నలంద (Nālānda) భారత దేశమందు ప్రస్తుత బీహరు రాష్ట్రంలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలందా అనే సంస్కృత పదం నలం (అనగా కమలం అని అర్థం, కమలం జ్ఞానికి చిహ్నం), ద (అంటే ఇవ్వడం) అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టింది.[2] చైనా తీర్థయాత్రీకుడైన హ్యూయన్ త్సాంగ్[3] నలందా పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్ త్సాంగ్ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే నలందా అన్న పేరు వచ్చిందని వివరించాడు.
नालंदा | |
స్థానం | Bihar, భారతదేశం |
---|---|
రకం | Centre of learning |
చరిత్ర | |
స్థాపన తేదీ | 5th century CE |
వదిలేసిన తేదీ | 13th century CE |
ఘటనలు | Ransacked by Bakhtiyar Khilji in సుమారు 1197 CE |
స్థల గమనికలు | |
తవకాల తేదీలు | 1915–1937, 1974–1982[1] |
వెబ్‌సైటు | Nalanda (ASI) |
ఇది పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం సా.శ. 427 నుంచి సా.శ. 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికముగా పాల వంశము యొక్క పాలనలో ఉంది.[4][5] ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాలలో ఒకటి."[5] నలంద 25.135766°N 85.444923°E అక్షాంశరేఖాంశాల వద్ద ఉంది. అలెగ్జాండర్ కన్నింగ్‌హాం నలందను బారాగావ్ గ్రామంగా గుర్తించాడు[6].
తారానాథుడను చరిత్రకారుడీ స్థలమున శారిపుత్తుడను భిక్షువు జన్మించెననియూ, నాతని చైతన్యమును జేరి అశోకుడు చక్రవర్తి యొక ఆలయమును నిర్మించెనని వ్రాసి యున్నాడు. హ్యూన్ ష్వాంగ్ అనునాతడు శక్రాదిత్యుడను రాజు నాలందాసంఘారామమును నిర్మించెననియు, ఆతనికి పిమ్మట రాజ్యమేలిన బుధగుప్త, తధాగతగుప్త, బాలాదిత్య, వజ్ర అనువారులిచట అనేక భవనములను నిర్మించెనారని వ్రాసియున్నాడు. అటుపైనింకొకరాజీయారామములచుట్టు నొక గోడను గట్టించి అందొక ద్వారమును వేయించెను. ఇచ్చటి ఆచార్యులలో నాగార్జున, అశ్వఘోష, వసుబంధ, దిజ్ఞాగ, కమలశీల, సంఘభద్ర, శాంతరక్షిత, వీరదేవ, మంజుశ్రీదేవ మున్నగువారల పేరులు వినవచ్చుచున్నవి.
బుద్ధుని కాలంలో నలందా (సా.శ.పూ.500)
బుద్ధుడు చాలా సార్లు నలందా చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చెప్పబడింది. ఆయన నలందను సందర్శించినప్పుడు సాధారణంగా పావారిక మామిడితోపులో బస చేసేవాడు, అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు[7], కేవత్తతో[8], అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది[9].
బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలము ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసమును పునరుద్ఘాటిస్తూ సింహ ఘర్జన చేశాడు.[10]. రాజ్‌గిర్ (రాజగృహ) నుండి నలందకు వెళ్ళే మార్గము అంబలత్తికా గుండా వెల్తుంది.[11] అక్కడి నుండి ఆ మార్గము పాట్నా (పాతాలీగామా) వరకు వెళ్ళేది.[12]. రాజగృహకు, నలందకు మధ్యన బహుపుత్త చేతియ ఉంది.[13].
కేవత్త సుత్త ప్రకారం[14], బుద్ధుని కాలానికే నలంద ప్రాముఖ్యత కలిగి నిండు జనాభాతో వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలా కాలానికి గానీ విద్యాకేంద్రముగా అభివృద్ధి చెందలేదు. సమ్యుత్త నికాయ లోని[15], ఒక రికార్డులో నలంద బుద్ధునికాలములో తీవ్ర క్షామానికి గురైనదని నమోదు చేయబడింది. బుద్ధుని కుడిభుజము వంటి ఆయన శిష్యుడైన సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు.[4]
నలందా, సొన్నదిన్న యొక్క నివాస స్థలము[16]. ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలందలో మహావీరుడు అనేక పర్యాయములు బసచేసినాడని పేర్కొనబడింది. మహావీరుడు నలందలో ఉన్నపవపురిలో మోక్షాన్ని పొందినట్టుగా భావిస్తారు. (అదేకాక జైనమతంలోని ఒక తెగ ప్రకారం, మహావీరుడు నలంద సమీపాన ఉన్న కుందల్‌పూర్ లో జన్మించాడు).[ఆధారం చూపాలి]
అశోకుడు (క్రీ.పూ.250) ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు[4]. టిబెట్ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు[17].
పుట్టుక, నిర్మాణం
చారిత్రక ఆధారాల ప్రకారం నలందా విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో సా.శ. 450 లో నిర్మించబడింది.[4]
నలందా వర్ణన
నలందా ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయము, అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో సుమారుగా 10,000 మంది విద్యర్థులూ 2,000 మంది బోధకులూ ఉండేవారు. పెను గోడ మరియూ ద్వారములతో ఈ విశ్వ విద్యాలయము 'అతి ఘనమైన కట్టడము' గా గుర్తించబడింది. నలందాలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్ళూ, మరియూ ఎన్నొ ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యాన వనాలు ఉండేవి. గ్రంథాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనము. ఇందులో ఎన్నొ గ్రంథాల ములాలు ఉన్నాయి. నలందా విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలందా విద్యార్థులనూ, బొధకులనూ కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కీ వంటి దేశాల నుండి ఆకర్షించింది.[5] తాంగ్ వంశానికి చెందిన చైనా తీర్థ యత్రీకుడు హ్యుయాన్ త్సాంగ్ 7 వ శతాబ్ధపు నలందా విశ్వ విద్యాలయం గురించి వివరాలు సంగ్రహ పరిచాడు. ఈ విద్యాలయమున విశ్వవిఖ్యాతమగు నొక భాండాగారముండెడిది. ఇక్కడ రత్నసాగర, రత్నోదధి, రత్న రంజక అను మూడు భవనములలో నుండెడిదట. రత్నోదధియను తొమ్మిది అంతస్తుల భవనమందు ప్రజ్ఞాపారమితా సుత్రము మున్నగు బౌద్ధ గ్రంథములుండెడివి.[18]
బౌద్ధం మీద ప్రభావం
సా.శ. 9 - 12 వ శతాబ్దంలో ప్రజ్వరిల్లిన టిబెటన్ బౌద్ధత్వం (వజ్రాయన) నలందా బోధకులనుండి, సంప్రదాయాల నుండి ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, జపాన్ లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగింది. థెరవాడ బౌద్ధం కూడా నలందాలో బోధించబడింది. కానీ థెరవాడ బౌద్ధానికి నలందా గట్టి కెంద్రం కాకపొవడం వల్ల, తరువాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.
పతనం
సా.శ. 1193 సం.లో నలందా విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్ ఖిల్జీ నాయకత్వములో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశములో బౌద్ధం యొక్క క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్ యొక్క ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు[ఆధారం చూపాలి]. 1235లో టిబెట్ అనువాదకుడు ఛాగ్ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉంది. గణితము, ఖగోళశాస్త్రము, రసాయన శాస్త్రం స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానము అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనము, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు.[19] దండయాత్రల ప్రధాన మార్గమున ఉన్న దృఢమైన సేన వంశము (సేన) సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గమున లేని కారణమున నలందా, బుద్ధగయ మిగిలినవి. ప్రధాన మార్గమున లేని, ఉత్తర బెంగాల్ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రము హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.ఈ నలంద విద్యాలయంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా ఉండటం
అవశేషాలు
అనేక జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు ఇంకా మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉంది. తెలిసిన, త్రవ్వకాలు జరిపిన అవశేషాలు 150,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. హువాన్ త్సాంగ్ యొక్క వర్ణన ప్రకారం నలందా విస్తృతిని, ఇప్పటి వరకు త్రవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పోల్చి అంచనా వేస్తే, ఇంకా 90% శాతం దాకా అవశేషాలు భయల్పడ లేదు. నలంద ఇప్పుడు నిర్వాసితము. ప్రస్తుతం ఇక్కడికి అతి చేరువలోని జనవాస ప్రదేశం బార్‌గాఁవ్ అనే గ్రామం.
1951లో నవ నలందా మహావిహార అను ఒక ఆధునిక పాళీ, (థేరవాద బౌద్ధం) థేరవాద బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడింది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్ ఇమేజింగ్ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలందా మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు, అనేక త్రవ్వకాలలో దొరికిన వస్థువులను ప్రదర్శించుచున్నది.
పునరుద్ధరణకు ప్రణాళిక
2006, డిసెంబర్ 9న న్యూయార్క్ టైంస్ పత్రిక 1 బిలయన్ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్నచోటునే పునరుద్ధరించటానికి రూపకల్పన జరుగుతున్న ప్రణాళికను వివరించింది. సింగపూర్ నేతృత్వములో భారత్, జపాన్, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్ డాలర్లు దానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది.[5]
పునః ప్రారంభం
భారతదేశంలోని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం 2014 సెప్టెంబరు 1, సోమవారము నాడు తిరిగి ప్రారంభమైంది. దాదాపు 800 ఏళ్ల అనంతరం ఈ విశ్వవిద్యాలయంలో తరగుతులు ప్రారంభం కావడం విశేషం. బీహార్ రాజధాని పాట్నాకు 100 కి.మీ. దూరంలో రాజ్‌గిర్ వద్ద ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రాచీన విశ్వవిద్యాలయం కూడా రాజ్‌గిర్‌కు సమీపంలోనే వుండేదని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.భారత ప్రాచీన విజ్ఞానానికి కేంద్రబిందువైన ఈ విశ్వవిద్యాలయం 12వ శతాబ్దంలో విదేశీయుల దాడులతో పూర్తిగా ధ్వంసమైంది. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచనల మేరకు విశ్వవిద్యాలయాన్ని తిరిగి నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కోర్సులను మాత్రమే ఏర్పాటుచేసినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలో విస్తరణ వుంటుందని వారు వెల్లడించారు.
చిత్రమాలిక
- విశ్వవిద్యాలయాన్ని త్రవ్వితీయక మునుపు నలందా మట్టిదిబ్బలు.
- సారిపుత్త స్తూపం ముందువైపు
- సారిపుత్త స్తూపం వెనుకవైపు
మూలాలు
బయటి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.