From Wikipedia, the free encyclopedia
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) హోదాతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి స్థాయి సభ్యురాలు. [1] పాకిస్తాన్ మొదటిసారిగా 1952లో అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌తో పోటీ పడింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. [2] [3] అదే సిరీస్‌లో, లక్నోలోని యూనివర్శిటీ గ్రౌండ్లో జరిగిన రెండవ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో గెలిచి, తమ మొదటి టెస్టు విజయాన్నినమోదు చేసింది. [4] [5] 2022 సెప్టెంబరు నాటికి, పాకిస్తాన్ 438 టెస్టు మ్యాచ్‌లు ఆడింది; 145 మ్యాచ్‌లు గెలిచారు, 137 మ్యాచ్‌లు ఓడిపోయారు. 164 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. [6] వారు 1998-99 ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నారు, [7] ఫైనల్లో శ్రీలంకను ఇన్నింగ్స్ 175 పరుగుల తేడాతో ఓడించారు. [8] [9] పాకిస్తాన్ తమ మొదటి వన్డే మ్యాచ్‌ని ఫిబ్రవరి 1973లో న్యూజిలాండ్‌తో లాంకాస్టర్ పార్క్, క్రైస్ట్‌చర్చ్‌లో ఆడింది, [10] అయితే 1974 ఆగస్టులో ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌పై మొదటి విజయాన్ని నమోదు చేసింది [11] 2022 సెప్టెంబరు నాటికి, పాకిస్తాన్ 945 వన్డే మ్యాచ్‌లు ఆడింది, 498 మ్యాచ్‌లు గెలిచింది, 418 లో ఓడిపోయింది; 9 మ్యాచ్‌లు టై అయ్యాయి, 20 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. [12] వారు 1992 క్రికెట్ ప్రపంచ కప్, [13] [14] 2000, 2012 ఆసియా కప్‌లు, [15] [16] 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. [17] 2006 ఆగస్టు 28న బ్రిస్టల్‌లోని కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్ తమ మొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడింది, ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. [18] 2009లో, వారు శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి, 2009 ICC వరల్డ్ ట్వంటీ20ని గెలుచుకున్నారు. [19] 2022 సెప్టెంబరు నాటికి, పాకిస్తాన్ 200 T20I మ్యాచ్‌లు ఆడి, వాటిలో 122 గెలిచింది; 70 ఓడిపోగా 3 టై అయ్యాయి, 7 ఫలితం లేకుండా ముగిశాయి. [20]
2022 సెప్టెంబరు నాటికి పాకిస్తాన్ టెస్టు క్రికెట్లో పది జట్లతో తలపడింది, వారు అత్యంత తరచుగా ఆడిన ప్రత్యర్థి ఇంగ్లాండ్, వారితో 86 మ్యాచ్‌లు ఆడింది.[21] పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై ఇతర జట్టు కంటే ఎక్కువ విజయాలను నమోదు చేసింది -25.[21] వన్డే మ్యాచ్‌లలో, పాకిస్తాన్ 18 జట్లతో ఆడింది; వారు శ్రీలంకతో చాలా తరచుగా ఆడి, 148 మ్యాచ్‌లలో 61.25 విజయ శాతం సాధించారు.[22] పాకిస్తాన్ 92 సార్లు శ్రీలంకను ఓడించింది, ఇది వన్డేలలో వారి అత్యుత్తమ రికార్డు.[22] ఈ జట్టు T20Iలలో 18 వేర్వేరు జట్లతో (ప్రపంచ XIతో సహా) పోటీపడింది. న్యూజిలాండ్‌తో 25 మ్యాచ్‌లు, శ్రీలంకతో 21 మ్యాచ్‌లు ఆడింది. టీ20ల్లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ 15 సార్లు, శ్రీలంకను 13 సార్లు ఓడించింది.[23] ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్‌తో తొమ్మిది సార్లు ఓడిపోయింది.[23]
|
|
ప్రత్యర్థి | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | టైలు | డ్రాలు | గెలుపోటమి నిష్పత్తి | %గెలుపు | % ఓటమొ | % డ్రా | తొలి | చివరి |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 66 | 15 | 33 | 0 | 18 | 0.45 | 22.72 | 50.00 | 27.27 | 1956 | 2019 |
బంగ్లాదేశ్ | 13 | 12 | 0 | 0 | 1 | - | 92.03 | 0.00 | 7.69 | 2001 | 2020 |
ఇంగ్లాండు | 86 | 21 | 26 | 0 | 39 | 0.8 | 24.41 | 30.23 | 45.34 | 1954 | 2020 |
India | 59 | 12 | 9 | 0 | 38 | 1.33 | 20.33 | 15.25 | 64.40 | 1952 | 2007 |
ఐర్లాండ్ | 1 | 1 | 0 | 0 | 0 | - | 100.00 | 00.00 | 00.00 | 2018 | 2018 |
న్యూజీలాండ్ | 60 | 25 | 14 | 0 | 21 | 1.78 | 41.66 | 23.33 | 35 | 1955 | 2021 |
దక్షిణాఫ్రికా | 28 | 6 | 15 | 0 | 7 | 0.40 | 21.42 | 53.57 | 25 | 1995 | 2021 |
శ్రీలంక | 55 | 20 | 16 | 0 | 19 | 1.25 | 36.36 | 29.09 | 34.54 | 1982 | 2019 |
వెస్ట్ ఇండీస్ | 54 | 21 | 18 | 0 | 15 | 1.17 | 38.89 | 33.33 | 28.84 | 1958 | 2021 |
జింబాబ్వే | 19 | 12 | 3 | 0 | 4 | 4.00 | 63.15 | 15.78 | 21.05 | 1993 | 2021 |
Total[6] | 437 | 142 | 133 | 0 | 162 | 1.06 | 32.49 | 30.43 | 37.07 | 1952 | 2021 |
ప్రత్యర్థి | M | W | L | T | NR | % Won | First | Last |
---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్ఘనిస్తాన్ | 4 | 4 | 0 | 0 | 0 | 100 | 2012 | 2019 |
ఆస్ట్రేలియా | 104 | 32 | 68 | 1 | 3 | 30.77 | 1975 | 2019 |
బంగ్లాదేశ్ | 37 | 32 | 5 | 0 | 0 | 86.48 | 1986 | 2019 |
కెనడా | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 | 1979 | 2011 |
ఇంగ్లాండు | 91 | 32 | 56 | 0 | 3 | 36.36 | 1974 | 2021 |
హాంగ్‌కాంగ్ | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 | 2004 | 2018 |
India | 132 | 73 | 55 | 0 | 3 | 57.03 | 1978 | 2019 |
ఐర్లాండ్ | 7 | 5 | 1 | 1 | 0 | 78.57 | 2007 | 2016 |
కెన్యా | 6 | 6 | 0 | 0 | 0 | 100.00 | 1996 | 2011 |
నమీబియా | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | 2003 | 2003 |
నెదర్లాండ్స్ | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 | 1996 | 2003 |
న్యూజీలాండ్ | 107 | 55 | 48 | 1 | 3 | 53.36 | 1973 | 2019 |
స్కాట్లాండ్ | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 | 1999 | 2013 |
దక్షిణాఫ్రికా | 82 | 30 | 51 | 0 | 1 | 37.03 | 1992 | 2021 |
శ్రీలంక | 155 | 92 | 58 | 1 | 5 | 61.25 | 1975 | 2019 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 | 1994 | 2015 |
వెస్ట్ ఇండీస్ | 134 | 60 | 71 | 3 | 0 | 45.89 | 1975 | 2019 |
జింబాబ్వే | 62 | 54 | 4 | 2 | 2 | 91.66 | 1992 | 2020 |
Total[12] | 936 | 490 | 417 | 9 | 20 | 52.35 | 1973 | 2021 |
ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | టై | టై+గె | టై+ఓ | ఫతే | % గెలుపు | తొలి | చివరి |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్ఘనిస్తాన్ | 5 | 3 | 2 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2013 | 2023 |
ఆస్ట్రేలియా | 23 | 12 | 9 | 0 | 1 | 0 | 1 | 56.81 | 2007 | 2019 |
బంగ్లాదేశ్ | 12 | 10 | 2 | 0 | 0 | 0 | 0 | 83.33 | 2007 | 2020 |
కెనడా | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2008 | 2008 |
ఇంగ్లాండు | 21 | 9 | 17 | 0 | 0 | 1 | 1 | 32.5 | 2006 | 2022 |
నమీబియా | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2021 | 2021 |
India | 12 | 3 | 8 | 1 | 0 | 1 | 0 | 23.80 | 2007 | 2022 |
ఐర్లాండ్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2009 | 2009 |
కెన్యా | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2007 | 2007 |
నెదర్లాండ్స్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2009 | 2009 |
న్యూజీలాండ్ | 27 | 17 | 10 | 0 | 0 | 0 | 0 | 63.00 | 2007 | 2023 |
స్కాట్లాండ్ | 4 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2007 | 2021 |
దక్షిణాఫ్రికా | 21 | 11 | 10 | 0 | 0 | 0 | 0 | 52.38 | 2007 | 2021 |
శ్రీలంక | 21 | 13 | 8 | 0 | 0 | 0 | 0 | 61.90 | 2007 | 2019 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2016 | 2016 |
వెస్ట్ ఇండీస్ | 18 | 12 | 3 | 0 | 0 | 0 | 3 | 80 | 2011 | 2021 |
World XI | 3 | 2 | 1 | 0 | 0 | 0 | 0 | 66.66 | 2017 | 2017 |
జింబాబ్వే | 18 | 16 | 2 | 0 | 0 | 0 | 0 | 94.11 | 2008 | 2022 |
Total[20] | 176 | 107 | 64 | 0 | 1 | 2 | 2 | 60.79 | 2006 | 2021 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.