From Wikipedia, the free encyclopedia
నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి సంగీతకారుడు. ఆయన ప్రతిఫలాన్ని ఆశించకుండా సంగీతాన్ని విద్యార్థులకు చేరవేయుట కొరకు సారణి సంగీతవిద్యా, సేవాసంస్థను స్థాపించారు. ఆయన అద్భుతంగా కచేరీ చేయటంతో పాటు, సంగీతాన్ని ఉచితంగా నేర్పించి శిష్యులను తయారు చేస్తున్నారు.ఆయన చేస్తున్న ఈ సంగీత సేవ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి అద్వితీయమై అనిర్వచనీయమై అందరికీ మార్గదర్సకంగా నిలుస్తుంది.[1]
నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి |
ఇతర పేర్లు | Parthasarathy Ayyangar |
జననం | మచిలీపట్నం , కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మూలం | Telangana |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | శాస్త్రీయ సంగీత గాయకుడు, గురువు |
వాయిద్యాలు | గాత్రం (గానం) |
శ్రీమాన్ పార్థసారథి "నల్లాన్ చక్రవర్తుల" అనే సంగీత,సాహిత్యానికి అంకితమైన కుటుంబంలో జన్మించారు. శ్రీపార్ధసారథి తల్లిదండ్రులు ఎన్.సి.రామానుజమ్మ, ఎన్.సి.ఎన్.బి.ఆచార్యులు. శ్రీపార్ధసారథి శ్రీమాన్ శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద ప్రాథమిక సంగీత జ్ఞానాన్ని పొందారు. ఆ తరువాత శ్రీమాన్ కారైకుడి కన్నన్, పెదనన్నగారైన సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీత, సాహిత్య జ్ఞానాన్ని అభ్యసించారు. శ్రీపార్ధసారథి భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధులైన శ్రీమాన్ డి.రాఘవాచారి, డి.శేషాచారి హైదరాబాద్ బ్రదర్స్ వద్ద సంగీత సాధనలో మెరుగులు దిద్దుకొన్నరు. ప్రముఖ సంగీత విద్వాంసులైన డా.ఎం.బాలమురళీకృష్ణ, డి.కె.పట్టమ్మాళ్, నూకల చిన్న సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, ఎన్.ఎస్.శ్రీనివాసన్ వంటి విద్వాంసుల మన్ననలను విరివిగ ఆపాదించుకొని వర్ధమాన గాయకుడుగా, అమృతతుల్యమైన వాక్శుద్ధితో సుస్వరాల్ని పిల్లలకి అతి తేలికగా నేర్పే గురువుగా అద్భుతమైన పేరుని, కీర్తిని గడిస్తున్నరు. ఆకాశవాణి, దూరదర్శన్ ప్రముఖ సంగీత విద్వాంసులైన శ్రీపార్ధసారథి సంగీతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి పోస్టు డాక్టరేట్ పొంది గురు పీఠాన్ని అధిష్టించారు. పార్ధసారథి 2002లో భారత ప్రభుత్వ "మానవవనరుల మంత్రిత్వశాఖ" నుండి సి.సి.ఆర్.టి స్కాలర్షిప్, 2005 లో చెన్నై లోని "సుందరం అయ్యర్ ట్రస్టు" నుండి సెమ్మంగూడి శ్రీనివాసఅయ్యర్ ఫెలోషిప్ పొందారు. శ్రీపార్ధసారథి సప్తస్వర విద్వాన్మణి, సంగీత రథసారథి, సంగీత గానవారధి, యువకళా భారతి వంటి బిరుదులను అనేక పురస్కారాలను పొందారు. శ్రీపార్ధసారథి తన ఆరవ యేట నుండి సంగీత కచేరీలను ప్రారంభించి, దేశ విదేశాలలో అనేక సంగీత ప్రదర్శనలలిస్థూ, తనదంటూ ఒక ప్రత్యేకతను ప్రతిబింబించుకొని శ్రోతలను తన గానామ్రుతంలో ముంచెత్తి ఓలలాడిస్తున్నరు. "ఉచిత సంగీతశిక్షణా శిబిరాన్ని" నడపటమేకాక విదేశాలలో వున్నవారికి "స్కైప్" ద్వరా సంగీతశిక్షణ అందచేస్తున్నరు. అమెరికా, కెనడా, స్విట్జెర్లాండ్, నైజీరియా, న్యూజిలాండ్, అబూదాబి ఇలా అనేకదేశాలలో వుంటున్న తెలుగు, తమిళ, కన్నడ పిల్లలకి, పెద్దలకి సంగీత శిక్షణ అందిస్తున్నరు.
నల్లాన్ చక్రవర్తుల పార్ధసారథి గారు సారణి సంగీతవిద్యా, సేవాసంస్థను www.saaranimusic.org స్థాపించి కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని పెంపొందించుటకు కృషిచేస్తున్నారు. ఉచితంగా విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని అందిస్తున్నారు. పిల్లలకి సంగీత శిక్షణలో కేవలం స్వరాలు, పాటలేకాక గమక శుద్ధత, మౄదుత్వుంగా పాడే విధానం, సాహిత్య స్పష్టత, ఊపిరి నిలిపి పాడే విధనం వంటి అనేకవిషయాలను విద్యార్థులకి భొదించడం జరుగుతొంది. అనేకా కార్యక్రమాలను నిర్వహించదం ద్వారా విద్యార్థులకి అవకాశలు కల్పించటంతో పాటు తెలుగు కళాకారులతొ ప్రర్దర్శనలు నిర్వహిస్తోంది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.