తిరుమలగిరి సాగర్ మండలం

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

తిరుమలగిరి సాగర్ మండలం

తిరుమలగిరి సాగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 32 కి. మీ. దూరంలోనూ, జిల్లా హెడ్ క్వార్టర్స్ నల్గొండ నుండి ఉత్తర దిశగా 61 కిమీ దూరంలో ఉంది. మండల కేంద్రం తిరుమలగిరి.

త్వరిత వాస్తవాలు రాష్ట్రం, తెలంగాణ ...
తిరుమలగిరి సాగర్
  మండలం  
Thumb
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం తిరుమలగిరి (నల్గొండ జిల్లా)
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 250 km² (96.5 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 38,694
 - పురుషులు 19,946
 - స్త్రీలు 18,748
పిన్‌కోడ్ {{{pincode}}}
మూసివేయి

గణాంకాలు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 250 చ.కి.మీ. కాగా, జనాభా 38,694. జనాభాలో పురుషులు 19,946 కాగా, స్త్రీల సంఖ్య 18,748. మండలంలో 9,634 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులోని అనుమల మండలంలోగల తిరుమలగిరి గ్రామం మండల ప్రధాన కేంద్రంగా తిరుమలగిరి సాగర్ అనే పేరుతో (1+13) పద్నాలుగు గ్రామాలతో కొత్త మండలం ఏర్పడింది.దీనిని 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. నెహతాపూర్
  2. జమ్మనకోట
  3. నెల్లికల్
  4. చింతలపాలెం
  5. తిమ్మాయిపాలెం
  6. తునికినూతల
  7. కోనేరుపురం
  8. శ్రీరామపూర్‌
  9. తిరుమలగిరి
  10. సిల్గాపూర్‌
  11. కొంపల్లి
  12. ఎల్లాపురం
  13. రాజవరం
  14. ఆల్వాల

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.