From Wikipedia, the free encyclopedia
హైదర్ ఆలీ (ఉర్దూ: سلطان حيدر علی خان) హైదర్ ఆలీ, సి 1720–1782 డిసెంబరు 7, ఇస్లామిక్ కేలండర్ ప్రకారం 2 ముహర్రం 1197) దక్షిణాదిన ఉన్న మైసూర్ రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి (సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, మైసూరు ప్రభుత్వంపై పెత్తన్నాన్ని సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు. అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం, నిజాం హైదరాబాదు వద్ద వరకు విస్తరించాడు. హైదర్ ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణనను సమర్థవంతంగా అడ్డుకున్న కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు స్థావరమైన మద్రాసుకు అతి సమీపానికి రాగలిగాడు. అతను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు.
హైదర్ అలీ | |
---|---|
మైసూరు పాలకుడు | |
పరిపాలన | 1761 - 1782 |
జననం | c. 1722 |
జన్మస్థలం | నేటి కర్ణాటకలోని కోలార్ సమీపములో గల బుధికోట |
మరణం | 1782 |
మరణస్థలం | చిత్తూరు |
ఇంతకు ముందున్నవారు | కృష్ణరాజ వడయార్ |
తరువాతి వారు | టిప్పు సుల్తాన్ |
రాజకుటుంబము | మైసూర్ సల్తనత్ |
తండ్రి | ఫతేమహమ్మద్ |
హైదర్ ఆలీ పాలన తన పొరుగువారితో తరుచుగా జరిగే యుధ్ధాలతోను, తన రాజ్యం లోపల జరిగే తిరుగుబాటులతోను కూడిఉంది. ఇది ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. నిజానికి అప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువభాగం సంక్షోభంలో ఉంది. మరాఠా సమాఖ్య మొఘల్ సామ్రాజానికి చెందిన అధికారులతో పోరాడుతున్నది. అతను ఒక మంచి తెలివి గల నేత. తను పాలన చేపట్టినప్పుటి కంటే పెద్ద రాజ్యాన్ని తన కుమారుడు టిప్పు సుల్తానుకు వదిలివెళ్ళాడు. అతను తన సైన్యాన్ని ఐరోపా సైన్యపు పధ్ధతులలో వ్యవస్థీకరించాడు. రాకెట్ ఆర్టిలరీని సైనికంగా వినియోగించడాన్ని అభివృధ్ధిచేసాడు, అతను ఇద్దరు భార్యలు,, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
హైదర్ నాయక్ ఎప్పుడు పుట్టినది కచ్చితంగా తెలియదు. కానీ వివిధ చారిత్రక ఆధారాలను అనుసరించి 1717–1722 మధ్య జన్మించాడు అని తెలుస్తుంది.[1] అతని పూర్వీకుల గురించి చాలా వాదనలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు అతని తాత పర్షియా నుంచి వలసవచ్చిన ముస్లిం సంతతికి చెందినవాడని చెబుతున్నాయి.[2] మరి కొన్ని ఆధారాలు అతని పూర్వీకులు నేటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినవారని చెబుతున్నాయి..[2] మరో ఆధారం ప్రకారం, హైదర్ తనను తాను స్వయంగా ముహమ్మద్ ప్రవక్త యొక్క తెగ అయిన అరబ్ ఖురేష్ తెగ సంతతిగా పేర్కొన్నట్లుగా ఆయన ఆస్థానంలో పనిచేసిన ఒక ఫ్రెంచ్ సైనిక అధికారి వ్రాసినట్లు తెలుస్తుంది.[3] అతని తండ్రి ఫతేమహమ్మద్ కోలార్లో జన్మించాడు. కర్ణాటక నవాబు యొక్క సైన్యంలో వెదురు రాకెట్ ఆర్టిలరీలో 50 మందికి అధిపతిగా పనిచేశాడు (ప్రధానంగా సంజ్ఞలు చేయటం కోసం ఉపయోగించేవారు). తరువాత ఫతే ముహమ్మద్ మైసూరును పాలించే వొడయారుల సేవలో చేరి శక్తివంతమైన సైన్యాధిపతి స్థాయికి ఎదిగాడు. వొడయారులు ఆయన సేవకు మెచ్చి బుధికోట జాగీరును ప్రదానం చేశారు. అక్కడ అతను నాయక్ పనిచేశాడు[1].
హైదర్ ఆలీ బుధికోటలో జన్మించాడు. అతను ఫతే ముహమ్మద్ యొక్క ఐదవ సంతానం, అతని మూడవ భార్య వలన కలిగిన రెండవ సంతానం.[1] హైదర్ బాల్యజీవితం గురించి పెద్దగా తెలియదు. అతని తండ్రి పోరాటంలో మరణించిన తరువాత, తన సోదరుడు సాబాజ్ తో పాటు సైనిక సేవలో చేరాడు.[4] ఆర్కాట్ పాలకుల కింద అనేక సంవత్సరాలు పనిచేసి తరువాత వారు హైదర్ ఆలీ అంకుల్ పనిచేసిన శ్రీరంగపట్నానికి చేరారు. అతను వారిని కృష్ణరాజ వొడయారు యొక్క దళవాయి అయిన దేవరాజు, ఆయన సోదరుడు నంజరాజుకు పరిచయం చేశాడు.[5] సోదరులకు మైసూరు సైన్యంలో ఉద్యోగం ఇచ్చారు. హైదర్ షాబాజ్ కింద పనిచేశాడు అతను 100 మంది అశ్వకులు, 2,000మంది గల పదాతి దళానికి నాయకత్వం వహించాడు.[6]
1748 లో హైదరాబాదును సుదీర్ఘకాలం పాటు పాలించిన మొదటి నిజాం కమరుద్దీన్ ఖాన్ మరణించాడు. అతని తరువాత సింహాసనం కోసం అసఫ్‌ఝా కొడుకు నాసిర్ జంగ్, అసఫ్‌ఝా మనవడు (కూతురు కొడుకు) ముజఫ్ఫర్ జంగ్ మధ్య పోరుతో, రెండవ కర్ణాటక యుధ్ధం మొదలైంది. రెండు వైపులా ఇతర స్థానిక నాయకులు పక్షాలు వహించి మద్దతుతెలిపారు. దీనిలో ఫ్రెంచ్, బ్రిటిష్ బలగాలు కూడా పాల్గొన్నాయి. దేవరాజు అతని సోదరునికి మరిన్ని సైనిక అధికారాల్ని సంక్రమింపచేశాడు. 1749లో నంజరాజు నాసిర్ జంగుకు మద్దతుగా మైసూరు సైన్యాన్ని మోహరించాడు. మైసూరు సైన్యం దేవనహళ్ళి చేరుకుని, అక్కడ ముజఫ్ఫర్ జంగ్ యొక్క దళాల ఆధీనంలో ఉన్న దేవనహళ్ళి కోట ముట్టడిలో పాల్గొన్నది. ముట్టడికి ఫ్రెంచి సైనికాధికారి మార్కీస్ దే బుస్సీ నాయకత్వం వహించాడు.[7] విజయవంతమైన ఎనిమిది నెలల ముట్టడి సమయంలో, నాయక్ సోదరులు తమ సామర్థ్యాన్ని నిరుపించుకున్నారు. దీనికి ప్రతిఫలంగా వారికి మరింత పెద్ద హోదాలు లభించాయి.[6] 1755 నాటికి హైదర్ ఆలీ 3.000 పదాతి, 1.500 అశ్వకదళం గల దళానికి నాయకత్వం వహించాడు, దోచుకొన్న ధనంతో తన సంపదను పెంచుకున్నాడు.[8] ఆ సంవత్సరంలో ఆయన కూడా దిండిగుల్ ఫౌజుదారుగా (సైనికాధిపతి) నియమించబడ్డాడు [9] ఈ స్థానంలో ఆయన మొదట తన ఫిరంగి దళానికి నిర్వహణ, శిక్షణ కోసం ఫ్రెంచి సలహాదారులును నియమించుకున్నాడు. హైదర్ స్వయంగా బుస్సీతో కలిసి పనిచేసాడని, ముజఫ్ఫర్ జంగ్, చందా సాహిబ్ లను ఇద్దరినీ కలిసాడని నమ్ముతారు..[10] అదే సంవత్సరం కర్నూలు నవాబు మీదికి దాడికి వెళ్ళి రెండు లక్షలు కప్పంగా స్వీకరించాడు, అలాగే ఆ ప్రాంతాన్ని మైసూరు సామ్రాజ్యానికి సామంతరాజ్యంగా చేసుకున్నాడు[11].ఈ ప్రారంభ యుద్ధాలలో ఆయన కర్ణాటక నవాబు ముహమ్మద్ ఆలీ ఖాన్ వల్లజా అయిష్టానికి, అవిశ్వాసానికి గురయ్యాడు. నిజానికి ముహమ్మెద్ ఆలీ ఖాన్ వల్లజా, మైసూరు నాయకుల మధ్య చాలా కాలంగా వైరం ఉంది. వారు ఒకరి భూభాగాన్ని ఒకరు ఆక్రమించాలని చూస్తున్నారు..[12] మహమ్మద్ ఆలీ ఖాన్ వల్లజా అప్పటి బ్రిటిష్ వారితో పొత్తు కుదుర్చుకున్నాడు. అతని వలననే తరువాతి సంవత్సరాలలో బ్రిటిషు వారితో దీర్ఘకాలిక పొత్తులు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలుకాలేదని హైదర్ ఆలీ ఆరోపించాడు.[13]
కర్ణాటక యుద్ధాలలో, హైదర్ ఆలీ, తన మైసూరు సైనిక దళాలు జోసెఫ్ ఫ్రాంషోయిస్ డూప్లే, కౌంట్ డి లాలీ, దే బుస్సీ మొదలైన ఫ్రెంచ్ కమాండర్లతో కోసం పనిచేశాడు, వివిధ సందర్భాలలో చందా సాహిబ్‌కు కూడా సహాయపడ్డాడు. హైదర్ ఆలీ ముజాఫర్ జంగుకు మద్దతు తెలిపాడు, తరువాత సలాబత్ జంగ్కు మద్దతు తెలిపాడు. రెండవ కర్ణాటక యుద్ధం సమయంలో, హైదర్ ఆలీ శ్రీరంగపట్నం యుద్ధం, గోల్డెన్ రాక్ యుద్ధం, షుగర్-లోఫ్ రాక్ యుద్ధం, టోడ్ మాన్ వుడ్స్ యుద్ధాలలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. మూడో కర్ణాటక యుద్ధం సమయంలో, హైదర్ ఆలీ త్రివాడీ యుద్ధం, పాండిచ్చేరి యుద్ధం సమయంలో చురుకుగా పాల్గొన్నాడు.[13]
ప్రారంభ దశలో హైదర్ ఆలీ తన ముఖ్య ఆర్థిక సహాయకుడిగా ఖండే రావు అనే బ్రాహ్మణుడిని నియమించుకున్నాడు. హైదర్ ఆలీ నిరక్షరాస్యుడైనప్పటికి, అతనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి, సంఖ్యాచతురత ఉండేవి. ఖండే రావు అతని ఆర్థికవ్యవహారాలు నిర్వహించేందుకు ఒక గణన వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థ అన్ని రకాల ఆదాయాలను లెక్కించడానికి వీలుగా తనిఖీలు మరియి నిల్వ లెక్కలను కలిగి ఉండేది. దోచుకొన్న వాటిలో అన్ని రకాల భౌతిక వస్తువులను లెక్కించడానికి వీలయ్యేది. దీనితో చాలా తక్కువ మోసంతో లెక్కించవచ్చు. ఈ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ హైదర్ ఆలీ యొక్క ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించింది[14].
1757 లో హైదర్ ఆలీని హైదరాబాదు, మరాఠీలకు వ్యతిరేకంగా పోరాడటానికి దేవరాజుకు సహాయంగా శ్రీరంగపట్నానికి పిలిపించారు. తను వచ్చినప్పుడు మైసూరు సైన్యంలో గందరగోళము నెలకొంది, జీతం కోసం తిరుగుబాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దేవరాజు శ్రీరంగపట్నంలో ప్రమాదాలను తప్పించుకునే పనిలో ఉండగా, హైదర్ ఆలీ సైన్యానికి జీతం చెల్లించే ఏర్పాటు చేశాడు. తిరుగుబాటు నాయకులను బంధించాడు. అదే సమయంలో హైదర్ ఆలీ అప్పుడు మలబారుకు చెందిన నాయర్లకు వ్యతిరేకంగా మైసూరు చేసిన దండయాత్రలకు నాయకత్వం వహించాడు.[15] ఈ కార్యకలాపాలలో హైదర్ ఆలీ చేసిన సేవలకు దేవరాజ్ బెంగుళూర్ను (ప్రాంతీయ గవర్నర్) బహుమతిగా ఇచ్చాడు.[16]
1758 లో హైదర్ ఆలీ విజయవంతంగా బెంగుళూరును మరాఠీల ముట్టడి నుండి కాపాడాడు. 1759 నాటికి హైదర్ ఆలీ మొత్తం మైసూరు సైన్యానికి నాయకత్వం వహించనారంభించాడు..[17] హైదర్ ఆలీ యొక్క పనితీరుకు సంతసించిన యువకుడైన రాజా కృష్ణరాజ వొడయారు అతనికి ఫతే హైదర్ బహదూర్ లేదా నవాబ్ హైదర్ ఆలీ ఖాన్ బిరుదులు ఇచ్చి సత్కరించాడు.[18][19] మరాఠీలతో జరుగుతున్న పోరాటాల వలన మైసూరు ఖజానా దివాలా తీయడంతో, రాజ మాత నంజరాజును ప్రవాసంలోకి పంపింది. నంజరాజు 1758లో తన సోదరుని మరణం తరువాత దళవాయి పదవిని పొందాడు.[15][16] తత్ఫలితంగా నంజరాజు సన్నిహితుడుగా మైసూరు సభలో హైదర్ ఆలీ తన ప్రాభవాన్ని పెంచుకోగలిగాడు.[16]
1760లో రాజమాత హైదర్ ఆలీని బహిష్కరించుటకు వీలుగా రాజా సేవ లోకి వచ్చిన ఖండే రావుతో కలసి కుట్రపన్నింది. దీని వలన అతను వెంటనే తన కుమారుడు టిప్పు సుల్తాన్ సహా తన కుటుంబం గృహ నిర్బంధంలో ఉంచి శ్రీరంగపట్నాన్ని వదిలి వెళ్ళాడు.[16][20] ఈ ఆకస్మిక నిష్క్రమణ వలన కొద్ది వనరులు మాత్రమే హైదర్ ఆలీకి మిగిలాయి. అనుకోకుండా అతనికి దూరంగా పానిపట్టులో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల భారీ ఓటమి బాగా లాభించింది. ఈ నష్టం వలన మరాఠీలు మైసూరు నుండి దళాలు వెనక్కి పిలిపించారు. హైదర్ ఆలీ బావమరిది మఖ్దూమ్ ఆలీ బిదనూరు, సుండా వరకు వారిని వెంబడించాడు.[21][22] హైదర్ ఆలీ వెంటనే సీరాకు మీర్జా సాహిబ్, బెంగుళూరుకు ఇబ్రహీం ఆలీ ఖాన్, బస్నాగర్ లో తన దాయాది అమీన్ సాహిబ్ సైనికాధికారులుగా నియమించడం ద్వారా తన బలాన్ని పటిష్ఠం చేసుకున్నాడు.ఆ తరువాత హైదర్ ఆలీ బెంగుళూరులోని తన స్థావరం నుంచి 3.000 మంది గల సైన్యంతో, 6.000 మంది గల మఖ్దూమ్ ఆలీ యొక్క దళాలతో కలసి శ్రీరంగపట్నంపై దాడికి బయలుదేరాడు.[20]
వారు రాజధాని చేరే ముందు ఖండే రావు యొక్క దళాలతో పోరాడవలసి వచ్చింది.11.000 సైనికులతో ఖండే రావు, హైదర్ ఆలీపై విజయం సాధించాడు. దీనితో హైదర్ ఆలీ ప్రవాసంలో ఉన్న నంజరాజు మద్దతు కోరాడు. నంజరాజు అతనిని తన సైన్యంపై అధికారాన్ని, దళవాయి పదవిని ఇచ్చాడు.[22][23] ఈ సైన్యంతో హైదర్ ఆలీ మరలా ఖండే రావుపై దాడికి బయలుదేరాడు. రెండు సైన్యాలు మళ్ళీ ఎదురయ్యాయి, కానీ హైదర్ ఆలీ పన్నిన ఒక ఉపాయం వలన ఖండే రావు యుద్ధంలో పాల్గొనడానికి బదులుగా పారిపోవలసివచ్చింది. హైదర్ ఆలీ నంజరాజ్ పంపినట్లుగా ఒక లేఖను ఖండే రావు కమాండర్లకు పంపించాడు, దీనిలో ఖండే రావును హైదర్ ఆలీకు అప్పగించమని ఉంది. ఈ కుట్రకు భయపడి, ఖండే రావు శ్రీరంగ పట్నానికి పారిపోయాడు. ఇప్పుడు నాయకత్వం లేని సైన్యానికి వ్యతిరేకంగా ఒక చిన్న యుద్ధంలో గెలిచి, హైదర్ ఆలీ మిగిలిన భాగాలను, దాని చుట్టూ ఉన్న శ్రీరంగ పట్నాన్ని ఆక్రమించుకున్నాడు.[24] తరువాత జరిగిన చర్చల ఫలితంగా దాదాపు మైసూరు రాజ్యమంతా అంతా హైదర్ ఆలీ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఈ ఒప్పందంలో భాగంగా ఖాండే రావు లొంగిపోయాడు. హైదర్ ఆలీ ఖాండే రావును బెంగుళూరులో బంధించాడు.[25]
1761 సంవత్సరంలో ఖండే రావుని యొక్క పదవీచ్యుతుని చేసిన తర్వాత హైదర్ ఆలీ మైసూర్ సుల్తనేట్ను స్థాపించాడు, అధికారికంగా మొఘల్ చక్రవర్తి షా ఆలం II అనుకూలంగా తనను తాను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్ అని ప్రకటించుకున్నాడు. హైదర్ ఆలీ హైదరాబాద్ నిజాంతో దౌత్యవిదషయాలలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు, ఎందుకంటే ఒక అధికారిక మొఘల్ ఫర్మానా ప్రకారం నిజాం దక్షిణ భారతదేశం లోని అన్ని ముస్లిం మతస్థుల పాలన ప్రాంతాలకు సార్వభౌమాధికారి. ఈ నేపథ్యంలో హైదర్ ఆలీ మొఘల్ చక్రవర్తి షా ఆలం II నుండి తన అధికారాన్ని గుర్తించే అధికారిక అనుమతిని పొందాడని తెలుస్తోంది.[15][26]
మలబార్ తీరంలో, రెండవ ఆలీ రాజా కుంహీ అంస, హిందూ మహాసముద్రం లో10 దోస్ అనబడే చిన్న పడవలు, 30 కెచ్ అనబడే పెద్ద పడవలు గల ఒక పెద్ద సాయుధ నౌకాదళాన్ని తయారుచేశాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా ఆక్రమించలేని ద్వీపాలను ఆక్రమించేందుకు బయలుదేరాడు.[27] 1763 సంవత్సరంలో లక్షద్వీప్, కాన్ననోర్ నుండి హైదర్ ఆలీ రంగులు చిహ్నములు గల జెండాలున్న ఓడలు సిపాయిలను మోసుకుని వెళ్ళి మాల్దీవులన ఆక్రమించాయి. వారు ద్వీపాలు నివసించే తోటి ముస్లింల పట్ల క్రూరత్వాన్ని చూపారు.వెంటనే రెండవ ఆలీ రాజా కుంహీ అంస మైసూర్ లోని, బెంగుళూర్ రేవుకు తిరిగి వచ్చాడు, తరువాత హైదర్ ఆలీకి విధేయతను చూపించడానికి నాగర్ కు వచ్చాడు. ఆలీ రాజా కళ్ళుపోగొట్టుకుని దుస్థితిలోఉన్న మాల్దీవులు సుల్తాన్ అయిన హసన్ ఇజ్జుద్దీన్ ను హైదర్ ఆలీ ముందు హాజరుపరిచాడు. అయితే హైదర్ ఆలీ ఆలీ రాజా చేసిన దౌర్జన్యకరమైన పనికి చాలా భయపడ్డాడు. హైదర్ ఆలీ తన నావికా కమాండ్ నుండి వెర్రి ఆలీ రాజాను వైదొలగాలని, తన నేరాన్ని క్షమించమని సుల్తాన్ హసన్ ఇజ్జుద్దీన్ ను యాచించమని అడ్మిరల్ ను ఆదేశించాడు.ఆ సంఘటన హైదర్ ఆలీ లోతుగా బాధపడ్డాడు. మర్యాదపూర్వకంగా మాల్దీవులకు సుల్తాన్ హసన్ ఇజ్జుద్దీన్ తిరిగి పంపించేశాడు. మాల్దీవులను సుల్తాన్ హసన్ ఇజ్జుద్దీంకు తిరిగి అప్పగించాడు. అప్పుడు హైదర్ ఆలీ రాజభవనాల నుండి వెళ్ళిపోయి సుఫీ బోధనల వలన ఓదార్పును పొందాడు. తను శక్తి, అధికారం అప్పగించిన వారిని గట్టిగా నమ్మటం మొదలుపెట్టాడు.[28]
తరువాత సంవత్సరాలలో హైదర్ తన భూభాగాలు ఉత్తరానికి విస్తరించాడు .రెండు ముఖ్య సముపార్జనలు సీరాను, బెదనోర్ రాజ్యం. సీరాను మరాఠీయుల నుండి తీసుకున్నాడు. బెదనోర్ రాజ్యంతో జరిగిన ఒప్పందం ఫలితంగా తిరుగుబాటు దారులకి వ్యతిరేకంగా అసలైన వారసునికి మద్దత్తు ఇవ్వడావనికి అంగీకరించాడు.[29] 1763 లో అతను దాని రాజధాని ఇక్కేరిని పట్టుకున్నాడు.దీనిలో ఒక పెద్ద ఖజానా కూడా ఉంది.[30] అతను రాజధానిని హైదర్నగర్ అని పేరు మార్చాడు. తనను తాను హైదర్ ఆలీ ఖాన్ బహదూర్ అని పిలుచుకోవడం ప్రారంభించాడు. సీరాను తీసుకున్నందుకు బదులుగా సాలార్ జంగ్ అతనికి ఈ బిరుదుని బహుకరించాడు.[31] అతను తన కుటుంబంలో ఎక్కువ భాగాన్ని సహజమైన కోట అయిన ఇక్కేరికి మార్చాడు "ఇది ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పిస్తుందని" అని నమ్మాడు.[32] అతను, బెదనూర్ పాలకుడి రాజచిహ్నాలను పొందాడు. నాణేలు జారీ చేయడం ప్రారంభించించాడు, ఒక్ కొత్త తూనికలు, కొలతలు ఒక వ్యవస్థ ఏర్పాటుచేశాడు. ఆయన తన కుమారుడు టిప్పు నాణ్యమైన విద్య పొందడానికి నేర్పరులైన ఉపాధ్యాయులను నియమించాడు. తన పిల్ల వాడిని క్రమశిక్షణతో పెంచుటకు సరైన పరిచారకులను నియమించాడు.[33] అతను విదేశీయుల పట్ల అనుమానాన్ని పెంచుకున్నాడు.అంతేగాక బ్రిటిష్ రెసిడెంట్ తన ఆస్థానంలో ఉండటానికి నిరాకరించాడు.[33] అయితే అతని బెదనోర్ లో తనకు సరైన భద్రత లేకపోవడం వలన (అనారోగ్యం కలగటం వలన, అతనికి వ్యతిరేకంగా విస్తృతమైన కుట్రలు జరగటం వలన) అది తన రాజ్యానికి సరైన రాజధాని కాదని బెదనూర్ ని మైసూరుకు తిరిగి వచ్చాడు.[34]
బెదనూర్ స్వాధీనం వలన హైదర్ ఆలీకి మంగుళూరుతో సహా మలబార్ తీరంలోని అనేక రేవులు లభించాయి.[35] హైదర్ ఒక చిన్న నౌకాదళం ఏర్పాటు చేయడానికి ఈ ఓడరేవులు ఉపయోగపడ్డాయి.నౌకాదళానికి చెందిన ముద్రిత సమాచారము ముక్కలు ముక్కలుగా లభించింది.[36] పోర్చుగీస్ రికార్డుల వలన ఈ నౌకాదళం 1763, 1765 మధ్య ప్రారంభించబడిందని తెలుస్తుంది.[37] దీనికి అధికారులుగా యూరోపియన్లనే నియమించడం జరిగింది, దీని మొదటి అడ్మిరల్ ఒక ఆంగ్లేయుడు.[37] కానీ1768 తరువాత దాని అడ్మిరల్ గా ఆలీ బే (లేదా లుప్త్ ఆలీ బెగ్) అనే మైసూర్ అశ్వకదళ అధికారిని నియమించాడు.[38] అతనిని హైదర్ ఎంపిక చేశాడు. ఎందుకంటే యూరోపియన్ అధికారులను అతను నమ్మేవాడు కాదు.[37]
హైదర్ మంగుళూరులోని క్రైస్తవ జనాభాతో స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగిఉన్నాడు. మంగుళూరులో దీర్ఘకాలికంగా పోర్చుగీస్ ల ప్రభావం వలన చెప్పుకోదగ్గ సంఖ్యలో రోమన్ కాథలిక్ జనాభా జనాభా ఉండేది, వారు సాధారణంగా క్రైస్తవులు.[39] అతను ఇద్దరు గోవా కేథలిక్ మతాచార్యులైన, బిషప్ నరోన్హా, Fr. జోచిమన్ మిరాండాతో మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉండేవి.[40] అందువలన ఒక ప్రొటెస్టంట్ మిషనరీని తన ఆస్థానంలో ఉండడానికి అనుమతి ఇచాడు.[41] హైదర్ సైన్యంలో కాథలిక్ సైనికులు కూడా ఉండేవారు, అంతేగాక అతను క్రైస్తవులు శ్రీరణ్గపట్నం వద్ద ఒక చర్చిని నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చాడు. దీనిని ఫ్రెంచ్ జనరల్స్ ప్రార్థనలు చేయడానికి ఉపయోగించేవారు, పూజారులు దీనిని సందర్శించేవారు. మంగుళూరు చరిత్రకారుడు ఏ.అల్. పి. డిసౌజా చెప్పిన దాని ప్రకారం హైదర్ తన పరిపాలనలో అధికారులుగా క్రైస్తవులను కూడా చేర్చుకున్నాడు. పోర్చుగీస్సులతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం, అతను పోర్చుగీస్ పూజారులు, క్రైస్తవులకు మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతి ఇచ్చాడు.[42] అయితే, అనేక మంగళూరు ప్రజలు (కేవలం క్రైస్తవులేగాక) అతను వారిపై విధించబడిన భారీ పన్నుల భారం వలన అతనిని ఇష్టపడేవారు కాదు.[43]
హైదర్ దాడి చేసినప్పుడు బెదనోర్ రాణి సహాయం కోసం సావనూర్ నవాబ్ కు విజ్ఞప్తి చేసింది. దీని పర్యావసానంగా హైదర్ ఆలీ తనకు కప్పము చెల్లించవలసినదిగా నవాబ్ ను బెదిరించారు.[44] ఈ ప్రయత్నంలో విఫలమైన తర్వాత అతను ఆ భూభాగాన్ని ఆక్రమించి తుంగభద్ర నది ఉత్తరాన ఉన్న ధార్వాడ్ కు చాలా దగ్గరకు వచ్చాడు.[45] అయితే సావనూర్ నవాబు మరాఠీయులు సామంతుడు కావడంతో, పేష్వా ఒక బలమైన సైన్యంతో ఎదురుదాడికి దిగి రత్తిహల్లి సమీపంలో హైదర్ ను ఓడించాడు. మరాఠా విజయం తరువాత హైదర్ బెదనోర్ ను పరిత్యజించివలసి వచ్చింది, అతను దాని సంపద మాత్రం శ్రీరంగపట్నానికి చేర్చగలిగాడు. హైదర్ యుద్ధానికి నష్టపరిహారంగా 35 లక్షల రూపాయల చెల్లించాడు. అతను తను ఆక్రమించిన చాలా భూభాగాలను తిరిగి ఇచ్చి వేశాడు. కానీ సీరాను మాత్రం ఉంచుకున్నాడు.[45][46]
1766 లో హైదర్ ఆలీ మలబార్ తిరిగి వచ్చాడు.కానీ ఇప్పుడు కాన్ననోర్ రాజా యొక్క ఆహ్వానం మేరకు హైదర్ ఆలీ మలబార్ కు తిరిగి వచ్చాడు. ఈయన జమోరిన్ నుండి స్వాతంత్ర్యం కోరుతున్నాడు.కాలికట్ కు చెందిన ఈ పాలకుడు కాన్ననోర్ పై ఆధిపత్యం వహించాడు.ఇఓతకు ముందు జరిగిన్ యుధ్ధాలలో జమోరిన్ హైదర్ ప్రత్యర్థులు మద్దతునిచ్చాడు. దీనికి గాను నష్టపరిహారం చెల్లించమని హైదర్ జమోరిన్ ను కోరాడు. ఒక కష్టమైన పోరాటం తరువాత హైదర్ కాలికట్ కు చేరుకున్నాడు.ఇక్కడ డబ్బు చెల్లిస్తానని జమోరిన్ మాట ఇచ్చాడు. కనీ విఫలమయ్యాడు. హైదర్ జమోరిన్ ను గృహ నిర్బంధంలో ఉంచాడు.తన ఆర్థిక మంత్రి హింసకు గురి చేశాడు. తనకు అదే గతి పడుతుందని భయపడి జమోరిన్ తన రాజభవనానికి నిప్పు పెట్టి ఆ జ్వాలలోనే మరణించాడు. ఈ విధంగా కాలికట్ పై ఎరాడి రాజవంశ పాలన అంతం అయింది.[47][48] కాలికట్ తన నియంత్రణను ఏర్పాటు చేసిన తరువాత హైదర్ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని నెలల తరువాత నాయిర్లు తన అధికారి రెజా సాహిబ్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు మరల తిరిగి వచ్చాడు. దీనికి హైదర్ కఠినంగా స్పందించాడు:తిరుగుబాటు అణిచిన తర్వాత అనేక మంది తిరుగుబాటుదారులు ఉరితీయబడ్డారు, ఇంకా వేల మంది ఇతరులు మైసూర్లోని కొండప్రాంతాలకు వెళ్ళిపోయారు.[47]
హైదర్ మలబార్ లో ఉండగా మైసూర్ నామమాత్రపు పాలకుడు కృష్ణరాజ ఏప్రిల్ 1766 లో మరణించాడు. హైదర్ కృష్ణరాజ కొడుకు నంజరాజకు పట్టం కట్టవలసిందిగా ఆదేశించాడు. తర్వాత మాత్రమే అతను కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజాకు తన విధేయతను కనపరిచాడు. అతను రాజభవనాన్ని తన ఆధిపత్యాన్ని స్థాపించటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు: రాజా యొక్క ప్యాలెస్ దోచుకొనబడింది, దాని సిబ్బంది మొత్తం హైదర్ ఆలీ గూఢచారులుగా మారిపోయారు.[49]
1766 లో మైసూర్ కు, హైదరాబాద్ నిజాం, బ్రిటిష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ మధ్య భూభాగ సంభందమైన, దౌత్య వివాదాలు ప్రారంభమైయ్యాయి, ఇది అప్పటి భారతదేశం తూర్పు తీరంలో ఎదురులేని యూరోపియన్ వలస శక్తిగా మారిపోయింది. ఉత్తర సర్కారులపై నియంత్రణ సాధించటానికి బ్రిటిష్ వారు చేసే ప్రయత్నాలు పక్కదారి పట్టాలని నిజాం కోరుకున్నాడు, దీనితో హైదర్ ఆలీ కర్ణాటక ప్రాంతంపై ఆక్రమణ ప్రారంభించటానికి మంచి అవకాశం దొరికింది. కంపెనీ ప్రతినిధులు కూడా హైదర్ ఆలీకి విజ్ఞప్తి ఛెశారు కానీ అతను వాటిని తోసిపుచ్చాడు.[50] నిజాం అప్పుడు బ్రిటిష్ మద్రాసు ప్రెసిడెన్సీ వారి మద్దతు కోరుతూ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు, కానీ హైదర్ ఆలీ యుద్ధం కోసం సిద్ధపడ్డప్పుడు వారు సహాయం చేయలేదు, దీనితో బ్రిటిష్ వారితో ఒప్పందం రాదాయి పోయింది. ఈ దౌత్యపరమైన ఎత్తుగడ ఫలితంగా మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం, చంగామ వద్ద గల కంపెనీ అవుట్ పోస్ట్ పై ఆగస్టు 1767 లో హైదర్ ఆలీ నాయకత్వంలోని మైసూర్-హైదరాబాద్ సైనికులతో కూడిన ఒక దళం దాడి చేయడం ద్వారా ప్రారంభమైంది .[51][52] గణనీయంగా బ్రిటిష్ సైనికుల సంఖ్య చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ (బ్రిటిష్ అంచనాల ప్రకారం మిత్రా రాజ్యాల సైన్యం సంఖ్య 70.000 అయితే బ్రిటిష్ సైన్యం పరిమాణం 7.000 మాత్రమే), మిత్రా రాజ్యాల సైన్యం భారీ నష్టాలతో వెనుదిరిగింది. హైదర్ ఆలీ ముట్టడి రెండు రోజుల తరువాత కావేరిపట్నాన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు, అయితే చివరికి చంగామ వద్ద బ్రిటిష్ కమాండర్ అయిన కల్నల్ జోసెఫ్ స్మిత్ సరఫరాలకు అదనపుబలగముల కోసం తిరువన్నమలైకి వెళ్ళీపోయాడు.[51][53] అక్కడ హైదర్ ఆలీ 1767 సెప్టెంబరు 26న జరిగిన నిర్ణయాత్మక పోరాటంలో ఓడిపోయాడు.[54] వర్షాకాలం ప్రారంభంలో, హైదర్ ఆలీ సాధారణ పద్ధతిలో తన పోరాటాన్ని ఆపి వేయకుండా దండయాతను కొనసాగించడానికి నిర్ణయించుకున్నాడు, దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం.[55] కొన్ని చిన్న స్థావరాలను ఆక్రమించుకున్న తరువాత, అతను నవంబరు 1767 లో అంబూర్ ను ముట్టడించాడు, దీని వలన బ్రిటిష్ వారు తిరిగి యుధ్ధాన్ని ప్రారంభించవలసివచ్చింది.[56] అక్కడ ఉన్న బ్రిటిష్ రక్షక దళం కమాండర్ లొంగిపోయేందుకు పెద్ద మొత్తంలో హైదర్ ఆలీ ఇవ్వచూపిన లంచాన్ని తీసుకోవటానికి నిరాకరించారు, డిసెంబరు ప్రారంభంలో ఒక రిలీఫ్ కొలమన్ రాకవలన హైదర్ ఆలీ ముట్టడి ఎత్తివేయకతప్పలేదు.[57] అతను ఉత్తరానికి ఉపసంహరించుకుని నిజాం దళాల కదలికలను దాచి ఉంచడానికి ప్రయత్నించాడు, కానీ యూరోపియన్ అశ్వకదళాల కార్ప్స్ మొత్తం బ్రిటిష్ వారి వైపు వెళ్ళిపోయినప్పుడు తన ఆశను కోల్పోయాడు.[58] ఈ దండయాత్ర వైఫల్యం వలన ఉత్తర సర్కారులలో బ్రిటిష్ వారు విజయవంతంగా ముందుకు వెళ్ళారు, బ్రిటిష్ వారికి, నిజాం అసఫ్ జాకు మధ్య రహస్య చర్చలు ప్రారంభం అయ్యాయి, దీని వలన హైదర్ ఆలీ, నిజాంలు విడిపోయారు. నిజాం హైదరాబాద్ తిరిగి వెనక్కి వచ్చేశాడు చివరకు 1768 లో బ్రిటిష్ కంపెనీతో ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. హైదర్ ఆలీ వివాదానికి ముగింపు కోరుతూ బ్రిటిష్ వారికి శాంతి ప్రతిపాదనను పంపాడు కానీ కంపెనీ దీనిని తోసిపుచ్చింది.[59]
1768 ప్రారంభంలో, బాంబేలోని బ్రిటిష్ ప్రెసిడెన్సీ మైసూర్ లోని మలబార్ తీరంలో ఉన్న భూభాగాలపై ఒక దండయాత్రను యాత్ర నిర్వహించింది.
హైదర్ కనీవినీ ఎరుగని రీతిలో 83.000 మంది గల సైన్యాన్ని సంకూర్చుకున్నాడు. ఇది దక్షిణ భారతదేశంలోనే ఇంతటి వరకు ఉన్న అతి పెద్ద సైన్యాలలో ఒకటి.[60] తన అధీనంలో ఉన్న కమాండర్ల చర్యలు జాగ్రత్తగా సమన్వయపరచి, అతను జూలై 1780 లో తీర సాదా న తూర్పు కనుమలు డౌన్ తుడిచిపెట్టుకుపోయింది, గ్రామీణ ప్రాంతానికి వ్యర్థాలు వేయడం.[60]
He was a bold, an original, and an enterprising commander, skilful in tactics and fertile in resources, full of energy and never desponding in defeat. He was singularly faithful to his engagements and straightforward in his policy towards the British...his name is always mentioned in Mysore with respect, if not with admiration.
Bowring,[61]
తన వీపు భాగానికి క్యాన్సర్ రావడం వలన హైదర్ 1782 డిసెంబరు 6న తన శిబిరంలో మరణించారు, అయితే పర్షియన్ భాషలో కొన్ని చారిత్రక ఆధారాల ఆధారంగా ఇస్లామీయ కేలండర్ లో హిజ్రీ 1 మొహర్రం 1197 నుండి హిజ్రీ 4 మొహర్రం 1197 వరకు తేదీల మధ్య ఆయన మరణం సంభవించింది అని తెలుస్తుంది. ఈ తేదీలులో తేడాలకు కారణం చాంద్రమాన క్యాలెండర్, పరిసర రాజ్యాలలో చంద్రుడు వీక్షణలలో తేడాల వల్ల కావచ్చు.
అయితే టిప్పు మలబార్ తీరానికి తిరిగి వచ్చే వరకు హైదర్ సలహాదారులు అతని మరణాన్ని రహస్యంగా ఉంచటానికి ప్రయత్నించారు. తన తండ్రి మరణం తెలిసిన వెంటనే టిప్పు అధికారం చేపట్టడానికి చిత్తూరు తిరిగి వచ్చాడు. అతని పట్టాభిషేకం సమస్యలు లేకుండా జరగలేదు: మైసూర్ సింహాసనం మీద టిప్పు సోదరుడు అబ్దుల్ కరీంను ఉంచడానికి అతని అంకుల్ చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసాడు.[10] బ్రిటిష్ వారు అది సంభవించిన 48 గంటల లోపు హైదర్ ఆలీ మరణం గురించి తెలుసుకున్నారు, కానీ కూట్ స్థానంలో జేమ్స్ స్టువర్ట్ నియామకాన్ని ఆలస్యం చేయడం వలన వారు సైనికంగా దీనిని అనుకూలంగా మార్చుకోలేక పోయారు తెలుస్తుంది.
హైదర్ ఆలీ రాకెట్లను సైనికంగా వినియొగించడాన్ని మొదలుపెట్టాడు.ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు సమయంలో బ్రిటిష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ స్థావరాలకు, ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉపయోగించారు. రాకెట్ సాంకేతికత చైనా పుట్టినప్పటికీ, 13 వ శతాబ్దం నాటికి భారతదేశం లోను ఐరోపా లోను వాటిని ఉపయోగించినప్పటికీ, ఐరోపా లో కచ్చితమైన ఫిరంగుల అభివృద్ధి వలన ఒక సైనిక రాకెట్ల సాంకేతిక వెనుకబడింది.[62] హైదర్ తండ్రి కాలానికే ఈ రాకెట్ సాంకేతిక వాడుకలో ఉంది (అతను 50 మంది రాకెట్ మన్ లకు నాయకత్వం వహించాడు). హైదర్ వాటిని అభివృద్ధి చేసి సైన్యంలో వాటి ఉపయోగాన్ని గణనీయంగా విస్తరించాడుఈ నూతన సాంకేతిక ఆవిష్కరణలలో భాగంగా దహన గది కోసం అధిక నాణ్యత ఇనుము తొడుగుని ఉపయోగించడం (అప్పుడు ఐరోపా లో అందుబాటులో కంటే మెరుగైనది) జరిగింది, అధిక-శక్తితో పేలుడును జరిపించవచ్చు. అతను కూడా రాకెట్ మన్ కంపెనీలను వ్యస్థీకరించాడు. వారు లక్ష్యం యొక్క దూరం, రాకెట్ పరిమాణం ఆధారంగా రాకెట్లలను ప్రయోగించడంలో నిపుణులు. రాకెట్స్ లను బండ్లపై ఉంచడం జరిగింది, దీని వలన వాటిని రవాణా తేలికై వాటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయోగించడం సాధ్యం అయ్యింది .[63] హైదర్, టిప్పు అభివృద్ధి చేసిన రాకెట్ల వలన బ్రిటన్ లో వాటి సాంకేతికపై ఆసక్తి పునరుధ్ధరించబడింది, అక్కడ 2 వ బరోనేట్ సర్ విలియం కాంగ్రేవ్కు మైసూర్ నుండి రాకెట్ కేసులు అందించబడి 19 వ శతాబ్దం ప్రారంభంలో కాంగ్రేవ్ రాకెట్ లు అని పేరొందిన రాకెట్ ల అభివృద్ధి సాధ్యపడింది.[64]
హైదర్ యొక్క సమయంలో మైసూర్ సైన్యంలో రాకెట్ కార్ప్స్ లో 1.200 మంది సైనికులు ఉండేవారు, టిప్పు సమయానికి వీరి సంఖ్య 5.000 కు పెరిగింది. 1780లో రెండవ యుద్ధం సమయంలో వద్ద పొల్లిల్లూరు వద్ద జరిగిన పోరాటంలో కల్నల్ విలియం బైల్లి యొక్క మందుగుండ నిల్వ డిపోలకు హైదర్ రాకెట్ల తలగిలిన తరువాత జరిగిన విస్ఫోటనం వలన బ్రిటిష్ వారు ఓటమి పాలయ్యారు అని భావిస్తున్నారు.[65]
హైదర్ వ్యక్తిగత జీవిత వివరాలు అసంపూర్ణం ఉన్నాయి.జీవితచరిత్రకారుడు లెవిన్ బౌరింగ్ అతనిని గురించి ఈ విధంగా వివరించాడు. నైతికంగా అతను ఒక మంచి మనిషి కాదు.తన దృష్టిని ఆకర్షించడానికి ప్రత్నించిన ఎవరినీ క్షమించేవాడు కాదు.[66] అతనికి సుమారు ఇద్దరు భార్యలు.అతని రెండవ భార్య ఫకరున్నీసా, ఆమె టిప్పు తల్లి, టిప్పు సోదరుడు కరీం,, ఆమెకు ఒక కుమార్తె.[66][67] తను సావనూర్ నవాబ్ అబ్దుల్ హకీమ్ ఖాన్ సోదరిని కూడా వివాహం ఆడి ఉండవచ్చు.బౌరింగ్స్ దీనిని ఒక వివాహంగా పేర్కొన్నాడు.[66][68] 1779 లో జరిగిన ఒప్పందాన్ని దృఢపరిచేందుకు హైదర్ ఆలీ కుమారుడు కరీం, హైదర్ ఆలీ కుమార్తెలు అబ్దుల్ హకీమ్ పిల్లలను వివాహం చేసుకున్నారు.[68]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.