బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ

తెలంగాణ నగరపాలక సంస్థ From Wikipedia, the free encyclopedia

బండ్లగూడ జాగిర్ నగరపాలక సంస్థ, తెలంగాణలోని 13 నగరపాలక సంస్థలలో ఇది ఒకటి.ఇది రంగారెడ్డి జిల్లాపరిధిలో ఉంది.[1] ఇది లోగడ గండిపేట మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.ఈ గ్రామం హెచ్‌ఎండిఎ.లో విలీనం చేశారు.ఇది మెహదీపట్నం జంక్షన్ నుండి 8 కి.మీ.దూరం ఉంది.ఇక్కడ నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 20 కి.మీ. దూరంలో ఉంది.ఈ ప్రాంతం అప్పా జంక్షన్ వద్ద అవుటర్ రింగ్ రోడ్‌కు అనుసంధానించబడి ఉంది. గచ్చిబౌలి ఐటి జోన్ 14 కి.మీ. దూరంలో ఉంది.ఈ ప్రాంతంలో చాలా కొత్త వెంచర్లు వచ్చి నిర్మాణ కార్యకలాపాలు చురుకుగా జరిగి అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు అనుకూలంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మాపుల్ టౌన్ విల్లాస్, పీబీఎల్ సిటీ, గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్, ఐసోలా, వాసంతీ ఆనంద్ నిర్మాణాలు ముఖ్యమైనవి.ఇది సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, నర్సింగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది.బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని డాన్ బాస్కో నగర్ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ 500086.దీని ముఖ్య పట్టణం బండ్లగూడ జాగీర్

త్వరిత వాస్తవాలు బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ, రకం ...
బండ్లగూడ జాగీర్
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
నాయకత్వం
మేయర్
బి.మహేంద్ర గౌడ్
2020,జనవరి నుండి నుండి
డిప్యూటీ మేయర్
పి.రాజేంద్రరెడ్డి
నిర్మాణం
సీట్లు22
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్
మూసివేయి

2020 ఎన్నికల వార్డులు సంఖ్య

బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని 2020లో జరిగిన ఎన్నికలకు తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ వారిచే ఇరవై రెండు (22) వార్డులుగా విభజించబడింది.[2]

రిజర్వేషన్ వివరాలు

  • ఎస్టీలకు కేటాయించిన సీట్లు మొత్తం: 1
  • ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లు జనరల్: 1
  • ఎస్టీ మహిళలకు సీట్లు రిజర్వు: 0
  • ఎస్సీలకు కేటాయించిన సీట్లు మొత్తం: 3
  • ఎస్సీలకు కేటాయించిన సీట్లు జనరల్:  2
  • ఎస్సీ మహిళలకు ప్రత్యేకించబడ్డ సీట్లు: 1
  • బీసీలకు కేటాయించిన సీట్లు మొత్తం: 7
  • బిసిలకు కేటాయించిన జనరల్ సీట్లు: 4
  • బిసి మహిళలకు కేటాయించబడ్డ సీట్లు: - 3
  • రిజర్వ్ చేయని మహిళలుకు సాధారణ సీట్లు : 7
  • జనరల్ సీట్లు రిజర్వు : 4

మేయర్ , డిప్యూటీ మేయర్

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (బి.సి. రిజర్వుడు) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బి.మహేంద్ర గౌడ్ ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పి.రాజేంద్రరెడ్డి ఎన్నికయ్యాడు.[3]

సౌకర్యాలు, వసతులు

ఆటస్థలాలు

బండ్లగూడ జాగీర్ పరిధిలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్పోర్ట్స్ ఎస్టేట్ (క్రికెట్ గ్రౌండ్) లో కార్పొరేట్ క్రికెట్ జట్లు, ఇతర క్రికెట్ జట్లు క్రికెట్ ఆడటానికి ఇక్కడకు వస్తాయి.

నిత్యావసర సరుకులు

బండ్లగూడ జాగీరు లోపల శివారు ప్రాంతమైన సన్ సిటీ, రిలయన్స్ ఫ్రెష్, మోర్, హెరిటేజ్ ఫ్రెష్, మరెన్నో సూపర్ మార్కెట్లు కాకుండా ఇతర కిరాణా షాపులు, కూరగాయల షాపులు ప్రజల రోజువారీ అవసరాలను తీర్చుతున్నాయి.

సమీప ప్రాంతాలు

బండ్లగుడ జాగీర్ గ్రామం చుట్టూ కిస్మత్‌పూర్, గంధంగూడ, హైదర్‌షాకోట్, పీరంచెరువు వంటి చిన్న గ్రామాలు ఉన్నాయి.

విద్యా వసతులు

టైమ్ స్కూల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, గ్లెన్డేల్ అకాడమీ, షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేక మంచి పాఠశాలలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

పంక్షన్ హాలులు

జిఆర్కె, ఎం.ఎస్, కె.కె, అతిథి ఫంక్షన్ హాల్స్ స్థానిక ప్రజలకు సహేతుకమైన దరలతో అందుబాటులో ఉన్నాయి.

వాతావరణం, వినోదం.

ఈ పరిధిలో ఉన్న సైనిక ప్రాంతం చెట్లతో నిండి ఉంది, సాయంత్రం అంతా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.సుందరమైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మంచినీటి సరస్సులు, ప్రసిద్ధ నేషనల్ పార్క్ - మృగవాని నేషనల్ పార్క్, 700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.