From Wikipedia, the free encyclopedia
ధీరజ్ ప్రసాద్ సాహు (జననం 1959 నవంబరు 23) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2010 జూలైలో కాంగ్రెస్ టిక్కెట్‌పై జార్ఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1]
ధీరజ్ ప్రసాద్ సాహు | |
---|---|
జార్ఖండ్ రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు | |
Incumbent | |
Assumed office 2018 మే 4 | |
అంతకు ముందు వారు | ప్రదీప్ కుమార్ బల్ముచు, కాంగ్రెస్ |
In office 2010 జులై 8 – 2016 జులై 7 | |
తరువాత వారు | మహేష్ పొద్దార్, భాజాపా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1959 నవంబరు 23 లోహార్‌దాగా |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లి | శుశీలా దేవి |
తండ్రి | బల్దేయో సాహు |
బంధువులు | శివ ప్రసాద్ సాహు (సోదరుడు) |
కళాశాల | మార్వాడీ కళాశాల, రాంచీ |
జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో సామాజిక కార్యకర్త బల్దియో సాహు, శుశీలా దేవి దంపతులకు ఆయన 1959 నవంబరు 23న జన్మించాడు. ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సాహు సోదరుడు.[2] ధీరజ్ ప్రసాద్ సాహు బిఏ డిగ్రీ పుచ్చుకున్నాడు.[3]
1977లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1978లో జైల్ భరో ఆందోళనలో జైలు పాలయ్యాడు. 2009 జూన్‌లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యాడు. జూలై 2010లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
ఆయనకు చెందిన ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు 2023 డిసెంబరులో చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది.[4] ఇప్పటివరకు ఒడిశా, జార్ఖండ్‌లలోని ఆయన నివాసాలు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అనేక దాడులు నిర్వహించి, ₹351 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఇంకా మూసి ఉన్న లాకర్లను తెరవాల్సి ఉండగా దాడి కొనసాగుతోంది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.