బలిజిపేట (విజయనగరం జిల్లా)
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
విశాఖపట్నం జిల్లా లోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం బలిజిపేట (విశాఖపట్నం జిల్లా) చూడండి.
బలిజిపేట | |
---|---|
రెవెన్యూయేతరగ్రామం | |
![]() బలిజిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాలాజీ విగ్రహం | |
Coordinates: 18.613061°N 83.529475°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
Government | |
• Body | స్థానిక స్వపరిపాలన సంస్థ |
Elevation | 76 మీ (249 అ.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 535557 |
వాహన నమోదు | AP35 (పాత సంఖ్య) AP39 (2019 జనవరి 30 నుండి )[1] |
బలిజిపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామం, ఇది బలిజపేట మండల కేంద్రం. ఇది పలగర రెవెన్యూ గ్రామ పరిధిలోవుంది.
బలిజిపేట 1955, 1962లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజక వర్గం. తరువాత దీనిని ఉనుకూరు నియోజకవర్గంలో విలీనం చేశారు. ప్రస్తుతం పార్వతీపురం నియోజక వర్గంలో విలీనం చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ చిన్న నరసయ్య శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.
అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. ఇతని స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామం. వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు.ఇతని తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య, ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు.ఇతని బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. చదవటం కోసం బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివాడు.1952 లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నాడు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అతని అన్న కృష్ణమూర్తి చనిపోవడంతో చదువు ఆపి, తండ్రి వ్యాపార విషయాలలో ఇతనుకేంద్రీకరించాడు. జగన్నాథయ్య బావమరుదులు మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య, భరతారావు కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను, తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం, కమిషన్ కోసం క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేసేవారు.
Seamless Wikipedia browsing. On steroids.