Remove ads
భారతీయ నటి From Wikipedia, the free encyclopedia
నర్గిస్ దత్ (ఆంగ్లం :Nargis Dutt) (హిందీ: नर्गिस, ఉర్దూ: نرگس) (జూన్ 11929 – మే 3, 1981), వెండితెర పేరైన నర్గిస్ తోనే ప్రసిద్ధి.,[1] భారతీయ సినిమారంగ నటి. 1940 నుండి 1960 వరకూ ప్రస్థానం. తన విజయవంతమైన కెరీర్ తో విమర్శకులు సైతం అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది. ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా (1957), అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. 1958 లో నర్గిస్ పెళ్ళి సునీల్ దత్ తో జరిగింది. 1967లో నటించిన రాత్ ఔర్ దిన్లో ఈమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది.
నర్గిస్ | |
జన్మ నామం | ఫాతిమా రషీద్ |
జననం | జూన్ 1, 1929 కోల్కతా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
మరణం | మే 3, 1981 (వయస్సు 51) బాంబే, మహారాష్ట్ర, భారతదేశం |
క్రియాశీలక సంవత్సరాలు | 1935, 1942 – 1967 |
భార్య/భర్త | సునీల్ దత్ (1958 – 1981) |
పిల్లలు | సంజయ్ దత్ అంజు ప్రియా దత్ |
Filmfare Awards | |
---|---|
ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు: మదర్ ఇండియా (1958) |
నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్, అలహాబాదుకు చెందిన ముస్లిం-గాయని జద్దన్ బాయి, తండ్రి హిందువు మోహ్‌యాల్ రావల్పిండికి చెందినవాడు[2] నర్గిస్ అన్న అన్వర్ హుసేన్, హిందీ నటుడు.
నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా 1935 లో తలాషె హక్ తన ఆరవయేట నటించింది. ఈ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్, ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించింది. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో నటించింది. ఈమె విజయవంతమైన హిందీ-ఉర్దూ సినిమాలు 1940 - 1950 ల మధ్య విడుదలైన బర్సాత్ (1949), అందాజ్ (1949), ఆవారా (1951), దీదార్ (1951), శ్రీ 420 (1955), చోరీ చోరీ (1956). ఈమె చాలా సినిమాలు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే.
తన ప్రసిద్ధిగాంచిన చిత్రం మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్-అవార్డుకు నామినేట్ చేయబడిన జానపద-కథ మదర్ ఇండియా (1957). ఈ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. 1958లో సునీల్ దత్ తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం 1967 నాటి రాత్ ఔర్ దిన్, ఈ చిత్రం ఈమెకు జాతీయ ఉత్తమ నటి బహుమతి తెచ్చి పెట్టింది.
తరువాతి కాలంలో ఈమె పాంక్రియాటిక్ కేన్సర్ వ్యాధి బారిన పడింది. 1981 మే 2 కోమాలోకి వెళ్ళింది, 1981 మే 3 న మరణించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.