ఆంధ్రరాష్ట్రం, భారతదేశపు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది.[1]

త్వరిత వాస్తవాలు ఆంధ్రరాష్ట్రం, దేశం ...
ఆంధ్రరాష్ట్రం
Anthem: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ"
Thumb
భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర స్థానం
Coordinates: 16.50°N 80.64°E / 16.50; 80.64
దేశం India
రాష్ట్రావతరణ1 అక్టోబర్ 1953
రాజధాని నగరంకర్నూలు
పెద్ద నగరంవిశాఖపట్నం
జిల్లాలు13
Government
  Bodyఆంధ్ర ప్రభుత్వం
  గవర్నరుసి.ఎం.త్రివేది
  ఆంధ్ర ముఖ్యమంత్రులు1.టంగుటూరి ప్రకాశం పంతులు1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు

2.రాష్ట్రపతి పాలన 1954నవంబర్ 15 నుంచి 1955మార్చి 28 వరకు

3.బెజవాడ గోపాలరెడ్డి1955మార్చి 28నుండి1956నవంబర్ 1 వరకు
  హైకోర్టుహైకోర్టు,గుంటూరు
Demonymతెలుగు / ఆంధ్రులు
Time zoneUTC+05:30 (IST)
మూసివేయి

మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు.[2] ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన తెలంగాణ ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

58 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమల్లోకి వచ్చింది. 2014 జూన్ 2న అధికారికంగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి

జిల్లాలు

ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి జిల్లాలు

మరింత సమాచారం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ...
ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014
మూసివేయి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు

Thumb
పసుపు పచ్చరంగులో గల ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా తో కలిసి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది

1956 నవంబరు 1న, హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగుభాష మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాల్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కలిపింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.