Remove ads
వ్యంగ్య చిత్రకారుడు From Wikipedia, the free encyclopedia
తలిశెట్టి రామారావు (1896 - 1947) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.
తలిశెట్టి రామారావు | |
---|---|
జననం | తలిశెట్టి రామారావు 1896 మే 20 జయపురం |
మరణం | 1947 మార్చి 14 |
ఇతర పేర్లు | తెలుగు కార్టూన్ పితామహుడు |
వృత్తి | న్యాయవాది |
ఉద్యోగం | జయపురం సంస్థానంలో అసిస్టెంట్ దివాన్ |
ప్రసిద్ధి | తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు) |
భార్య / భర్త | జయలక్ష్మి |
పిల్లలు | కుమారుడు జయరాం, కుమార్తెలు రామకుమారి, రాఘవకుమారి, సీతాకుమారి |
తండ్రి | శీతయ్య |
తల్లి | రామానుజమ్మ |
తలిశెట్టి రామావారు 1896 మే 20న రామానుజమ్మ, సీయయ్య దంపతులకు జయపురంలో జన్మించాడు. గిడుగు రామమూర్తి పంతులు కుమారుడు గిడుగు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.ఏ చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం పార్వతీపురంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు భారతి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కార్టూన్ శకానికి నాంది పలికాడు.
తలిశెట్టి రామారావు పుట్టినరోజునే "మే 20" న ప్రతీ సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం గా జురుపుతున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.