భారతీయ చిత్రకారుడు, చిత్రకళా మహామహోపాధ్యాయుడు From Wikipedia, the free encyclopedia
పద్మభూషణ శ్రీ నందలాల్ బోస్ విశ్వవిఖ్యాత కళాకారుడు. భారతీయ కళా సంప్రదాయాన్ని దిగంతాలకు విస్తరింపజేసిన మహాశిల్పి. భారతీయ కళా హృదయాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు.ఆయన గాంధీజీ, రవీంద్రుల ప్రేమాదరరాలను చూరగొన్న గొప్ప కళాకారుడు.
నందలాల్ బోస్ নন্দলাল বসু | |
---|---|
జననం | బానిపూర్,హౌరా జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సి, బ్రిటీష్ ఇండియా(ప్రస్తుతం బీహార్, భారతదేశం)[1] | 1882 డిసెంబరు 3
మరణం | 1966 ఏప్రిల్ 16 83) కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | (వయసు
జాతీయత | భారతీయుడు |
రంగం | పెయింటింగ్ |
నందలాల్ వంగభూమిలో ఒక కుగ్రామం లో 1883 లో జన్మించారు. చిన్నతనం లో ఆయన తన గ్రామంలో బంకమట్టి బొమ్మలు చేసేవారు. బొమ్మలు చేసే పద్దతులను చూస్తూ, వారిలాగా బొమ్మలు చేయటానికి ప్రయత్నిస్తూ గడిపేవారు. అప్పుడు కాలేజీలో చేరటానికి ప్రవేశ పరీక్ష ఉండేది. నందలాల్ హైస్కూల్ లో చదివి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్నుడైన తరువాత కాలేజీ ఆర్ట్స్ విభాగం మొదటి సం.లో చేరారు. వర్డ్స్వర్త్ కవితా పఠాలను చదువుతున్నాప్పుడు వాటిని వ్రాయటానికి మారు పద్యాలను చిత్రించేవారు. తరువాత ఆయన కలకత్తాలో ప్రెసిడెన్సీ కళాశాలలో కామర్స్ కోర్సులో చేరారు.
కలకత్తాలో ఆయన బంధువు ఒకరు ప్రభుత్వ లలిత కళా పాఠశాలలో చిత్రలేఖనం మొదలయిన లలిత కళలు నేర్చికొనేవారు. యువకుడైన నందలాల్ గారు అతని దగ్గర లలితకళను నేర్చుకొన్నారు. అతడేమో తను లలిత కళా పాఠశాలలో నేర్చుకొన్న నిశ్చల ప్రకృతి దృశ్య చిత్రణం, వర్ణచిత్రణం, మొదలయినవి ఇతనికి నేర్పాడు. నందలాల్ గారు చివరికి కాలేజీ చదువుకు స్వస్తి చెప్పి ఇంటినుంచి పంపిన డబ్బుతో చిత్రలేఖనంకు చెందిన పరికరాలను, సుప్రసిద్ధ కళాకారుల చిత్రాల ప్రతిరూపాలును కొనేవారు. వాటిని నకలుచేస్తూ తన బంధువు దగ్గర పాఠాలు నేర్చుకొంటు కొంతకాలం గడిపారు.
ఈ సెకెండ్ హాండ్ పాఠాలు కొంతకాలానికి అయనకు సంతృప్తి కలిగించలేదు. గురువును అన్వేషించసాగారు. ఆయన అప్పుటికే మంచి చిత్రకారుడైన అబనీంద్రఠాగూర్ గురుంచి విని వారి చిత్రాలను బాగా పరిశీలించి సుదూర ప్రాంతాలనుంచే వారిని ఆరాధించేరారు. చివరికి అబనీంద్రఠాగూర్ ఉపాధ్యాయుడిగా ఉన్న లలిత కళాశాలలో నిశ్చయించుకొని, ఆయన వద్దకు పోయి నందలాల్ గీసిన చిత్రాలను చూపించగా వారు కాలేజీ ప్రిన్సిపల్ అయిన హావెల్ కు చూపించి వారికి అవినచ్చగా కాలేజీలో ప్రవేశం కల్పించారు.
అబనీంద్రనాధ్ గారు నందలాల్ విషయంలో శ్రద్ధ వహించారు. ఆయనలో నందలాల్కు ఆదర్శ గురువు కనిపించారు. అబనీంద్రనాధ్ గారు ఎప్పుడు ఇది ఇట్లా అని పాఠం చెప్పేవారు కారు. కేవలం మార్గదర్శకుడిగా ఉండేవారు. విద్యార్ధి తన వ్యక్తిత్వాన్ని తానే అభివృద్ధి చేసుకోవాలని ఆయన అభిప్రాయం. ఆయన నాలో "కళాకారుడిని సృష్టించారు" అని నందలాల్ వారిని గురుంచి తరువాత అంటారు.
నందలాల్ ధ్యానపూర్వక మనస్సుతో భారత ఇతిహాస గాధలలో ప్రవహించే చైతన్య స్వరంతిని మననం చేసుకొని తను సాక్షాత్కారం రూపింది చిత్రించడం సులభమని భావించారు. ఆవిధంగానే ఆయన తన విశిష్ట చిత్రాలను చిత్రించారు. వాటిలో "సుద్ధార్ధుడు", "క్షత రాజహమంసం", "పరమశివుని ప్రళయతాండవం", "భీష్మ ప్రతిజ్ఞ" మొదలయినవి ఉన్నాయి. హావ్లె ఆచిత్రాలను చూసి అతని విలక్షణ రచనా రీతికి చిత్రభూమిక కూడా విస్తృతంగా ఉండాలని సూచించారు. బరోడాదర్బార్ ఆదేశంపై ఆయన బరోడాకీర్తిమందిర్ లో రచించిన కుడ్యచిత్రాలు, శాంతినికేతన్ లో రచించిన కుడ్యచిత్రాలు ఆయన రచనకు తగినవని హావెల్ అన్నారు.
అబనీంద్రనాధ్ గారు పదవీ విరమణ చేసినప్పుడు ఆపదవి నందలాల్ కు ఇస్తామన్నారు. కాని ఆయన తన గురువుగారి వెంట టాగోర్ కళామందిరం లో పనిచేయటానికి నిర్ణయించుకున్నారు.అక్కడ చిత్రాలను గీయుటకు డాక్టర్ కుమారస్వామికి తోడ్పడ్డారు. నందలాల్ మరొక మిత్రుడు జపాను వాస్తవ్యుడు నందలాల్ కలిసి పనిచేసి కళలో వంగ సాంప్రదాయానికి పలు సేవలు అందించారు.
నందలాల్ తన చిత్రాలను అమ్ముతూ ఉత్తర దక్షిణ భారతం లోని సుప్రసిద్ధ కళాక్షేత్రాలను దర్సించి ఆప్రాంతాల కళావాస్తు శిల్ప రీతులను ఆకళించుకున్నారు.
అజంతా గుహలు చిత్రాలను నకలు చేయటానికి 1909లో శ్రీమతి హారింగ్ హాం భారతదేశానికి వచ్చినప్పుడు ఆమెకు తోడ్పడడానికి నియమితులైన కళాకారులలో నందలాల్ గారు ఒకరు. అది అయ్యాక, తరువాత ఆయన బాగ్ గుహలు ను కూడా దర్సించారు.
రవీంద్రనాధ టాగూరు గారు 1916లో '''విచిత్ర క్లబ్ ''' ను ప్రారంభించినప్పుడు నందలాల్ గారు ఆక్లబ్బు కళాకారులలో ఒకరు. 1919లో జగదీశ్ చంద్ర బోస్ పరిశోధనా సంస్థలో కుడ్య చిత్రాలు రచించినారు.
నందలాల్ గారు అప్పుడప్పుడు శాంతినికేతన్ లో పాఠాలు చెప్పేవారు. 1923లో ఆయన తన గురువైన అబనీంద్రనాధ్ గారి అనుమతితో శాంతినికేతన్ లోను కళాభవన్ కు డైరక్టర్ గా అయ్యారు.అక్కడ అందరూ ఆయనని మాష్టర్ మాషాయ్ అని చనువుతో పిలిచేవారు. అప్పుడే రవీంద్రునికి నందలాల్ గారికి సానిహిత్యం ఏర్పడినది. 1924లో టాగూర్ జపాను-బర్మా-దేశాలకు వెళ్ళినప్పుడు వార్ వెంట నందలాల్ గారిని వెంటపెట్టుకు వెళ్ళారు.
నందలాల్ పలు ప్రంపంచదేశాల చిత్రకళను అభ్యసిస్తూ, వారు 80 వ ఏట కుంచె సిరాలతో రచనలు ప్రారంభించారు.
మహాత్మా గాంధీ లక్నో, జైపూర్ కాంగ్రెస్ మహాసభల అలంకరణ బాధ్యతను నందలాల్ గారిని చేయమని కోరారు. ఆ సభలలో నందలాల్ గారు ఏర్పరచిన చిత్రాలకు బహు ప్రశంసలు పొందినారు. శ్రీ నందలాల్ గారు 1947లో డిల్లీలో జరిగిన ఆసియా సంబంధాల మహాసభ మండపాల అలంకరణను కూడా చేశారు. యూనియన్ ప్రభుత్వం భారత రాజ్యాంగ లిఖిత ప్రతిలో చిత్రాలు గీయటానికి నందలాల్ ను నియమించింది.
నందలాల్ గారు వస్తువేమో భారతీయ పురాణేతిహాసాలనుంచి, ప్రకృతిని నుంచి గ్రహించారు అనేవారు. 1952లో నందలాల్ గారికి కాశీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ బిరుదం ఇచ్చింది. విశ్వభారతి 1950 లో "దేశికోత్తమ" బిరుదు ఇచ్చింది. భారత ప్రభుత్వం 1955 లో '''పద్మవిభూషణ్''' బిరుదుతో గౌరవించింది.
అతను 1966 ఏప్రిల్ 16న శాంతినికేతన్ లో కీర్తిశేషులైనారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.