తుళు ప్రాంతంలో ప్రాచూర్యం పొందిన దోసె From Wikipedia, the free encyclopedia
నీర్ దోశ (నీటి దోస), తుళు ప్రాంతంలో ప్రాచూర్యం పొందిన దోసె. బియ్యం పిండితో తయారుచేపే ఈ నీర్ దోశ తుళు నాడు ప్రాంతం నుండి వచ్చిన రుచికరమైనది, ఉడిపి - మంగుళూరు వంటకాలలో భాగంగా ఉంది.[1][2]
ఇతర దోశల మాదిరిగా కాకుండా నీర్ దోశ తయారీ పద్ధతి సులభంగా ఉండడం, కిణ్వ ప్రక్రియ లేకపోవడం వల్ల ఈ దోశ ప్రాచూర్యం పొందింది.[3] నీర్ దోశను కొబ్బరి పచ్చడి, సాంబార్, సగ్గు, చికెన్, మటన్, ఫిష్, గుడ్డు వంటి కూరలతో కలిపి వడ్డిస్తారు.[4]
నీర్ దోశ తయారీలో అనేక పద్ధతులు ఉన్నప్పటికీ, వాటన్నింటికీ నానబెట్టిన బియ్యం (లేదా బియ్యం పిండి), ఉప్పు అవసరం.[6]
నీర్ దోశను తయారుచేయడానికి బియ్యాన్ని పులియబెట్టడం అవసరం లేదు. బియ్యాన్ని కనీసం 2 గంటలు నానబెట్టి, గ్రైండర్ లో వేసి మెత్తగా పిండిలాగా చెయ్యాలి. రుచి కోసం ఉప్పును కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని దోశను తయారుచేయడానికి ఉపయోగిస్తారు.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.