శ్రీనివాస్ కృష్ణ గోగినేని దర్శకత్వంలో 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia
తుంగభద్ర 2015, మార్చి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో శ్రీనివాస్ కృష్ణ గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, డింపల్ చొపడా, సత్యరాజ్ తదితరులు నటించగా హరి గౌర సంగీతం అందించాడు.[1]
తుంగభద్ర | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ కృష్ణ గోగినేని |
రచన | శ్రీనివాస్ కృష్ణ గోగినేని |
స్క్రీన్ ప్లే | శ్రీనివాస్ కృష్ణ గోగినేని |
కథ | శ్రీనివాస్ కృష్ణ గోగినేని |
నిర్మాత | రజని కొర్రపాటి |
తారాగణం | అదిత్ అరుణ్ డింపల్ చొపడా సత్యరాజ్ |
ఛాయాగ్రహణం | రాహుల్ శ్రీవాస్తవ్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | హరి గౌర |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 20 మార్చి 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తాడికొండ – కర్లపూడి గ్రామాలలోని ఎమ్మెల్యే అభ్యర్థులు పైడితల్లి (కోట శ్రీనివాసరావు) – శివరామకృష్ణ (శివరామకృష్ణ). శివరామకృష్ణ అనుచరుడైన రామరాజు (సత్యరాజ్) కోట అనుచరుడైన త్రిమూర్తులు (చలపతిరావు)ను చంపేయడంతో శివరామకృష్ణ ఎమ్మెల్యే అవుతాడు. పవర్ లేకపోవడంతో కోట మరియ్యు త్రిమూర్తుల ముగ్గురు వారసులు రామరాజుపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంటారు.
ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాక.. రామరాజు అందరికన్నా ఎక్కువగా నమ్మే శ్రీను (అదిత్ అరుణ్)కి తన కూతురు గౌరీ (డింపుల్ చోపడే) వెంట ఎవరో పడుతున్నాడని, వాడి గురించి తెలుసుకొని అవసరమైతే ఫినిష్ చెయ్యమని చెప్తాడు. ఇదే టైంలో శ్రీను – గౌరీల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమ వల్ల రామరాజు ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. అదే టైంలో రామరాజు పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోతుంది. మళ్ళీ పవర్ లోకి వచ్చిన కోట, త్రిమూర్తుల వారసులు రామరాజుని ఏం చేసారు, శ్రీను – గౌరీల ప్రేమకథలో ఏం జరిగిందనేది మిగతా కథ.
2015, మార్చి 20న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలను, నెగిటివ్ రివ్యూలను అందుకుంది.[2][3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.