పంజాబ్ నేషనల్ బ్యాంకు

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు From Wikipedia, the free encyclopedia

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank - PNB) ను 1895లో లాహోర్లో లాలా లజపతి రాయ్ గారు స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది. భారతీయులు భారతదేశంలో స్థాపించిన బ్యాంకులలో ఇది మొదటిది. 1969, జూలై 19 నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయబడిన 14 బ్యాంకులలో ఇది ఒకటి[1].

త్వరిత వాస్తవాలు పంజాబ్ నేషనల్ బ్యాంకు, తరహా ...
పంజాబ్ నేషనల్ బ్యాంకు
తరహాపబ్లిక్
స్థాపన1895 లో లాహోర్
ప్రధానకేంద్రము ఢిల్లీ, భారతదేశం
కీలక వ్యక్తులుచక్రవర్తి, ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్
పరిశ్రమబ్యాంకింగ్
ఇన్స్యూరెన్స్
పెట్టుబడి మార్కెట్
వెబ్ సైటుwww.pnbindia.com
మూసివేయి
Thumb
పంజాబ్ నేషనల్ బ్యాంక్

చరిత్ర

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 ఏప్రిల్ 12 న లాహోర్ లో రూ .2 లక్షల అధీకృత మూలధనం, రూ .20,000 వర్కింగ్ క్యాపిటల్ తో తన కార్యకలాపాలను ప్రారంభించింది. లాలా లజపతిరాయ్,  ఇ.సి.జెస్సావాలా, బాబూ కాళీ ప్రసోనో రాయ్, లాలా హర్కిషన్ లాల్, సర్దార్ దయాల్ సింగ్ మజిథియా వంటి  దేశభక్తులు భారతీయులు నిర్వహించే మొదటి బ్యాంకును స్థాపించడం ద్వారా వ్యక్తీకరించడంలో ధైర్యాన్ని ప్రదర్శించారు.

1882 నాటి ఇండియన్ కంపెనీల చట్టం VI ప్రకారం ఏర్పాటైన ఈ బ్యాంకు వివేకవంతమైన బ్యాంకింగ్ సాంప్రదాయిక వ్యవస్థతో దేశంలోని ప్రధాన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా తనను తాను దృఢంగా నిలిచింది.బ్యాంకు చరిత్రలో వివిధ కాలాల్లో 7 ప్రైవేటు రంగ బ్యాంకులను స్వాధీనం చేసుకోవడం/విలీనం చేయడం ద్వారా బ్యాంకు అభివృద్ధికి దోహద పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో గణనీయమైన పురోగతిని సాధించి తన వినియోగదారులకు సేవలను అందిస్తుంది[2].

బ్యాంకు కాలరేఖ

  • 1895 : లాహోర్‌లో బ్యాంకు స్థాపన.
  • 1904 : కరాచి, పెషావర్ లలో శాఖల స్థాపన.
  • 1939 : భగవాన్‌దాస్ బ్యాంకు విలీనం.
  • 1947 : దేశవిభజన ఫలితంగా కరాచిలో ఉన్న బ్యాంకు ఆస్తులను పోగొట్టుకుంది. పాకిస్తాన్ లో కూడా బ్యాంకు కార్యక్రమాలను కొనసాగించింది.
  • 1961 : యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం.
  • 1963 : బర్మా (ప్రస్తుత మయాన్మార్) ప్రభుతం రంగూన్ (ప్రస్తుతం యాంగాన్) లో బ్యాంకును జాతీయం చేసింది.
  • 1965 : భారత్-పాక్ యుద్ధం ఫలితంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని శాఖలను స్వాధీనం చేసుకుంది.
  • 1969 : భారత ప్రభుత్వం దీనితో పాటు మొత్తం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
  • 1976 లేదా 1978 : లండన్లో బ్యాంకు శాఖ స్థాపన.
  • 1988 : హిందుస్థాన్ కమర్షియల్ బ్యాంకు విలీనం.
  • 1993 : న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం. (ఇది 1980 లో జాతీయం చేయబడింది)

ఇతర సంస్థలు

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర సహాయక (సబ్సిడరీలు) గా ఉన్న సంస్థలు.[3]

  • పిఎన్ బి గిల్ట్స్
  • పిఎన్ బి హౌసింగ్ ఫైనాన్స్.
  • పిఎన్ బి ఇన్వెస్ట్ మెంట్ సర్వీసెస్.
  • పిఎన్ బి ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్.
  • పిఎన్ బి లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ జాయింట్ వెంచర్స్.
  • ప్రిన్సిపల్ పిఎన్ బి అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ.
  • ప్రిన్సిపల్ ట్రస్టీ కంపెనీ.
  • అసెట్స్ కేర్ ఎంటర్ ప్రైజెస్.
  • ఇండియా ఫాక్టరింగ్ & ఫైనాన్స్ సొల్యూషన్స్.

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.