దాచేపల్లి

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా పట్టణం, మండలకేంద్రం From Wikipedia, the free encyclopedia

దాచేపల్లి, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన పట్టణం, మండలానికి కేంద్రం.

త్వరిత వాస్తవాలు దాచేపల్లి, దేశం ...
పట్టణం
Thumb
Coordinates: 16.6°N 79.73°E / 16.6; 79.73
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలందాచేపల్లి మండలం
విస్తీర్ణం
  మొత్తం33.58 కి.మీ2 (12.97 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం19,042
  జనసాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి989
ప్రాంతపు కోడ్+91 ( 08649  )
పిన్(PIN)522414 
Website
మూసివేయి

భౌగోళికం

ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 21 కి. మీ. దూరంలో ఉంది.

జనగణన

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4580 ఇళ్లతో, 17238 జనాభాతో 1996 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8620, ఆడవారి సంఖ్య 8618.[1] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,256. ఇందులో పురుషుల సంఖ్య 7,237, స్త్రీల సంఖ్య 7,019, గ్రామంలో నివాస గృహాలు 3,164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,358 హెక్టారులు.

పరిపాలన

దాచేపల్లి నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

జాతీయ రహదారి 167A పై పట్టణం వుంది. సమీప రైల్వే కూడలి దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల నడికుడి

విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

1917 లో ఈ పాఠశాల నిర్మాణానికి కోలా వెంకటరెడ్డి, కోలా కేశవరెడ్డి రెండెకరాల భూమిని విరాళంగా అందజేశాడు. పాఠశాలలో అభివృద్ధిలో భాగంగా దాతలు, పూర్వ విద్యార్థులు తమ వంతు తోడ్పాటు అందించారు.

ఇతరాలు

సమీప ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలో, సమీప వైద్య కళాశాల గుంటూరులో, మేనేజిమెంటు కళాశాల నరసరావుపేటలో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలో వున్నది

ప్రముఖులు

Thumb
ధూళిపాళ సీతారామశాస్త్రి, సుప్రసిద్ధ సినీ నటుడు

ప్రధాన పంటలు

ప్రత్తి, మిరప, వరి

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

  • శ్రీ వీర్లంకమ్మ తల్లి ఆలయం: ఉత్సవ విగ్రహాన్ని, ప్రతి సంవత్సరం ఉగాదిరోజున, పురవీధులలో ఊరేగిస్తారు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.