (bhojpuri language (en)) భాష వాడుకలో ఉంది. ఆంగ్లం కూడా నాగరికులలో వాడుకలో ఉంది. ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది.

Remove ads

సంస్కృతి

ప్రముఖ హిందీ సాహిత్యకారులు అనేక మంది బలియాలో జన్మించారు. వీరిలో హజారీ ప్రసాద్ ద్వివేది, పరశురాం చతుర్వేది, అమర్‌కాంత్ మొదలైన వారు ప్రముఖులు. ఈ జిల్లా గంగానది రెండు ప్రధాన నదులు గంగా, ఘఘ్రా (సరయు) మధ్యలో ఉంది. ఇవి ఈ భూమిని అధికంగా సారవంతం చేస్తున్నాయి. బలియా హిందూ పవిత్ర నగరాలలో ఒకటిగా భావించబడుతుంది. భృగు ఆలయం ఉన్న ప్రదేశంలో భృగు మహర్షి నివసించాడని భావిస్తున్నారు. భృగు ఆశ్రమం ముందు గంగానది ప్రవహిస్తుంది. శీతాకాలంలో ఒక మాసకాలం ఉత్సవం నిర్వవహించబడుతుంది. ఈ ఉత్సవానికి పరిసర గ్రామాల నుండి వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు జరిగే బలియా సోనాదిహ్ మేళాకి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.

రాజకీయం

బలియా స్వాతంత్ర్యసమరవీరులు ఉన్నారు. చిట్టూ పాండే నాయకత్వంలో సాగించిన ఉద్యమంలో బలియాలో 1942 ఆగస్టు 19 నుండి కొన్ని రాజులపాటు బ్రిటిష్ రాజ్‌ రద్దు చేయడంలో సఫలమైయ్యారు. స్వాతంత్ర్యసమరవీరుడు ప్రఖ్యాత మంగల్ పాండే ఈ జిల్లాలో జన్మించాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకిని నిలిపిన మొదటి వ్యక్తిగా మంగల్ పాండేకు ప్రత్యేక గురింపు ఉంది. చిటు పాండే, మురలి మనోహర్, తారకేశ్వర్ పాండే, గౌరి శంకర్ రాయ్, వందలాది ప్రజలు ఈ జిల్లా నుండి స్వతంత్ర సమరంలో పోరాడారు. మురలి మనోహర్, తారకేశ్వర్ పాండే, గౌరి శంకర్ రాయ్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికచేయబడ్డారు. గౌరి శంకర్ రాయ్ యు.పి శాసనసభ్యుడుగా, యు.పి కౌన్సిల్, ఇండియన్ పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు ఆయన ఐక్యరాజ్య సమితికి అద్యక్షత వహించాడు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో మాట్లాడిన మొదటి సభ్యుడుగా ఆయనకు ప్రత్యేకత ఉంది.

Remove ads

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads