From Wikipedia, the free encyclopedia
తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి మహాభారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి 'కురుక్షేత్రము' అనే నాటకంగా ప్రదర్శించేవారు. పాండవ ఉద్యోగ విజయాల, కురుక్షేత్రం నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి. ఈ నాటకాలు ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. బావా ఎప్పుడు వచ్చితీవు అని జెండాపై కపిరాజు అనే రాగం తీయని ఆంధ్రుడు ఉండడేమో..పూర్తిగా కాకున్నా, ఈ పద్యాల పూర్వోత్తరాలు తెలియకున్నా, ఈ పద్యాలప్రారంభమైనా ఈ తరం వారికీ కూడా తెలుసు..అంత ప్రాచుర్యం పొందాయి ఈ పద్యాలు.. శ్రీకృష్ణరాయబారం సన్నివేశం ఎన్ని చిత్రాలలో ఉందో, ఈ పద్యాలు ఎన్ని సినిమాలలో ఉన్నాయో గణిచ లేము. అంత ప్రాచుర్యం పొందినవీ నాటకాలు, పద్యాలు..
శ్రీకృష్ణుని సాయ మర్ధించడానికి హస్తిన నుంచి దుర్యోధనుడు, ఉపప్లావ్యం నుండి అర్జునుడు ద్వారకకు వస్తారు. శ్రీ కృష్ణుడు సైన్య విభాగం చేసి, ఒక వైపు తను, మిగిలిన పది వేల గోపకులను ఉంచగా, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పదివేల గోపకులను తన వంతుగా ఆనందంగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు ఉపప్లావ్యానికి వచ్చి పాండవుల అభిప్రాయాలను తెలిసికొని హస్తినకు రాయబారానికి వెళతాడు. పాండవులు సగ రాజ్యబాగమని అడిగిరేని, అట్లు కాకపోతే ఐదూళ్లైనా ఇవ్వమని కోరతాడు. దుర్యోధనుడు అందుకు నిరాకరిస్తాడు. అంతే కాక శ్రీకృష్ణుని బంధించ చూస్తాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపి సభికులవద్ద శలవు తీసుకొని సభనుండి నిష్క్రమిస్తాడు. మరునాడు కర్ణుని కలిసి, అతడు కుంతి్కి కర్ణుని ద్వారా కలిగిన సంతానమని, సూతుని భారయ రాధకు దొరికగా ఆమె సాకిందనీ తెలియ చేసి ద్రౌపది అతడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని, పాండవాగ్రజునిగా రాజ్యపాలన చేయవచ్చని దుర్యోధనుని వీడి రమ్మని పులుకుతాడు. కర్ణుడంగీకరించడు. కుంతి కర్ణుని కలిసి పాండపులకు ప్రాణబిక్ష పెట్టమని కోరుతుంది. అర్జునునికి తప్ప తన వలన ఎవరికీ ప్రాణభయం లేదని అభయమిస్తూడు కర్ణుడు. ఉపపాండవులకు కూడా అపాయం జరగరాదని కుంతి కోరగా, కర్ణుడు అంగీకరిస్తాడు. పాండవ శిబిరంలో యుధ్ద సమీకరణాలు మొదలవుతాయి. శకుని కుమారుడు ఉలూకుడు పాండవ సేన కౌరవ సేనకు సరిపోదని యుధ్దం విరమించుకోమని దుర్యోధనుని మాటగా చెప్పగా, కౌరవులకు జంకేది లేదని పాండవులు ప్రత్యుత్తర మిచ్చి ఉలుకూని గౌరవించి పంపుతారు. రుక్మి పాండవులకు సాయం చేస్తానని రాగా, పాండవులు సున్నితంగా తిరస్కరిస్తారు. యుధ్ధంలో రెండు సైన్యాలు మోహరిస్తాయి.. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోదిస్తాడు. శ్రీకృష్ణుని బోధపై, ధర్మరాజ, భీష్మ, ద్రోణులకు ప్రణమిల్లి వారిని ప్రసన్నం చేసుకుంటాడు. వారి మరణ రహస్యం తెలుసుకుంటాడు.
బావా ఎప్పుడు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
నీ వంశోన్నతి కోరు భీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ
దేవుల్ సేమంబై మెసంగుదురే నీతేజమంబుహెచ్చిమంచున్
ఎక్కడనుండి రాక యిటకు ఎల్లరునున్ సుఖులే కదాయశో
భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును
చక్కగనున్నవారే భుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్
చక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.