దోర్నాల మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

దోర్నాల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4][5] దోర్నాల మండలం, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది మార్కాపురం  రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[6] OSM గతిశీల పటం

త్వరిత వాస్తవాలు దోర్నాల మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 15.907°N 79.094°E / 15.907; 79.094
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రందోర్నాల
విస్తీర్ణం
  మొత్తం
950 కి.మీ2 (370 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
44,187
  సాంద్రత47/కి.మీ2 (120/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి964
మూసివేయి

మండల గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం దోర్నాల మండల మొత్తం జనాభా 44,187. వారిలో 22,504 మంది పురుషులు కాగా, 21,683 మంది మహిళలు ఉన్నారు.[7] మండలం పరిధిలో మొత్తం 10,834 కుటుంబాలు నివసిస్తున్నాయి.సగటు సెక్స్ నిష్పత్తి 964. సగటు అక్షరాస్యత రేటు 58%, దోర్నాల మండలం లింగ నిష్పత్తి 964.

మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6153, ఇది మొత్తం జనాభాలో 14%.ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 3181 మంది మగ పిల్లలు, 2972 ఆడ పిల్లలు ఉన్నారు. మండల చైల్డ్ సెక్స్ నిష్పత్తి 934, సగటు సెక్స్ నిష్పత్తి (964) కన్నా తక్కువ. మండలంలో మొత్తం అక్షరాస్యత రేటు 58%. పురుషుల అక్షరాస్యత రేటు 59.54%, స్త్రీల అక్షరాస్యత రేటు 39.93%.[6]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. చిన్న ఆరుట్ల
  2. పెద ఆరుట్ల
  3. తుమ్మలబైలు
  4. చింతల
  5. మర్రిపాలెం
  6. పెద బొమ్మలాపురం
  7. దోర్నాల
  8. యడవల్లి
  9. పెదచామ
  10. రోల్లపెంట
  11. పెదమంతనాల
  12. చినమంతనాల
  13. నల్లగుంట్ల
  14. నల్లగుంట్ల గూడెం
  15. యెగువ చెర్లోపల్లి
  16. చిలకచెర్ల గూడెం
  17. ఐనముక్కల
  18. చిన్న దోర్నాల
  19. కాటసానిపల్లి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.