పాలక్కాడ్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
పాలక్కాడ్, భారతదేశం, కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లా లోని మధ్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం. ఇది పాలక్కాడ్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. దీని పూర్వ నామం పాలఘాట్. చారిత్రాత్మకంగా పాలక్కట్టుస్సేరి అని పిలుస్తారు. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నదికి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటను 1766 లో మైసూరుకి చెందిన హైదర్ ఆలీ నిర్మించాడు. తర్వాత 1783 లో దీనిని ఆంగ్లేయులు తాత్కాలికంగానూ, 1790లో శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉండే ప్రదేశం వ్యూహాత్మకమైనది కావడంతో వాణిజ్య పరంగా ప్రాముఖ్యతను పొందడమే కాకుండా, రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పేరు గాంచింది.
Palakkad
Palghat, Palakkattussery | |
---|---|
City | |
Nickname: Gateway of Kerala | |
Coordinates: 10.775°N 76.651°E | |
Country | India |
State | Kerala |
Region | South Malabar |
District | Palakkad |
Government | |
• Type | Municipality |
• Body | Palakkad Municipality |
• Chairperson | K. Priya Ajayan (BJP) |
• Deputy Chairman | E. Krishnadas (BJP) |
• Member of Parliament | V. K. Sreekandan (INC) |
• Member of Legislative Assembly | Shafi Parambil (INC) |
విస్తీర్ణం | |
• City | 127 కి.మీ2 (49 చ. మై) |
• Metro | 3,895 కి.మీ2 (1,504 చ. మై) |
Elevation | 84 మీ (276 అ.) |
జనాభా (2011) | |
• City | 5,52,714 |
• జనసాంద్రత | 4,400/కి.మీ2 (11,000/చ. మై.) |
• Metro | 7,12,697 |
Demonym | Palakkadan |
Language | |
• Official | Malayalam |
Time zone | UTC+5:30 (IST) |
Postal Index Number | 678 XXX |
ప్రాంతపు కోడ్ | +91-(0)491 |
Vehicle registration | KL-09 |
Climate | Am/Aw (Köppen) |
పాలక్కాడ్ అత్యంత జనసాంద్రత కలిగిన పురపాలక సంఘ పట్టణం. కేరళలో నాల్గవ అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం.ఇది బ్రిటిష్ పాలనలో భారత స్వాతంత్ర్యానికి ముందు స్థాపించబడింది.పాలక్కాడ్ పురాతన పాలక్కాడ్ కోటకు ప్రసిద్ధి చెందింది.ఇది నగరం నడిబొడ్డున ఉంది.1766లో హైదర్ అలీచే స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాడు.పాలక్కాడ్ నగరం రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి ఈశాన్యంలో దాదాపు 347 కిలోమీటర్లు (216 మై.) దూరంలో ఉంది.
పాలక్కాడ్ కోట 18వ శతాబ్దానికి చెందింది.దాని మైదానంలో దృఢమైన కందకాలు, హనుమాన్ దేవాలయం కలిగిఉన్నాయి..కల్పతీ నదికి ఉత్తరాన, 15వ శతాబ్దానికి చెందిన విశ్వనాథ స్వామి ఆలయం రథోత్సవం ప్రధాన వేదిక. పాలక్కాడ్ గుండా భరతపూజ నది ప్రవహిస్తుంది.[3] పాలక్కాడ్ భారతపుజ నదికి ఉత్తర ఒడ్డున ఉంది.[3]
బ్రిటిష్ రాజ్ కాలంలో పాలక్కాడ్ మలబార్ జిల్లాలోని దక్షిణ మలబార్ ప్రాంతంలో చేర్చబడింది. బ్రిటీష్ ఇండియన్ ఎంపైర్ 1865 మద్రాస్ చట్టం 10 (పట్టణాల మెరుగుదలల చట్టం 1850) ప్రకారం కోజికోడ్, కన్నూర్, తలస్సేరి, ఫోర్ట్ కొచ్చి పురపాలక సంఘాలతోపాటు పాలక్కాడ్ పురపాలక సంఘం 1866 నవంబరు 1న ఏర్పడింది. అవి కేరళ రాష్ట్రంలో పురాతనానికి చెందిన ఆధునిక పురపాలక సంఘాలు.
పశ్చిమ కనుమలలో పాలక్కాడ్ గ్యాప్ ఉండటం వల్ల పాలక్కాడ్ నగరం కేరళకు ప్రవేశ ద్వారంలాగా పనిచేస్తుంది.నగరం మధ్య కేరళలో ఉంది. పాలక్కాడ్‌లో మలయాళం అధికార భాష.భరతపూజ నదికి కల్పతి నది, కన్నడి నది రెండు ప్రధాన ఉపనదులు పాలక్కాడ్ నగరం గుండా ప్రవహిస్తాయి. పాలక్కాడ్ జిల్లాలోని అనేక ఆనకట్టలలో, అతిపెద్ద మలంపూజ ఆనకట్ట పాలక్కాడ్ నగరం నుండి 15 కిలోమీటర్లు (9.3 మై.) దూరంలో ఉంది.[4]
పాలక్కాడ్ నగరం త్రివేండ్రంకు ఈశాన్యం, దాదాపు 347 కిలోమీటర్లు (216 మై.) దూరంలో,కొచ్చి నగరానికి 144 కిలోమీటర్లు (89 మై.) దూరంలో, తమిళనాడులోని కోయంబత్తూరుకు నైరుతిన 50 కిలోమీటర్లు (31 మై.) దూరంలో, త్రిస్సూర్‌కు ఈశాన్యంగా 66 కిలోమీటర్లు (41 మై.) దూరంలో, కోజికోడ్‌కు ఆగ్నేయంగా 127 కిలోమీటర్లు (79 మై.) దూరంలో ఉంద.ఇవిసేలం - కొచ్చి ప్రధానంగా జాతీయ రహదారి 544, కోజికోడ్ - పాలక్కాడ్ జాతీయ రహదారి 966 లతో అనుసంధానించబడి ఉన్నాయి.
సా.శ. మొదటి, నాల్గవ శతాబ్దాల మధ్య సంగం కాలంలో కోయంబత్తూర్ చుట్టుపక్కల ప్రాంతం చేరాస్ రాజులుచే పాలించబడింది.ఈ ప్రాంతం మలబార్ తీరం, తమిళనాడు మధ్య ప్రధాన వాణిజ్య మార్గం అయిన పాలక్కాడ్ గ్యాప్‌కు తూర్పు ప్రవేశ ద్వారంగా పనిచేసింది.[5] పాలక్కాడ్ నగరాన్ని పాలక్కాడ్ రాజులు (తరూర్ స్వరూపం) పాలించారు.[6] పాలక్కాడ్, అలత్తూరు, చిత్తూరు తాలూకాలపై పాలక్కాడ్ రాజుకు హక్కు ఉండేది.చిత్తూరు తాలూకా కొచ్చిన్ రాజ్యంలో భాగంగా ఉండేది.[6] పాలక్కాడ్ రాజా అసలు ప్రధాన కార్యాలయం నేటి మలప్పురం జిల్లాలోని తిరూర్ తాలూకాలోని అథవనాడ్లో ఉంది.[6] అథవానాడ్ ప్రాంతంలోని వారి భూములను అజ్వాంచేరి తంప్రక్కల్కు ఇచ్చారని, బదులుగా పాలక్కాడ్-చిత్తూరు ప్రాంతాలను వారి నుండి కొనుగోలు చేశారని చెబుతారు.[6] పాలక్కాడ్ రాజుల భూభాగం కొంతకాలం జామోరిన్ ఆఫ్ కాలికట్ ఆధీనంలో ఉండేది.[6]
1757లో, కోజికోడ్ జామోరిన్ దండయాత్రను నిరోధించేందుకు, పాలక్కాడ్ రాజా మైసూర్ హైదర్ అలీ సహాయం కోరాడు.[7] 1766లో, హైదర్ అలీ జామోరిన్ ఆఫ్ కోజికోడ్‌ను ఓడించాడు.ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మిత్రుడు కోజికోడ్‌ను తన రాష్ట్రంలోకి చేర్చుకున్నాడు.[7] హైదర్ అలీ 1766లో పాలక్కాడ్ కోటను పునర్నిర్మించాడు [8] కొలతునాడు, కొట్టాయం, కడతనాడు, కోజికోడ్, తానూర్, వల్లువనాడ్, పాలక్కాడ్‌తో సహా కేరళలోని ఉత్తర, ఉత్తర-మధ్య ప్రాంతాలలో (మలబార్ జిల్లా) చిన్న రాచరిక రాష్ట్రాలు మైసూర్ ఆధ్వర్యంలో ఏకం చేయబడ్డాయి. మైసూర్ పెద్ద రాజ్యంలో భాగంగా చేయబడ్డాయి.[9] అతని కుమారుడు, వారసుడు, టిప్పు సుల్తాన్, విస్తరిస్తున్న బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారాలను ప్రారంభించాడు. ఫలితంగా నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో రెండు జరిగాయి.[10][11]
టిప్పు 1790లలో మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం, తదుపరి సెరింగపట్నం ఒప్పందం ఫలితంగా మలబార్ జిల్లా, దక్షిణ కెనరాను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు.రెండూ వరుసగా 1792, 1799 సంవత్సరాల్లో బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీకి పశ్చిమ తీరంలోని ఇతర ప్రాంతాలు జతచేయబడ్డాయి.[12][13][14] తరువాత 1800లో, మలబార్ జిల్లా, దక్షిణ కెనరా రెండూ బొంబాయి ప్రెసిడెన్సీ నుండి విడిపోయి పొరుగున ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేయబడ్డాయి.[8] పాలక్కాడ్ 1947 వరకు బ్రిటిష్ రాజ్ కింద ఉంది.
1951 భారత జనాభా లెక్కల సమయంలో, పాలక్కాడ్ పూర్వపు మలబార్ జిల్లాలో కోజికోడ్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం.[15] ఆ సమయంలో మలబార్‌లోని రెండు పట్టణాలు మాత్రమే నగరాలుగా పరిగణించబడ్డాయి: కోజికోడ్, పాలక్కాడ్.[15] 1956లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మలబార్ జిల్లాలోని పాలక్కాడ్ తాలూకా పాలక్కాడ్, అలత్తూర్, చిత్తూరు అనే మూడు తాలూకాలుగా విభజించారు. చిత్తూరు, అలత్తూరులోని కొన్ని ప్రాంతాలు కొచ్చిన్ రాజ్యంలో భాగంగా ఉన్నాయి. పాలక్కాడ్ జిల్లా, మలబార్ జిల్లా, కొచ్చిన్ రాజ్యంలో కొన్ని భాగాలను విభజించుటద్వారా ఏర్పడింది.[8]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, 2011లో పాలక్కాడ్ జనాభా 1,30,955; ఇందులో పురుషులు 63,833 కాగా, స్త్రీలు 67,122 మంది ఉన్నారు.[16] పాలక్కాడ్ నగరం మొత్తం జనాభాలో అక్షరాస్యులు 1,12,479, వీరిలో 56,065 మంది పురుష అక్షరాస్యులు కాగా, 56,414 మంది స్త్రీల అక్షరాస్యులు ఉన్నారు.పాలక్కాడ్ నగర అక్షరాస్యత రేటు 94.20 శాతం, ఇందులో పురుషుల అక్షరాస్యత 96.83 శాతం కాగా, స్త్రీల అక్షరాస్యత 91.73 శాతం ఉంది.పాలక్కాడ్ మహానగర ప్రాంత అక్షరాస్యత రేటు 92.14%, ఇది జాతీయ సగటు 59.5% కంటే చాలా ఎక్కువ ఉంది.[17][18] నగర మొత్తం జనాభాలో హిందువులు 89,098 మంది జనాభాతో 68% శాతం ఉన్నారు.[16] ముస్లింలు 36,620 మంది జనాభాతో 27.9% శాతం ఉన్నారు.[16] క్రైస్తవులు 5,006 మంది జనాభాతో 3.8% శాతం ఉన్నారు.[16]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాలక్కాడ్ కేరళలోని మొట్టమొదటి, ఏకైక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యాసంస్థ.[19][20] పురాతన ఉన్నత విద్యా సంస్థలలో ఒకటైన ప్రభుత్వ విక్టోరియా కళాశాల ఇది 1888లో ప్రారంభించబడింది. కేరళలోని నాల్గవ ఇంజినీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. కళాశాల 1960లో ప్రారంభించబడింది.
దక్షిణ రైల్వే జోన్‌లోని పాలక్కాడ్ రైల్వే విభాగం,భారతదేశంలోని పురాతన రైల్వే విభాగాలలో ఒకటి. ఇక్కడ ప్రధాన కార్యాలయం ఉంది.దక్షిణ రైల్వే పరిధిలోని నివాస కాలనీలలో ఒకటైన హేమాంబిక నగర్ రైల్వే కాలనీ అని పిలువబడే పాలక్కాడ్ రైల్వే డివిజన్లోని రైల్వే ఉద్యోగుల నివాస కాలనీ ఈ కార్యాలయానికి సమీపంలో ఉంది.[21] రాష్ట్రంలో దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక పాఠశాల కాలనీ పరిధిలో ఉంది.[22] డివిజన్లోని గ్రూప్ సి, డి ఉద్యోగుల కోసం మల్టీ డిసిప్లినరీ డివిజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కాలనీలో ఉంది.[23]
ఈ నగరం పాలక్కాడ్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి కేంద్రం.[24] ప్రధానంగా, ఉత్తర, దక్షిణ, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు అనే మూడు రక్షకభట నిలయాలు నగరానికి సేవలు అందిస్తున్నాయి.[25][26][27] హేమాంబికా నగర్, పాలక్కాడ్ కసబా, మలంపుజా, వాలాయార్ రక్షకభట నిలయాలు నగరానికి సేవలు అందిస్తున్నాయి.[28][29][30][31] కేరళ సాయుధ పోలీసు 2 బెటాలియన్ ముట్టికులంగర ఒకటి, శివారు ప్రాంతాలలో ఒకటి ఉన్నాయి ఒకటి.[32] పాలక్కాడ్ జిల్లాకు చెందిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ క్యాంపు నగరం మధ్య నుండి దాదాపు 10 కి.మీ. దూరంలో కల్లెక్కాడ్లో ఉంది [33]
కేరళ రాష్ట్ర శాసనసభకు పాలక్కాడ్ నగరం నుండి ఇద్దరు శాసనసభ సభ్యులు, ఒకరు పాలక్కాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి, మరొకరు మలంపుజా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, . పాలక్కాడ్ పురపాలక సంఘం పాలక్కాడ్ శాసనసభ నియోజకవర్గంలో ఒక భాగంగా ఉంది. 2021నాటికి, షఫీ పరంబిల్ పాలక్కాడ్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎ. ప్రభాకరన్ మలంపుజా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో పాలక్కాడ్ నగరం ఒక భాగం. ఈ నియోజకవర్గం నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు సభ్యుడిని ఎన్నుకుంటుంది. ప్రస్తుత లోక్‌సభ సభ్యుడుగా భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన వీకే శ్రీకందన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
పాలక్కాడ్ జిల్లా కలెక్టరు కార్యాలయం నగరంలో ఉంది. జిల్లా న్యాయస్థాన సముదాయం సనబహ కాంప్లెక్స్, జిల్లా పంచాయతీ కార్యాలయంతో సహా అనేక ఇతర జిల్లా కార్యాలయాలు నగరంలో ఉన్నాయి. పాలక్కాడ్ తాలూకా కార్యాలయం సివిల్ స్టేషన్లో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.