Remove ads
From Wikipedia, the free encyclopedia
పొట్లపల్లి రామారావు (1917, నవంబర్ 20 - సెప్టెంబర్ 10, 2001) కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు. ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు.[1]
పొట్లపల్లి రామారావు | |
---|---|
జననం | పొట్లపల్లి రామారావు నవంబర్ 20, 1917 తాటికాయల, వరంగల్ జిల్లా |
మరణం | సెప్టెంబర్ 10, 2001 |
ప్రసిద్ధి | కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త |
మతం | హిందూ మతము |
వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం, తాటికాయల గ్రామంలో భూస్వామ్య కుటుంబంలోని పొట్లపల్లి శ్రీనివాసరావు, చెల్లమ్మ దంపతులకు 1917, నవం బర్ 20న జన్మించారు. పొట్లపల్లి 7వ తరగతి వరకే చదివినప్పటికీ, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో వేలా ది పుస్తకాలు చదివారు. వట్టికోట, కాళోజీ రామేశ్వరావు, కాళోజీ నారాయణరావులకు సమకాలికుడి గా, సహచరుడిగా జీవించాడు.
నిజాం పాలనలో తెలంగాణ స్వతంత్య్ర రాజ్యం గా సాగుతున్న రోజుల్లో జాతీయ భావంతో దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తుడు. ఉద్యమంలో భాగంగా ఆయన జైలుకు వెళ్ళారు. మరోవైపు నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాళోజీ తో కలిసి ఉద్యమించాడు. కాళోజీ రామేశ్వర్‌రావు సాన్నిహిత్యంతో ఆయన దృష్టి రచనా రంగంవైపు మళ్ళింది. గ్రామ జీవితాలను ప్రేమించే పొట్లపల్లికి పుట్టిన ఊరు నాటక సృజనకు స్ఫూర్తినిచ్చింది.
తొలి రోజుల్లో పొట్లపల్లి నిజాంపాలనలో ప్రభు త్వం విధించే పన్నులపై తన రచనలతో తిరుగుబా టు చేశారు. పొట్లపల్లి రచనలను ఆయన జీవితాన్ని వేర్వేరుగా చూడలేం. ఆయన సృష్టించిన కవి త్వం, కథలు, నాటికలు ఆనాటి వాస్తవ జీవితాలను ప్రతిబింబిస్తాయి. సబ్బండ వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తాయి. పొట్లపల్లి రామారావు తొలిసారి ఆత్మవేద న పేరుతో గేయకావ్యాన్ని రాశారు. ఎవడు ఇక్కడ రైతు / ఎవడు ఇక్కడ రాజు / కష్టించువాడొకడు / కాజేయువాడొకడు.. అంటూ నిలదీస్తాడు. ఈ కావ్యాన్ని వట్టికోట అళ్వారుస్వామి ప్రచురించి వెలుగులోకి తెచ్చారు. పొట్లపల్లి ఎన్నో నాటకాలు రాసినా ఈ తరం కొన్నింటిని మాత్రమే గుప్పిట పట్టుకోగలిగింది. 1946-49 మధ్యకాలంలో ఆయన రాసిన సర్‌బరాహి, పగ, పాదధూళి, న్యాయం నాటికలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆధుని క భావాలతో ఆ రోజుల్లోనే ప్రయోగాత్మకంగా నాటకాలు రాశారు. తెలంగాణలో మాభూమి, ముందడుగు వంటి నాటకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టిన అదే సమయంలో ఈ నాటికలు ఆవిష్కరించబడిన వి. ఈ నాటక రచనల్లో పొట్లపల్లి చేయి తిరిగిన రచయితగా కనిపిస్తాడు.
దొరలు పరాన్నజీవులై జనంపైబడి దర్జాగా బతుకులీడ్చిన వైనాన్ని ఇతివృత్తంగా తీసుకొని రచయి త 1945లో సర్‌బరాహి నాటిక రాశాడు. సర్‌బరాహి అంటే నాయకత్వం వహించడం. ప్రజలు పండించిన పంటలకు, శ్రమతో ఉత్పత్తి చేసిన వస్తువులకు దొరలు హక్కుదారులమంటూ దోపిడీ చేసేవారు. తెలంగాణలో ప్రధానమైన ఈ అంశాన్ని తీసుకుని రచయిత ఈ నాటికను రాశారు. మనుషులే కాదు అవసరమైతే మూగజీవులు సైతం తిరుగుబా టు చేస్తాయని తస్మాత్ జాగ్రత్త అంటూ ఈ నాటకంతో రచయిత హెచ్చరిక చేస్తాడు. ఈ నాటిక సర్వకాలిక, సార్వజనీనతకు అద్దం పడుతుంది. ఇందు లో రచయిత సృష్టించిన పాత్రలు ఈనాటికి కన్పిస్తాయి. పరాన్నజీవులుగా మానవ వనరులను, సం పదను దోచుకొనే తత్త్వం ఈనాటికీ సహజమే. అందుకే రచయిత నాడు సృష్టించిన పాత్రలు నేటీకి సార్వజనీనమై కనిపిస్తాయి. నిజాం పాలనలో కమ్యూనిస్టుల రాకతో ప్రజల్లో చైతన్యంతో పాటు ఆలోచనల్లో మార్పురావడం ప్రారంభమైంది. దీంతో ప్రజలు పోలీసులపై ధిక్కార ధోరణి ప్రదర్శించేవారు. దీన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోయేవారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగిన గ్రామాలపై పోలీసులు విరుచుకుపడి తీవ్రంగా హిం సించేవారు. ఇలాంటి ఇతివృత్తంతో 1948లో పగ నాటిక రాశాడు.1948 మే నెలలో అభ్యుదయ పత్రికలో ప్రచురితమైంది. రచయిత అట్టడుగు జీవితాలను కథావస్తువుగా తీసుకొని నాటకంగా మలుచడంలో సిద్ధహస్తుడు. 1949లో న్యాయం నాటికను రాశారు. తమ అవసరాలకు పోలీసులు చేసే అకృత్యాలకు బలైపోతున్న బలహీనవర్గాల వాస్తవ జీవితం ఇందులోని ఇతివృ త్తం. తెలంగాణ మాండలికంలో పాత్రల మధ్య సాగే సంభాషణలు మన చూపును పల్లె జీవితాల్లోకి తొం గిచూసేలా చేస్తుంది.1949 ఆగస్టు1న విశాలాంధ్ర పత్రికలో ఈ నాటిక ప్రచురించబడింది.
అస్సాంలోని ఓ మారుమూల ప్రాంతంలో దళిత కుటుంబంపై బ్రిటిష్ సిపాయిలు దాడిచేసి ఓ ఇంటి యజమానిని చంపేశారు. ఆ ఇంటిని దోచుకున్నారు. గాంధీజీ ఆ ప్రాంతాన్ని సందర్శించినపుడు వాళ్ళ విషాదగాథ వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు దగ్గరగా కొన్ని పాత్రలు సృష్టించి పాదధూళి నాటికను రాశారు. ఆగస్టు 1948న అభ్యుదయ పత్రికలో ఈ నాటిక ప్రచురితమైంది. పొట్లపల్లి రామారావు రాసిన నాటకాల్లో ఉత్కంఠ భరితమైన నాటకీకరణ, పాత్రోచిత సంభాషణలు, కథా గమనంలోని సంఘటనలు ప్రత్యేకంగా ఉంటా యి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికార దుర్వినియోగాన్ని ఎలా చేస్తారో కళ్ళకు కట్టినట్లు తమ రచనల్లో చూపించాడు. పొట్లపల్లి తన నాటక సృజనతో సమాజం చైతన్యవంతంగా ఉం డాలని, మార్పుకోసం ఎవరికి వారు నాయకత్వం వహించాలని తన రచనతో ఉద్బోధిస్తాడు.
వంటి రచనలు చేశాడు.[5]
.
పొట్లపల్లి రామారావు 2001, సెప్టెంబర్ 10న మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.