భారతీయ రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2] 2019 సెప్టెంబరు 8 నుండి తెలంగాణ రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (హైదరాబాద్), ఖమ్మంలోని మమత మెడికల్, నర్సింగ్, డెంటల్ కళాశాలలకు ఛైర్మన్ కూడా ఉన్నాడు. 2016లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[3]
పువ్వాడ అజయ్ కుమార్ | |||
శాసనసభ్యుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి | |||
పదవీ కాలం 2014 - 2018, 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ఖమ్మం శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఏప్రిల్ 19, 1965 కునవరం గ్రామం, కునవరం మండలం, (ఖమ్మం) అల్లూరి సీతారామరాజు జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | పువ్వాడ నాగేశ్వరరావు, విజయ లక్ష్మి | ||
జీవిత భాగస్వామి | వసంత లక్ష్మీ | ||
సంతానం | నయన్ రాజ్ | ||
నివాసం | ఖమ్మం |
పువ్వాడ అజయ్ కుమార్ 1965 ఏప్రిల్ 19న పువ్వాడ నాగేశ్వరరావు, విజయ దంపతులకు కూనవరం గ్రామం, కూనవరంమండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా, (తెలంగాణ విభజన తరువాత )ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా లో జన్మించాడు. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే & సీపీఐ జాతీయ నాయకుడు
పువ్వాడ అజయ్ కుమార్ ఇంటర్ వరకు ఆయన ఖమ్మంలోనే చదువుకున్నాడు. డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేశాడు. అయన బెంగుళూరులోని యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చరల్ సైన్స్సెస్ నుండి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసి, గోల్డ్ మెడల్ పొందాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఖమ్మంలోని మమత హాస్పిటల్, మమత మెడికల్ కాలేజీలకు ఛైర్మన్గా వ్యవహరించాడు.
అజయ్ కుమార్ కు వసంత లక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (నయన్ రాజ్).
పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు.[4] 2012 నుంచి 2013 ఏప్రిల్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించాడు.[5] 2013 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి[6] టిడిపి అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5609 ఓట్ల తేడాతో గెలుపొంది, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7] 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[8] 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[10][11][12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.