ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బనగానపల్లె మండల జనగణన పట్టణం From Wikipedia, the free encyclopedia
బనగానపల్లె ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, బనగానెపల్లె మండలం లోని జనగణన పట్టణం. 1790 నుండి 1948 వరకు బనగానపల్లె సంస్థానానికి కేంద్రంగా వుండేది.
బనగానపల్లె | |
— జనగణన పట్టణం — | |
అక్షాంశరేఖాంశాలు: 15.3167°N 78.2333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
మండలం | బనగానపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 16,462 |
- పురుషుల సంఖ్య | 8,400 |
- స్త్రీల సంఖ్య | 8,062 |
- గృహాల సంఖ్య | 3,338 |
పిన్ కోడ్ | 518124 |
ఎస్.టి.డి కోడ్ |
1601లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్ ఆలీ ఖాన్ బహదూరుకు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్ ఆలీ మేనమామ, ముబారిజ్ ఖాన్ దయవల్ల ఫైజ్ ఆలీ ఖాన్ స్థానం పదిలంగానే ఉంది.
1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.[1] 1948లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.
బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ప్రైవేటు విద్య సంస్థలు కూడా ఉన్నాయి.
బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉంది. ఒక సార్వజనిక వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల ఉన్నాయి. ఆర్.టి.సి. డిపో ఉంది.
బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకు రవాణ సౌకర్యం ఉంది.
హైదరాబాదుకి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను ఉంది.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,462. ఇందులో పురుషుల సంఖ్య 8400, మహిళల సంఖ్య 8,062, గ్రామంలో నివాస గృహాలు 3,338 ఉన్నాయి.
బనగానెపల్లె ప్రాంతంలో పెరిగే ఒక రకం మామిడికి బంగినపల్లి మామిడి అని వాడుకలో పేరు. చాలా ప్రసిద్ధమైన మామిడి రకం ఇది. దీన్ని "బేనిషా" అని కూడా అంటారు. మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక ఎన్.టి.ఆర్. చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.