From Wikipedia, the free encyclopedia
నిచ్చెన (ఆంగ్లం: Ladder) అనగా నిట్టనిలువుగా గాని వాలుగా గాని ఉండే మెట్లవంటి అమరిక. దీన్ని సాధారణంగా వెదురు, చెక్క లేదా లోహముతో గానీ తయారు చేస్తారు.
నిచ్చెనల్లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్వయంగా నిలబడగల లేదా గోడకు వాల్చి నిలపగల దృఢమైన నిచ్చెనలు. రెండవ రకం, పై నుండి వేలాడదీయగల తాడు లేదా అల్యూమినియంతో తయారు చేసిన, చుట్టేయగల నిచ్చెనలు.
గట్టి నిచ్చెనలు సాధారణంగా పోర్టబుల్ గానే ఉంటాయి. కానీ కొన్ని రకాలు శాశ్వతంగా ఒక నిర్మాణానికి, భవనానికి లేదా పరికరాలకు స్థిరంగా అమర్చేసి ఉంటాయి. వీటిని సాధారణంగా లోహం, కలప లేదా ఫైబర్గ్లాస్తో తయారు చేస్తారు. అయితే ఇప్పుడు కఠినమైన ప్లాస్టిక్‌తో కూడా తయారు చేస్తున్నారు.
నిచ్చెనలు పురాతనమైన సాధనాలు. స్పెయిన్‌లోని వాలెన్సియాలోని స్పైడర్ గుహలలో కనీసం 10,000 సంవత్సరాల పురాతనమైన మధ్య రాతియుగ కాలం నాటి రాతి చిత్రాల్లో ఒక నిచ్చెన కనిపిస్తుంది. ఈ పెయింటింగ్‌లో ఇద్దరు మనుషులు నిచ్చెనను ఉపయోగించి తేనెను తీయడానికి అడవి తేనెటీగల గూటికి చేరుకుంటారు. నిచ్చెన పొడవుగా సరళంగా ఉంది. బహుశా ఒకరకమైన గడ్డితో తయారు చేసి ఉండవచ్చు. [1]
గట్టి నిచ్చెనల్లో రకరకాలున్నాయి. వీటిలో కొన్ని:
Seamless Wikipedia browsing. On steroids.