పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
పిచ్చి పుల్లయ్య నేషనల్ ఆర్ట్స్ పతాకంపై, తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, షావుకారు జానకి, కృష్ణకుమారి, గుమ్మడి ప్రధాన తారాగణంగా నిర్మించిన 1953 నాటి సాంఘిక చలనచిత్రం. ఎన్.టి.రామారావు ఈ చిత్రంతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
Remove ads
నిర్మాణం
అభివృద్ధి
అప్పటికే నటునిగా పేరు సంపాదించుకున్న ఎన్.టి.రామారావు 1953లో ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. తన బంధువైన దోనేపూడి కృష్ణమూర్తి ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయన నిలదొక్కునేందుకు సినిమా తీద్దామని భావించారు. అంతేకాక ప్రయోగాలు చేసి తనలోని నటుణ్ణి, సినిమా ప్రియుణ్ని సంతృప్తిపరుచుకోవాలన్న ఆలోచన ఉన్నా, అందుకు వేరే నిర్మాతల సొమ్ము ఉపయోగించలేమన్న దృష్టితోనూ నిర్మాణం ప్రారంభించారు రామారావు. పిచ్చిపుల్లయ్య సినిమాకు రామారావు సోదరుడు నందమూరి త్రివిక్రమరావు మేనేజింగ్ పార్టనర్ గా, రామారావు, దోనేపూడి కృష్ణమూర్తిలు భాగస్వాములుగా వ్యవహరించారు. సినిమాను రామారావు ఒకప్పటి తన రూమ్మేట్ తాతినేని ప్రకాశరావుకి అప్పగించారు.[1]
Remove ads
విడుదల, స్పందన
1953లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే సినిమా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు లభించాయి.[1]
పాటలు
- ఆలపించనా అనురాగముతో ఆనందామృత మావరించగా - ఘంటసాల , రచన: అనిశెట్టి
- ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ - పి.సుశీల
- ఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబె మరచుట మేలోయి - ఎ.పి.కోమల
- ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై - ఆర్. బాలసరస్వతీదేవి, ఘంటసాల, రచన: అనిశెట్టి
- ఓ పంతులుగారు వినవేమయ్యా వింటే రావేమయ్యా - కె. రాణి, పిఠాపురం
- జీవితాంతం వేదన ఈ జీవితం ఒక సాధన జీవితాంతం వేదన - మాధవపెద్ది
- బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా పదిలంగా రావోయి ఓ - పుండరీకాక్షయ్య
- మాననీయడవు నీవయ్యా మానవోన్నతుడ వీవయ్యా - ఎం.ఎస్. రామారావు
- లేదురా సిరిసంపందలలొ లేశమైనా సంతసం ప్రేమ - మాధవపెద్ది
- శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని విడుమన్నా నీయదే నీకే - మాధవపెద్ది
- శోకపు తుఫాను చెలరేగిందా లోకపు చీకటి పెనవేసిందా - ఎం.ఎస్. రామారావు
- సహనాభవతు సహనం భున్నత్తు సహవీర్యం
చిత్ర ప్రత్యేకతలు
- ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. డిగ్లామరైజ్ (పిచ్చివాడి) పాత్రలో నటించి, సహజసిద్ధమైన నటనతో, హాస్యంతో తన ప్రతిభను చాటుకున్నారు.
- ఎన్.టి.ఆర్. తన తమ్ముడైన నందమూరి త్రివిక్రమరావుకు ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను, ఒకప్పటి తన రూమ్మేట్ అయిన తాతినేని ప్రకాశరావుకు దర్శకత్వ బాధ్యతను అప్పగించారు.
- తాతినేని ప్రకాశరావు ఈ చిత్రంలోని విలన్ పాత్రను తన స్నేహితుడైన ఎస్వీ రంగారావు దృష్టిలో ఉంచుకొని రాసుకున్నాడు. అయితే, తన మొదటి ప్రొడక్షన్ లో గుమ్మడికి అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన ఎన్.టి.ఆర్., పట్టుబట్టి మరీ ఆ పాత్రను గుమ్మడిచే చేయించారు. అందుకే, ఈ చిత్రంలోని గుమ్మడి నటన ఎస్వీ రంగారావు నటనను పోలివుంటుంది.
- ఈ చిత్రంతో టి.వి.రాజు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.
- ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. చెప్పిన ‘‘ఈ పట్నంలో అసలు పూలకంటే, కాగితం పూలే ఎక్కువల్లే ఉన్నాయే’’ అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అయింది.[2]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads