నందమూరి లక్ష్మీపార్వతి
From Wikipedia, the free encyclopedia
లక్ష్మీపార్వతి (ఆగష్టు 10, 1962) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు.
నందమూరి లక్ష్మీపార్వతి | |
---|---|
![]() నందమూరి లక్ష్మీపార్వతి | |
జననం | నందమూరి లక్ష్మీపార్వతి ఆగష్టు 10, 1962 |
ఇతర పేర్లు | లక్ష్మీపార్వతి |
ప్రసిద్ధి | నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు. తెలుగు రచయితలు |
మతం | హిందూ మతము |
భార్య / భర్త | నందమూరి తారక రామారావు |
పిల్లలు | ఒక కుమారుడు |
జననం
1962, ఆగష్టు 10 న జన్మించింది. తెలుగులో రచయిత, తెలుగుదేశం పార్టీ అభిమానురాలైన లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవితచరిత్ర వ్రాసే ఉద్దేశముతో ఆయన్ను కలుసుకున్నది. పట్టుదలతో ప్రయత్నించి రామారావు నుండి జీవితచరిత్ర వ్రాయటానికి అనుమతి సంపాదించి 1987లో రామారావు ఇంట్లోనే నివసించే అవకాశాన్ని పొందింది.[1] లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు జీవితచరిత్రను వ్రాసే సమయంలో రామారావుకు సన్నిహితమై 1993లో వివాహం చేసుకున్నది.
ఈమె తొలి భర్త హరికథా కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావుతో ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. ఈమె మొదటి భర్తనుండి 1993 ఏప్రిల్ 15న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నది.[2] 1993, సెప్టెంబరు 10న రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. 1994 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భర్త NTR తో కలిసి పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. NTR విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. కానీ తరువాత ఆమె పాలనలో జోక్యం చేసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసాయి. తరువాత జరిగిన పరిణామాలలో 1995 ఆగస్ట్ లో NTR చిన్న అల్లుడైన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో NTR కుటుంబ సభ్యులు తిరుగుబాటు చేయగా ఆయన పదవిని కోల్పోయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగిన కొన్ని నెలలకే జనవరి, 1996 లో NTR మరణించారు.
ఎన్టీ రామారావు మరణానంతరము ఆయన జీవితచరిత్రను "ఎదురులేని మనిషి" అన్న పేరుతో 2004లో విడుదలయ్యింది
శాసనసభ సభ్యురాలిగా
- 1996 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలలో శ్రీకాకుళము జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసిన లక్ష్మీ పార్వతి, తన సమీప ప్రత్యర్థియు తెలుగు దేశ అభ్యర్థియునైన వేణమ్మపై 14148 ఓట్ల తేడాతో విజయం సాధించారు.[3]
- 1999 లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సోంపేట, ఏలూరు నియోజకవర్గములలో పోటీ చేసి రెంటిలోను ఓటమి చెందిరి. సోంపేట లో 1,143 ఓట్లు, అనగా కేవలము 1.23% ఓట్లు పొందిరి. ఏలూరియందు 1,490 ఓట్లు, అనగా 1.28% ఓట్లు పొందిరి. ఈ రెండు నియోజకవర్గములలో నాలుగవ స్థానములో నిలచిరి.
2019 నుండి తెలుగు అకాడమీ అధ్యక్షురాలిగా YSRCP ప్రభుత్వం చే నియమించబడ్డారు. ఆమె 2021లో కొయ్య బొమ్మల (కొయ్య బొమ్మలు) సంప్రదాయ హస్తకళ గురించిన రాధాకృష్ణ చిత్రంలో తొలిసారిగా నటించింది
సూచికలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.