తిరువళ్ళూర్
తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. From Wikipedia, the free encyclopedia
తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూర్ జిల్లాకు చెందిన పట్టణం.ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం.[1] ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.
తిరువళ్లూరు
తిరు ఎవ్వుల్ | |
---|---|
Suburb | |
తిరుఎవ్వులూర్ | |
![]() | |
Nickname(s): ఎవ్వులూర్, తిరుఎవ్వులూరు, తిరుఎవ్వుల్కిదంతన్ | |
Coordinates: 13.123100°N 79.912000°E | |
Country | India |
State | Tamil Nadu |
District | Tiruvallur district |
Named for | Veeraragava temple |
Government | |
• Type | First grade municipality |
• Body | Tiruvallur Municipality |
• District Collector | Thiru P.Ponnaiah, I.A.S. |
విస్తీర్ణం | |
• Total | 33.27 కి.మీ2 (12.85 చ. మై) |
Elevation | 72 మీ (236 అ.) |
జనాభా (2011) | |
• Total | 56,074 |
Languages | |
• Official | Tamil, English |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 602001-602003 |
Telephone code | 91-44 |
Vehicle registration | TN-20 |
చరిత్ర
ఈ ప్రాంతం 7వ శతాబ్దంలో పల్లవుల పాలనలో ఉంది. 1687లో గోల్కొండ పాలకులు ఓడిపోయి ఈ ప్రాంతం ఢిల్లీ మొఘల్ చక్రవర్తుల అధీనంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక యుద్ధాలకు వేదికగా ఉండేవి. ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి ఆధిపత్య పోరులో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగినట్లు చెబుతారు.
1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో రికార్డ్ అయింది. ఏనుగుల వీరాస్వామయ్య ఆ గ్రంథంలో వ్రాస్తూ: తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని అనే తీర్థమున్నది. అందులో ప్రార్థనలవారు (భక్తులు) బెల్లము వేయిచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహాప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది పేట స్థలము. అన్ని వస్తువులు దొరకును అన్నారు.[2]
జనాభా గణాంకాలు
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, తిరువళ్లూరు నగరంలో 56,074 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 999 స్త్రీల లింగ నిష్పత్తిగా ఉంది.ఇది జాతీయ సగటు 929 కంటే ఎక్కువ.[3] మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 19% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.6% మంది ఉన్నారు. జాతీయ సగటు 72.99%తో పోలిస్తే నగర అక్షరాస్యత రేటు 79.77% ఉంది.[4][5] 2011 మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, తిరువళ్లూరులో 86.45% హిందువులు, 5.88% ముస్లింలు, 6.17% క్రైస్తవులు, 0.02% సిక్కులు, 0.02% బౌద్ధులు, 0.35% జైనులు, 1.12% ఇతర మతాలను అనుసరిస్తున్నవారు, 0.0% ఇతర మతాలను అనుసరించేవారు లేదా 0.0% ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వనివారు ఉన్నారు.[6]
విద్యా సౌకర్యం
తిరువళ్లూరులో పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. అనేక వృత్తిపరమైన సంస్థలు, ప్రత్యేకించి వెటర్నరీ విశ్వవిద్యాలయం, ఈ జిల్లాలో విద్యకు మంచి అవకాశాలు ఉన్నాయి. తిరువళ్లూరులో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలతో సహా అనేక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తిరువళ్లూరు చుట్టుపక్కల కొన్ని ఇంజనీరింగ్, మెడికల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఉన్నాయి.
వీర రాఘవ స్వామి ఆలయం
ప్రధాన వ్యాసం: వీరరాఘవ స్వామి దేవాలయం (తిరువళ్లూరు)

వీర రాఘవ స్వామి ఆలయం విష్ణువును వీర రాఘవుడిగా పూజించే స్థలం. స్థలపురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు.
ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది.
తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు.[7][8]
అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. శని-ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిధి కలదు. రాముల వారికి, శ్రీ కృష్ణుడికి కూడా ప్రత్యేక సన్నిధి ఉన్నాయి. ఆలయంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది
ఈ ఆలయం లోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకలజీవరాసులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కిలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగిచి అరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహజీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలాకాలంగా సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేసాడ్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్ధం ఈ వుళ్ అంటే ఇవ్వడం అని అర్ధం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది.
సమీప దేవాలయాలు
- కక్కలూర్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయం - తిరువళ్లూరు నుండి 3 కిమీ (2 మైళ్ళు), ఈ గ్రామ దేవాలయంలో 12-మీటర్ల (40 అడుగులు) పచ్చని ఏకశిలా గ్రానైట్ విగ్రహం లార్డ్ విశ్వరూప పంచముఖ హనుమాన్ (అ.కా. పంచముఖి హనుమాన్) ఉంది.
- శ్రీ విశ్వరూప పంచముఖ హనుమంతుని ఆలయం - పెరియకుప్పం, తిరువళ్లూరు వద్ద, ఈ 10-మీటర్ల (32 అడుగులు) ఎత్తైన విగ్రహం కర్నాటకలోని హాసన్ నుండి తెచ్చిన ఆకుపచ్చ గ్రానైట్ ముక్కతో తయారు చేయబడింది.
ప్రయాణ మార్గం
తిరువళ్ళూరు చెన్నై నుంచి అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను పక్కనే ఉన్న లోకల్ స్టేషన్ నుంచి తిరువళ్ళూరుకు నేరుగా వెళ్లే రైళ్ళు ఉన్నాయి. అరక్కోణం వెళ్ళే రైలు ఎక్కినా తిరువళ్ళూర్ చేరుకోవచ్చు. సుమారు 1.30 గంట ప్రయాణ సమయం పడుతుంది. తిరువళ్ళూరు రైల్వే స్టేషనులో దిగిన తరువాత కుడివైపుకు వెళ్ళాలి . రైల్వే స్టేషను నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది. గుడి దగ్గరకు వెళ్ళడానికి బస్సు లు, ఆటోలు ఉంటాయి.
చిత్రమాలిక
- తిరువళ్ళూర్ అలయం
- తిరువళ్ళూర్ అలయ హుండీ
- తిరువళ్ళూర్ రైల్వే స్ఠేషన్ సైన్ బోర్డు
- తిరువళ్ళూర్ అలయ మండపం
- వైద్య వీర రాఘవ స్వామి తిరువళ్లూర్
- వైద్య వీర రాఘవ స్వామి ఉత్సవిగ్రహం, తిరువళ్లూర్
ఇవికూడా చూడండి
- వైష్ణవ దివ్యదేశాలు
- పింజివాక్కం - తిరువళ్ళూరు తాలూకా లోని గ్రామం
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.