Remove ads
మేఘాలయ రాష్ట్రంలోని రి-భోయ్ జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
నోంగ్పొ, మేఘాలయ రాష్ట్రంలోని రి-భోయ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. నాంగ్పొ పట్టణం 40వ జాతీయ రహదారిలో, రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నుండి 52 కిలోమీటర్లు, అసోం రాష్ట్రంలోని గువహాటి నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నాంగ్పొ పట్టణం 25.9°N 91.88°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 485 మీటర్ల (1,591 అడుగుల) ఎత్తులో ఉంది. బ్రహ్మపుత్రా నదికి దగ్గరగా ఉండడంవల్ల ఇక్కడ వేసవికాలంలో వాతావరణం తేమగా, వేడిగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పైనాపిల్స్, అరటి, బొప్పాయి, లిచి వంటి పండ్లను పండిస్తారు. నాంగ్పొ నుండి గువహాటికి వెళ్ళే రోడ్డమార్గంలో తమలపాకు గింజ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి .
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నాంగ్పొ పట్టణంలో 17,055 జనాభా ఉంది. ఇందులో 8,536 మంది పురుషులు, 8,519 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 2,993 మంది 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణంలోని అక్షరాస్యుల సంఖ్య 11,610 (68.1%) గా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 68.8% కాగా, స్త్రీల అక్షరాస్యత 67.3% గా ఉంది. నాంగ్పొలో 3160 గృహాలు ఉన్నాయి.[1] ఇక్కడ షెడ్యూల్డ్ కులాల వారు 30 మంది, షెడ్యూల్డ్ తెగల వారు 14,206 మంది ఉన్నారు.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] నాంగ్పొ పట్టణంలో13,165 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. నాంగ్పొ సగటు అక్షరాస్యత రేటు 61% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 63% కాగా, స్త్రీల అక్షరాస్యత 59% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 21% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
నాంగ్పొ పట్టణంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.