Remove ads
From Wikipedia, the free encyclopedia
పొన్నూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, పొన్నూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
పొన్నూరు | |
స్థాపన | 1964 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
పొన్నూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోని మునిసిపాలిటీ. పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, పొన్నూరు (పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను+ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది.[1].రాష్ట్ర రాజధానికి అమరావతికి 67 కి.మీ దూరంలో ఉంది.1964 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 59,913, జనాభా ఉండగా అందులో పురుషులు 29,486, మహిళలు 30,427 మంది ఉన్నారు.అక్షరాస్యత 78.33% ఉంది.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5507 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 16,138 గృహాలు ఉన్నాయి.[2]
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సజ్జ హేమలత, [3] వైస్ చైర్మన్‌గా ఆకుల సాంబశివరావు పనిచేస్తున్నారు.[3]
ఈ పురపాలక సంఘం 29.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.16 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 25 మురికివాడలు ఉండగా అందులో జనాభా 13107 ఉన్నాయి.30 ప్రభుత్వ ఆసుపత్రులు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.