ఫ్రిదా పింటో

From Wikipedia, the free encyclopedia

ఫ్రిదా పింటో

ఫ్రిదా సెలీనా పింటో (జననం 1984 అక్టోబరు 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా అమెరికన్, బ్రిటిష్ చిత్రాలలో నటిస్తుంది. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన ఈమె చిన్న వయసులోనే నటి కావాలని సంకల్పించింది. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యార్థిగా, ఆమె ఔత్సాహిక నాటకాల్లో పాల్గొంది. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె కొంతకాలం మోడల్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా పనిచేసింది.

త్వరిత వాస్తవాలు ఫ్రిదా పింటో, జననం ...
ఫ్రిదా పింటో
Thumb
2014లో 'యూత్ ఫర్ చేంజ్' కార్యక్రమంలో ఫ్రీదా పింటో
జననం
ఫ్రీదా సెలీనా పింటో[1]

(1984-10-18) 18 అక్టోబరు 1984 (age 40)
విద్యాసంస్థసెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కోరి ట్రాన్
(m. 2020)
పిల్లలు1
మూసివేయి

ఆమె స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008)లో తన చలనచిత్ర అరంగేట్రంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనికిగాను ఆమె ఉత్తమ సహాయ నటిగా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) అవార్డుకు ఎంపికైంది. ఆమె మిరాల్ (2010), తృష్ణ (2011), డెసర్ట్ డ్యాన్సర్ (2014)లలో తన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె సైన్స్ ఫిక్షన్ చిత్రం రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011), ఎపిక్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ఇమ్మోర్టల్స్ (2011)లతో వాణిజ్య విజయాన్ని కూడా సాధించింది. ఆమె నటించిన ఇతర ముఖ్యమైన చిత్రాలలో యు విల్ మీట్ ఎ టాల్ డార్క్ స్ట్రేంజర్ (2010), లవ్ సోనియా (2018), హిల్‌బిల్లీ ఎలిజీ (2020), మిస్టర్ మాల్కమ్స్ లిస్ట్ (2022) ఉన్నాయి. ఆమె షోటైమ్ మినిసిరీస్ గెరిల్లా (2017)లో కూడా నటించింది. హులు సిరీస్ ది పాత్ (2018)లో పునరావృత పాత్రను పోషించింది.

విదేశీ చిత్రాలలో భారతీయ మహిళగా ఆమె ఘనతను భారతీయ పత్రికలు చాటాయి. తన సినీ కెరీర్‌తో పాటు, ఆమె మానవతా కారణాలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఆమె మహిళా సాధికారత గురించి గళం వినిపిస్తుంది.

బాల్యం, విద్యాభ్యాసం

ఆమె 1984 అక్టోబరు 18న పశ్చిమ భారతదేశంలోని ముంబైలో దక్షిణ భారతదేశంలోని మంగళూరుకు చెందిన కాథలిక్ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తల్లి, సిల్వియా పింటో, గోరేగావ్‌లోని సెయింట్ జాన్స్ యూనివర్సల్ స్కూల్ ప్రిన్సిపాల్ కాగా తండ్రి, ఫ్రెడరిక్ పింటో, బాంద్రాలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్‌. ఆమె అక్క షరోన్ ఎన్డీటీవిలో పనిచేస్తుంది.[2]

మలాడ్ శివారులో వారిది మధ్యతరగతి కుటుంబం.[3][4] ఆమె తన బాల్యంలో నటులను అనుకరిస్తూ, తరచూ దుస్తులు ధరించి, ఐదేళ్ల వయసులో నటి కావాలనుకుంది.[5][6] ఆమె తర్వాత 1994 మిస్ యూనివర్స్ పోటీలో సుస్మితా సేన్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆమె సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన కార్మెల్‌లో చదివింది.[7] ఆ తరువాత కళాశాల విద్యను సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరింది. కానీ 2005లో గ్రాడ్యుయేషన్ అయ్యే సమయానికి నటన, మోడలింగ్ లపై మక్కువతో అసైన్‌మెంట్లను పూర్తిచేయలేదు.[8]

కెరీర్

2005లో, ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్ ఇండియాలో చేరి ఫ్రిదా పింటో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. రిగ్లీస్ చూయింగ్ గమ్, స్కోడా, వోడాఫోన్ ఇండియా, ఎయిర్‌టెల్, వీసా, ఈబే, డి బీర్స్ వంటి ఉత్పత్తుల కోసం ఆమె టెలివిజన్, ప్రింట్ ప్రకటనలలో కనిపించింది.[9]

అదే సమయంలో, ఆమె చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాల కోసం ఆడిషన్‌లకు వెళ్లడం ప్రారంభించింది. 2006, 2008 మధ్యకాలంలో జీ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్‌లో ప్రసారమైన ఫుల్ సర్కిల్ అనే అంతర్జాతీయ ట్రావెల్ షోకి హోస్ట్‌గా ఆమె ఎంపికైంది.[6] ఈ షో కోసం ఆమె ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధదేశాలకు వెళ్ళింది.[10]

వ్యక్తిగత జీవితం

ఆమె తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించే ముందు, ఒకానొక సమయంలో ఆమెకు ప్రచారకర్తగా ఉన్న రోహన్ అంటావోతో నిశ్చితార్థం జరిగింది. ఆమె 2009 జనవరిలో సంబంధాన్ని ముగించుకుంది. తిరిగి ఆమె స్లమ్‌డాగ్ మిలియనీర్ సహనటుడు దేవ్ పటేల్‌తో డేటింగ్ ప్రారంభించింది.[11] ఆరేళ్ల సంబంధం తర్వాత, ఈ జంట 2014 డిసెంబరులో స్నేహపూర్వకంగా విడిపోయారు.[12] ఆ తరువాత ఆమె 2019 నవంబరులో ఫోటోగ్రాఫర్ కోరి ట్రాన్‌తో నిశ్చితార్థం చేసుకుంది.[13] వారు 2020లో హోండా సెంటర్‌లో వివాహం చేసుకున్నారు.[14] వారికి 2021 నవంబరులో కొడుకు జన్మించాడు.[15]

2015లో లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న ఆమె నటనా వృత్తితో పాటు, అనేక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది.[16][17][18] మహిళలు, నిరుపేద పిల్లల అభ్యున్నతి గురించి ఆమె గాత్రదానం చేసింది. 2010లో, దాతృత్వ సంస్థ అయిన అగాస్సీ ఫౌండేషన్‌కు మద్దతుగా ఆండ్రీ అగస్సీ, స్టెఫీ గ్రాఫ్‌లతో ఆమె చేరింది.[19][20]

2013లో, విద్య, ఆరోగ్యం, న్యాయ పరంగా మహిళల సమస్యలపై నిధుల సేకరణ, అవగాహన కోసం "చైమ్ ఫర్ చేంజ్" ప్రచారంలో భాగంగా ఆమె ఒక వీడియో రూపొందించింది. మరుసటి సంవత్సరం, ఆమె లండన్‌లో జరిగిన "బాలికల హక్కుల సదస్సు"లో పాల్గొంది, అక్కడ స్త్రీ జననేంద్రియ వికృతీకరణ , బాల్య వివాహాల ముగింపు దిశగా మరింత పురోగతి సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. మార్చి 2015లో, 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్‌పై లెస్లీ ఉడ్విన్ రూపొందించిన ఇండియాస్ డాటర్, డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం నిషేధం విధించినందుకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడింది.[21] యునైటెడ్ స్టేట్స్‌లో దాని ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా, ఈ చిత్రం "షేమ్-ఇండియా డాక్యుమెంటరీ" కాదని ప్రజలకు చేరువ కావాలని ఆమె అన్నది.[22]

అవార్డులు, నామినేషన్లు

మరింత సమాచారం సంవత్సరం, అవార్డు ...
సంవత్సరం అవార్డు క్వాటగిరీ సినిమా ఫలితం మూలం
2009 BAFTA అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి స్లమ్‌డాగ్ మిలియనీర్ నామినేట్ చేయబడింది [23]
బ్లాక్ రీల్ అవార్డ్స్ ఉత్తమ సమష్టి నామినేట్ చేయబడింది [23]
సెంట్రల్ ఒహియో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఉత్తమ సమష్టి నామినేట్ చేయబడింది [24]
MTV మూవీ అవార్డ్స్ బెస్ట్ బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ నామినేట్ చేయబడింది [23]
MTV మూవీ అవార్డ్స్ బెస్ట్ కిస్ (దేవ్ పటేల్‌తో షేర్డ్ నామినేషన్) నామినేట్ చేయబడింది [23]
పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ అవార్డు విజేత [25]
స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు చలనచిత్రంలో నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన విజేత [26]
టీన్ ఛాయిస్ అవార్డ్స్ ఛాయిస్ మూవీ యాక్ట్రస్: డ్రామా నామినేట్ చేయబడింది [27]
టీన్ ఛాయిస్ అవార్డ్స్ ఛాయిస్ మూవీ ఫ్రెష్ ఫేస్ ఫిమేల్ నామినేట్ చేయబడింది [27]
టీన్ ఛాయిస్ అవార్డ్స్ ఛాయిస్ మూవీ లిప్‌లాక్ (దేవ్ పటేల్‌తో కలసి) నామినేట్ చేయబడింది [27]
2018 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఉత్తమ సహాయ నటి లవ్ సోనియా నామినేట్ చేయబడింది [28]
IFFM డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డు విజేత [29]
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.