గోకిన రామారావు
సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
గోకిన రామారావు సహాయ నటుడు పాత్ర నుండి ప్రతినాయకుడి పాత్ర వరకూ అనేక విలక్షణ పాత్రల్లో దాదాపు 100 సినిమాలు పైగా నటించి ప్రేక్షకులను అలరించిన గోకిన రామారావు గారి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం, పెద్దాపురం గోలి వారి వీధిలో రోడ్డు అనుకుని ఉన్న రామాలయం ఆయన స్వగృహం నటనపై చిన్న నాటి నుండి ఉన్న ఆసక్తితో చిన్న చిన్న స్టేజీ షోలతో మొదలైన ఆయన నటనా ప్రస్థానం నటనే ఒక వ్యాపకంగా మరి హైదరాబాదు వరకూ నడిపించింది. సినిమాల్లో చిన్న వేషాలు లభించాయి. ఆ తరువాత దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు మంచి పాత్రకి అవకాశం ఇచ్చారు ఆయన స్వీయ దర్శకత్వంలో తీసిన చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాతో గోకిన రామారావు గారి నట జీవితం ఊపందుకుంది. సినిమా ఆద్యంతం పెద్దాపురం లోనే చిత్రీకరించబడి అద్ద్భుత విజయం సాధించిన శివరంజనీ అనే సినిమాకు దాసరినారాయణ రావు గారికి పూర్తి సహకారం అందించారు. 1979 లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గారి తొలిచిత్రం పునాది రాళ్ళులో పండించిన విలక్షణ నటనకు గానూ గోకిన రామారావు గారికి బంగారు నంది లభించింది. ఇటీవలే అయన 62 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు
నటించిన సినిమాలు
- లాహిరి లాహిరి లాహిరిలో (2002)
- దాదాగిరి (2001)
- రైతురాజ్యం (1999)
- కన్యాదానం (1998)
- సరదాల సంసారం (1997)
- సూరిగాడు (1992)
- సూత్రధారులు (1990)
- మనవడొస్తున్నాడు (1987)
- మంగమ్మగారి మనవడు (1984)
- దేవాంతకుడు (1984)
- పల్నాటి పులి (1984)
- జనని జన్మభూమి (1984)
- మగ మహారాజు (1983)
- అమాయక చక్రవర్తి (1983)
- బడాయి బసవయ్య (1980)
- పునాదిరాళ్ళు (1979)
- రంగూన్ రౌడీ (1979)
- శివరంజని (1978)
- చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
- సోగ్గాడు (1975)
- మోసగాళ్ళకు మోసగాడు (1971)
బయటి లింకులు
ఐ.ఎమ్.బి.డి.లో గోకిన రామారావు పేజీ.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.