From Wikipedia, the free encyclopedia
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఆంగ్లం: World Badminton Championships) ఇది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF)చే ఆమోదించబడిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్. గతంలో వీటిని IBF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లుగా పిలిచేవారు. ఇప్పుడు BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. 1992లో తొలిసారిగా ప్రవేశపెట్టబడిన సమ్మర్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లతో పాటు అత్యధిక ర్యాంకింగ్ పాయింట్‌లను అందిస్తోంది.[1][2] ఈ టోర్నమెంట్ విజేతలకు బ్యాడ్మింటన్ క్రీడలో "ప్రపంచ ఛాంపియన్స్"గా కిరీటాన్ని పొందుతారు. అలాగే వారికి బంగారు పతకాన్ని అందజేస్తారు.[3]
ఈ టోర్నమెంట్ 1977లో ప్రారంభమైంది. 1983 వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడింది. అయితే, IBF (ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్) మొదటి రెండు ఈవెంట్‌లను ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌గా నిర్వహించడంలో ఇబ్బందిని ఎదుర్కొంది (తరువాత ఇది IBFతో కలిసి ఒక బ్యాడ్మింటన్ సమాఖ్యగా ఏర్పడింది) IBF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల తర్వాత అదే లక్ష్యంతో ఒక సంవత్సరం తర్వాత అదే టోర్నమెంట్‌ను నిర్వహించింది.
1985 నుండి ఈ టోర్నమెంట్ ద్వైవార్షికమైంది. అలా 2005 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆడబడింది. 2006 నుండి ఈ టోర్నమెంట్ BWF క్యాలెండర్‌లో వార్షిక ఈవెంట్‌గా మార్చబడింది. షెడ్యూల్ వైరుధ్యాలను నివారించడానికి వేసవి ఒలింపిక్స్ సంవత్సరాలలో టోర్నమెంట్ నిర్వహించబడదు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యమిచ్చే నగరాలు (యూరప్) ==
Seamless Wikipedia browsing. On steroids.