దొండ కాయ

From Wikipedia, the free encyclopedia

దొండ కాయ

దొండ (లేదా తొండ, డొండ) పొదగా పెరిగే తీగపైరు. కాయలు గుండ్రంగా రెండు, రెండున్నర అంగుళాల పొడవున ఉంటాయి. పచ్చికాయలు కూరగా వండుకుంటారు. కొన్ని ప్రాంతాలలో లేత ఆకులను కూడా కూర దినుసుగా ఉపయోగిస్తారు. ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ. దీని సాధారణముగా పందిరిఎక్కించి సాగు చేస్తారు. పచ్చికాయలను ఉట్టిగానే తింటారు కూడా.

త్వరిత వాస్తవాలు దొండ కాయ, Scientific classification ...
దొండ కాయ
Thumb
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
కుకుర్బిటేల్స్
Family:
Genus:
Species:
సి. గ్రాండిస్
Binomial name
కాక్సీనియా గ్రాండిస్ లేదా కార్డిఫోలియా
(లి.) జే. వాయిట్
మూసివేయి
Thumb
దొండకాయలు, కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రం.
Thumb
(Coccinia grandis) తరిగిన దొండకాయలు, మధురవాడలో తీసిన చిత్రం

రకములు

  • దేశవాళీ లేదా చిన్న దొండ లేదా నైజాక దొండ
  • బొబ్బిలి దొండ
  • ఆర దొండ
  • పాము దొండ
  • కాకి దొండ
  • చేదు దొండ, పిచ్చి దొండ
  • జయపూరు దొండ
  • తియ్య దొండ, కూర దొండ, మంచి దొండ

వంటలు

Thumb
దొండకాయ పోపు కూర

దొండకాయను చాలా రకాలుగా వండవచ్చు.

  • దొండకాయ వేపుడు
  • దొండకాయ పులుసు
  • దొండకాయ పప్పు కూర
  • దొండకాయ పచ్చడి
  • గుత్తి దొండకాయ కూర
Thumb
సారల దొండకాయలు. ఇదొక రకం దొండకాయలు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.