1979 సినిమా From Wikipedia, the free encyclopedia
పునాదిరాళ్ళు 1979లో గూడపాటి రాజ్‌కుమార్ దర్శకత్వంఓ విడుదలైన తెలుగు చలనచిత్రం. 5 నంది అవార్డులు అందుకున్న ఈ చిత్రం చిరంజీవి తొలిచిత్రం.
పునాదిరాళ్ళు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడపాటి రాజ్‌కుమార్ |
---|---|
తారాగణం | రోజారమణి, నరసింహరాజు |
సంగీతం | ప్రేమ్‌జీ |
నిర్మాణ సంస్థ | ధర్మవిజయ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఒక పల్లెటూర్లో ఆ వూరి సర్పంచి రఘురామయ్య, కరణం, పటేలు, వెంకటయ్య అనే షావుకారు ఈ దుష్టచతుష్టయం గ్రామ ప్రజలను పీల్చుకుని తింటుంటారు. వారు చేసే అత్యాచారాలకు కొదువలేదు. శాంతి అనే యువతి వారి పశుత్వానికి బలవుతుంది. స్కూలు మాస్టరైన ఆ యువతి తండ్రి కూడా వారి అఘాయిత్యానికి గురవుతాడు. శాంతి పిచ్చిదానిలా నటిస్తూ, ఆ వూర్లోనే తిరుగుతూ వుంటుంది. పట్టణంలో చదువుకుని ఇంటికి వచ్చిన రఘురామయ్య కొడుకు రవికి కొద్ది రోజుల్లోనే వూళ్ళో జరిగే భాగోతం అంతా అర్థమౌతుంది. తన మిత్రులందరినీ తోడు తెచ్చుకుని నర్సుగా ఆ వూరికి వచ్చిన రాధ సహాయంతో దుర్మార్గపు ముఠాపై తిరగబడతాడు[1].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.