From Wikipedia, the free encyclopedia
దేశోద్ధారకులు , 1973లో విడుదలైన ఒక తెలుగు సినిమా. క్రైమ్ కథలో చక్కని పాటలను, మాటలను జోడించడంతో ఇసినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. బ్రౌన్ దొర గెటప్‌లో ఎన్టీయార్ ప్రేక్షకులకు చాలా సరదా కలిగించాడు.[1]
దేశోద్ధారకులు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ, పద్మనాభం, నాగభూషణం, సావిత్రి పద్మా ఖన్నా |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | దీప్తి ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
1974: కైరో చలన చిత్రోత్సవాల్లో ఈచిత్రం ప్రదర్శితమైనది.
ఈ సినిమా కథ చాలా సినిమాలలాగానే ఉంటుంది. పెద్ద మనుషుల ముసుగులో కొందరు దుష్టుల అక్రమాలు ఒక వూరిలో చలామణీ అవుతుంటాయి. వారే ఒక జమీందార్ కుటుంబం ప్రమాదంలో మరణించేలా చేసి వారి వంశపు విలువైన రత్నాభరణాలను హస్తగతం చేసుకొంటారు. అలా మరణించిన జమీందార్ తమ్ముడు (ఎన్టీయార్) బ్రౌన్ దొరగా విదేశాలనుండి రంగంలోకి ప్రవేశిస్తాడు. దుర్మార్గులతో చేతులు కలిపినట్లు నటించి వారి గుట్టు బయట పెడతాడు. 1970 దశకంలో సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను భారీ హంగులతోను, సాంకేతిక విలువలతోను నిర్మించారు.
ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్ళన్నారు నాయాళ్ళు, కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు వంటి పాటలు బాగా హిట్టయ్యాయి. ఇంకా డైలాగులు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. రాజశేఖరంగారూ! మీరు కుక్కకన్నా మిక్కిలి ఎక్కువ విశ్వాసం కలిగినవారు అని బ్రౌన్ దొర గారు వచ్చీరాని తెలుగు నటిస్తూ విలన్‌ను అన్యాపదేశంగా ఎత్తిపొడుస్తాడు.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఇదికాదు మా సంస్కృతి ఇదికాదు మా ప్రగతి | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల |
ఈ వీణకు శృతిలేదు ఎందరికో హృదయంలేదు నా పాటకు పల్లవిలేదు ఈ బ్రతుకెందులకో అర్ధంకాదు | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
స్వాగతం దొరా సుస్వాగతం తేనెలాంటి పిలుపువున్న తెలుగునేలకు అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల, బృందం |
మబ్బులు రెండూ బేటీ ఐతే మెరుపే వస్తుందీ మనసులు రెండూ | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల, బృందం |
ఆకలయ్యీ అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళూ - కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు | కె.వి.మహదేవన్ | బాలు, బృందం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.