ప్రెసిడెంట్ గారి అబ్బాయి

From Wikipedia, the free encyclopedia

ప్రెసిడెంట్ గారి అబ్బాయి
Remove ads

ప్రెసిడెంట్ గారి అబ్బాయి 1987 లో వచ్చిన చిత్రం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో ఎవి సుబ్బారావు నిర్మించగా, తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, సుహాసిని నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు [1][2]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
Remove ads

కథ

ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది, ప్రెసిడెంటు చంద్రయ్య (జగ్గయ్య) చిత్తశుద్ధి గల వ్యక్తి, గత 25 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకౌతున్నాడు. అతను తన ఆదర్శ భార్య అనసూయ (అన్నపూర్ణ), ముగ్గురు కుమారులు శివరాం (ఈశ్వర రావు), ప్రసాద్ (సుధాకర్), రామకృష్ణ (నందమూరి బాలకృష్ణ), ఇద్దరు కోడళ్ళు కమల (వై.జయ), సత్య (రాజలక్ష్మి), ఒక కుమార్తె పూర్ణ (వరలక్ష్మి), మనవడు గోపి (మాస్టర్ రాజేష్) లతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. గోపి అంటే చంద్రయ్య, రామకృష్ణ ఇద్దరికీ గారాబం, ప్రేమ. అతను కూడా వాళ్లతో గట్టి అనుబంధం కలిగి ఉన్నాడు. సూరయ్య (సత్యనారాయణ) ఒక అపరాధి, ఎల్లప్పుడూ చంద్రయ్య అంటే అసూయ పడుతూంటాడు. అయినా, అతడి పెద్ద కుమార్తె సత్యను చంద్రయ్య తన రెండో కొడుకు ప్రసాదుకు చేసుకున్నాడు.

రామకృష్ణ ఎప్పుడూ సవాళ్లను స్వీకరించే ధైర్యవంతుడు. తన తండ్రిని అతడి ధోరణి కలవరపరుస్తూంటుంది. ఇంతలో, సూరయ్య గ్రామంలో అనేక అరచకాలు చేసి, వాటికి కారణం శివార్లలో ఉన్న దెయ్యాల మీద పారేసాడు. సూరయ్య చిన్న కుమార్తె లత (సుహాసిని) నగరం నుండి వస్తుంది. ప్రారంభంలో, ఆమె రామకృష్ణతో గొడవ పడుతోంది కాని తరువాత వారు ప్రేమలో పడతారు. జిత్తులమారి రాజకీయ బ్రోకరు ఢిల్లీ బాబాయి (నూతన్ ప్రసాద్) సూరయ్యతో కలిసికుట్ర చేసి చంద్రయ్యను పదవి నుండి దించేస్తారు. అయితే, చంద్రయ్య ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. అదే సమయంలో, చంద్రయ్య పూర్ణకు చక్కటి సంబంధం కుదుర్చుతాడు. పెళ్ళికి కొద్దిగా ముందు, సూరయ్య కుమారుడు పాపారావు (రాజ్ వర్మ) పూర్ణను మానభంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు, రామకృష్ణ లత సహాయంతో ఆమెను రక్షించి, ఆ ఘర్షణలో పాపా రావును పొడిచి చంపుతాడు. సూరయ్య అతనిపై హత్యా నేరం మోపుతాడు. పూర్ణ శీలంపై అభాండాలు వేస్తాడు. కోర్టులో, రామకృష్ణ తన గౌరవాన్ని కాపాడటానికి మౌనంగా ఉంటాడు, కాని లతా వాస్తవికతను వెల్లడించి అతన్ని విడుదల చేయిస్తుంది. దురదృష్టవశాత్తు, పూర్ణ భర్త వేణు (రామ్‌జీ), అత్తమామలు ఆమెను తప్పుగా అర్థం చేసుకుని ఆమెను గెంటేస్తారు. అన్నలు వదినలూ కూడా ఈసడిస్తారు. అందువల్ల, కుటుంబంలో చీలిక తలెత్తి, రెండుగా విడిపోతుంది. చంద్రయ్య ఇంటిని విడిచిపెట్టవలసి వస్తుంది. ఇంకా, సూరయ్య తన సహచరుడు గోవిందయ్య సోదరుడు రాజా (రాజేష్) తో లాతను పెళ్ళి చెయ్యడానికి కుట్ర పన్నుతాడు. రామకృష్ణ వారి కుట్రను భగ్నం చేసి లతను పెళ్ళి చేసుకుంటాడు.

పూర్ణను అంగీకరించమని రామకృష్ణ వేణును అభ్యర్థిస్తాడు, అప్పుడు అతను 2 లక్షలు కట్నం అడుగుతాడు. అది తెలుసుకున్న సూరయ్య రామకృష్ణను నిర్మూలించడానికి ఢిల్లీ బాబాయితో కుట్ర పన్నుతాడు. కాబట్టి, 2 లక్షల బహుమానంతో ఒక సవాలును ప్రకటిస్తాడు. వారి గ్రామంలో మూఢనమ్మకాలను అబద్ధమని నిరూపించడానికి అతను శివార్లలో ఒక రాత్రి గడపవలసి ఉంటుంది. ఇదీ పందెం. రామకృష్ణ ధైర్యంగా విజయం సాధిస్తాడు. విషాదకరంగా, ఆ గందరగోళంలో గోపీని బ్లాక్ గార్డ్లు చంపేస్తారు. దాని గురించి తెలుసుకోవడం, చంద్రయ్య బయటపడటం, రామకృష్ణ విలన్లను నాశనం చేయటం, వేణు కూడా తన తప్పును గ్రహించి పూర్ణ చెయ్యి అందుకోవడం, చివరగా, కుటుంబం తిరిగి కలుసుకోవడం వీటితో సినిమా ముగుస్తుంది.

Remove ads

తారాగణం

సాంకేతిక సిబ్బంది

పాటలు

మరింత సమాచారం ఎస్. లేదు, పాట పేరు ...

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads