Remove ads
ఢిల్లీ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గోవా రాష్ట్రం లోని రెండు జిల్లాలలో " సౌత్ గోవా " లేదా దక్షిణ గోవా ఒకటి. కొంకణి భూభాగంలోని జిల్లాలలో సౌత్ గోవా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో నార్త్ గోవా, తూర్పు, దక్షిణ సరిహద్దులో కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా పడమటి సరిహద్దులో అరేబియా సముద్రం ఉన్నాయి.
South Goa జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Goa |
ముఖ్య పట్టణం | Margão |
మండలాలు | Salcete, Mormugão, Quepem, Canacona, Sanguem, Dharbandora |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | South Goa |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,966 కి.మీ2 (759 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 6,39,962 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (840/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 85.53% |
• లింగ నిష్పత్తి | 980 |
ప్రధాన రహదార్లు | National Highway 17, National Highway 4A |
Website | అధికారిక జాలస్థలి |
1510లో సౌత్ గోవా ప్రాంతంలో పోర్చుగీసు కాలనీ స్థాపినచబడింది. 17 - 18 శతాబ్ధాలలో ఆ కాలనీ ప్రస్తుత సరిహద్దుల వరకు విస్తరించబడింది. 1961 డిసెంబర్ 19 లో గోవా భారతదేశంతో విలీనం చెయ్యబడింది. అలోగే మరొక రెండు పోర్చుగీసు భూభాగాలతో చేర్చి కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించబడింది. అలాగే 1965లో గోవా ఒకేఒక జిల్లాగా రూపొందినచబడింది. 1987 మే 30న గోవాకు రాష్ట్ర అంతస్తు ఇస్తూ రెండు జిల్లాలుగా విభజించబడింది. డయ్యూ, డామన్ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలిపోయింది. గోవా నార్త్ గోవా, సౌత్ గోవా అనే రెండు విభాగాలుగా విభజించబడింది.
సౌత్ గోవా జిల్లాకు కలెక్టర్గా ఆర్.మిహర్ వర్ధన్ నియమించబడ్డాడు.[1] ఒక్కో తాలూకాకు ఒక్కో డిప్యూటీ కలెక్టర్, మామ్లాత్దార్లు నియమించబడ్డారు. మార్గావ్ జిల్లా కేంద్రంగా ఉంది.[2]
సౌత్ గోవా జిల్లా కేంద్రం మారిగావ్. జిల్లా మార్గావ్, మర్మగోవా (వాస్కోడిగామా), క్యూపెం 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది. అలాగే మర్మగోవా, సాల్సిటే (మార్గావ్), క్యూపెం, కంకోనా (చౌడి), సంగ్యూం, ధర్బండోరా అనే 6 తాలూకాలుగా విభజ్ంచబడ్డాయి. ప్రత్యేకమైన జిల్లా కార్యాలయాల భవనాలు మార్గావ్లో ఇంటర్సిటీ బస్టాండ్ పక్కన ఉన్నాయి. సాంఘిక కార్యకర్త, మునుపటి మంత్రి అయిన మాథనీ సాల్దంహా తరువాత ఆయన పేరును జిల్లాకార్యాలయాలకు పెట్టారు.[3]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 639,962 [4] |
ఇది దాదాపు | మొంటెగ్రో దేశజనసంఖ్యతో సమానం [5] |
అమెరికాలోని | వెర్మాంట్ నగర జనసంఖ్యకు సమం [6] |
640 భారతదేశ జిల్లాలలో | 515 |
1చ.కి.మీ జనసాంద్రత | 326 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 8.63% |
స్త్రీ పురుష నిష్పత్తి | 980:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 85.53% [4] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
సౌత్ గోవా జిల్లాలో కొంకణి మాతృభాష కలిగిన ప్రజలు అత్యధికంగా ఉన్నారు. తరువాత స్థానంలో మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారు. జిల్లాలో ఆంగ్లం, హిందీ భాషను అర్ధం చేసుకునే ప్రజలు అధికంగా ఉన్నారు. పోర్చుగీసు భాషను మాట్లాడే వారు అర్ధం చేసుకునే వారు స్వల్పసంఖ్యలో ఉన్నారు. కన్నడం, గుజరాతీ, బెంగాలీ, మలయాళ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు ఆయా భాషలను మాట్లాడుతుంటారు.
దక్షిణ గోవాలో ప్రముఖ కళాశాలలు అనేకం విద్యా సంస్థలు ఉన్నాయి :
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.