తెలుగు రచయిత From Wikipedia, the free encyclopedia
తోలేటి వెంకటరెడ్డి తెలుగు సినిమా రచయిత.అనేక సినిమా లకు పాటలు, సంభాషణలు వ్రాశాడు."తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, జీవితం, సంఘం, వదిన లాంటి కొన్ని సినిమాలక్కూడా పాటలు రాశాడు. తోలేటి వెంకటరెడ్డిగా పేరు మార్చినా, అసలు పేరు తోలేటి వెంకటశాస్త్రి".[1]
ఇతడు విజయనగరంలో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత మద్రాసుకు వచ్చి కొలంబియా, హెచ్.ఎం.వి. రికార్డింగు కంపెనీలకు పాటలు వ్రాశాడు. ఇతడు సుమారు 12 సినిమాలకు పనిచేశాడు. తన 41యేట ఇతడు 1955, జూన్ 6వ తేదీన మద్రాసులో మరణించాడు. మరణించేనాటికి ఇతనికి తల్లి, భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.