From Wikipedia, the free encyclopedia
పీ.సీ. చాకో (జననం 29 సెప్టెంబర్ 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు త్రిసూర్ నుండి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1980 నుండి 1981 వరకు కేరళ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
పి.సి. చాకో | |||
![]() | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం ఫిబ్రవరి 7, 2024 | |||
ముందు | టి.పి. పీతాంబరన్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1 జూన్ 2024 | |||
ముందు | స్థానం స్థాపించబడింది | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | సీకే చంద్రప్పన్ | ||
తరువాత | సిఎన్ జయదేవన్ | ||
నియోజకవర్గం | త్రిసూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | కంజిరపల్లి, ట్రావెన్కోర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కొట్టాయం, కేరళ, భారతదేశం) | 29 సెప్టెంబరు 1946||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఎన్సీపీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్‌సీ (2021 వరకు) | ||
తల్లిదండ్రులు | పిజె చాకో, లేయమ్మ | ||
జీవిత భాగస్వామి | లీల చాకో | ||
సంతానం | 2 | ||
నివాసం | త్రిస్సూర్, కేరళ |
పిసి చాకో కేరళ స్టూడెంట్స్ యూనియన్ తిరువనంతపురం జిల్లా కమిటీకి మొదటి అధ్యక్షుడిగా పని చేసి 1970 నుండి 1973 వరకు భారత యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, 1973 నుండి 1975 వరకు భారత యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1975లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగ నియమితుడై 1979 వరకు పని చేశాడు. ఆయన 1980లో పిరవంశాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 1980 నుండి 81 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.
పిసి చాకో 1991లో త్రిసూర్ నుండి, 1996లో ముకుందపురం నుండి, 1998లో ఇడుక్కి నుండి, 2009లో మళ్లీ త్రిసూర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో చలకుడి నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సినీ నటుడు ఇన్నోసెంట్ చేతిలో ఓడిపోయాడు. పిసి చాకో 10 మార్చి 2021న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,[2] కేరళ రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌కి మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో 2021 మార్చి 16న చేరాడు.[3] ఆయనను 19 మే 2021న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ నియమించాడు.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.